Vijayasai Reddy: ‘మహిళల దగ్గరకెళ్లి ఈ మాట అన్నావనుకో చీపుర్లు తిరగేసి చితగ్గొడతారు’: విజయసాయిరెడ్డి

జగన్ సర్కారు ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన 'దిశ' యాప్ పై టీడీపీ నేత నారా లోకేష్ త‌ప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ వైయ‌స్ఆర్‌సీపీ

Vijayasai Reddy: 'మహిళల దగ్గరకెళ్లి ఈ మాట అన్నావనుకో చీపుర్లు తిరగేసి చితగ్గొడతారు': విజయసాయిరెడ్డి
Vijaya Sai Reddy
Follow us
Venkata Narayana

|

Updated on: Aug 22, 2021 | 8:17 PM

Vijayasai Reddy – Nara Lokesh: జగన్ సర్కారు ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ‘దిశ’ యాప్ పై టీడీపీ నేత నారా లోకేష్ త‌ప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ వైయ‌స్ఆర్‌సీపీ ప్రధాన కార్యద‌ర్శి, ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. దిశ యాప్ వల్ల ప్రయోజనం లేదని ట్వీటుతూ రాక్షసానందం పొందుతున్నావంటూ ఆయన లోకేష్ మీద కామెంట్లు చేశారు. “దిశ యాప్ వల్ల ప్రయోజనం లేదని ట్వీటుతూ రాక్షసానందం పొందితే పొందావు. మహిళల దగ్గరకెళ్లి ఈ మాట అన్నావనుకో చీపుర్లు తిరగేసి చితగ్గొడతారు మాలోకం. యాప్ తో రక్షణ పొందిన వారి పేర్లు పోలీసు విభాగం దగ్గర దొరుకుతాయి. అడిగి తెలుసుకో.” అంటూ విజయసాయి ట్వీట్ ముఖంగా విమర్శించారు.

“దేశంలో మహిళలపై అరాచకాలకు పాల్పడిన ఐదుగురు మంత్రుల్లో బాబు కేబినెట్ లోని అచ్చెన్నాయుడు, దేవినేని ఉమ కూడా ఉన్నారని అప్పట్లో మీడియాలో ప్రముఖంగా వచ్చింది. మహిళలు ఇల్లు దాటి బయటకు రావద్దని, కారు షెడ్లో ఉన్నంత వరకే రక్షణ ఉంటుందని ఉపదేశించింది అప్పటి స్పీకర్ కోడెల కాదా?” అంటూ విజయసాయి మరో ట్వీట్లో విమర్శలు గుప్పించారు.

మరో వైపు, విశాఖలో ఏర్పాటు చేసిన సౌర విద్యుత్ కేంద్రంపై విజయసాయి ఆనందం వ్యక్తం చేశారు. “దేశంలోనే అతిపెద్ద తేలియాడే సౌర విద్యుత్ కేంద్రం మన విశాఖలో ప్రారంభించడం గర్వంగా ఉంది. 25 మెగా వాట్ల సామర్థ్యం ఉన్న ఈ సౌర విద్యుత్ కేంద్రాన్ని సింహాద్రి ఎన్టీపీసీ రిజర్వాయర్ పై 75 ఎకరాల్లో రూ. 110 కోట్లు వెచ్చించి నిర్మించారు” అని విజ‌య‌సాయిరెడ్డి మ‌రో ట్వీట్ చేశారు.

Read also: మూడో అడుగు ఆయన నెత్తిన పెట్టడం ఖాయం, అందుకే అక్కడ దళిత, గిరిజన దీక్ష: రేవంత్ రెడ్డి