Andhra Pradesh: వైసీపీ ఎమ్మెల్యేకు తృటిలో తప్పిన పెను ప్రమాదం.. హైదరాబాద్ నుంచి చింతలపూడి వెళ్తుండగా..

Shaik Madarsaheb

Shaik Madarsaheb |

Updated on: Dec 20, 2022 | 8:34 AM

ఆంధ్రప్రదేశ్‌ అధికార పార్టీ వైఎస్సార్‌సీపీకి చెందిన ఓ ఎమ్మెల్యే ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు. సమయానికి కారు బెలున్లు తెరుచుకోవడంతో ఎమ్మెల్యే, కుటుంబసభ్యులకు ప్రమాదం తప్పింది.

Andhra Pradesh: వైసీపీ ఎమ్మెల్యేకు తృటిలో తప్పిన పెను ప్రమాదం.. హైదరాబాద్ నుంచి చింతలపూడి వెళ్తుండగా..
Mla Eliza

ఆంధ్రప్రదేశ్‌ అధికార పార్టీ వైఎస్సార్‌సీపీకి చెందిన ఓ ఎమ్మెల్యే ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు. సమయానికి కారు బెలున్లు తెరుచుకోవడంతో ఎమ్మెల్యే, కుటుంబసభ్యులకు ప్రమాదం తప్పింది. కామవరపుకోట మండలం ఆడమిల్లి సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఏలూరు జిల్లా చింతలపూడి ఎమ్మెల్యే ఎలీజా కారు అదుపు తప్పి కరెంట్ స్తంభాన్ని ఢీకొట్టింది. హైదరాబాద్ నుంచి జంగారెడ్డిగూడెం వస్తుండగా మంగళవారం తెల్లవారుజామున ఆడమిల్లి దగ్గర ఈ ప్రమాదం జరిగింది.

వేగంతో ఉన్న కారు.. నేరుగా రోడ్డు పక్కనున్న కరెంట్ స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ సమయంలో కార్‌లోని ఎయిర్ బెలూన్స్ ఓపెన్ కావడంతో ప్రమాదం నుంచి అందరూ సురక్షితంగా బయటపడ్డారు. ఈ ప్రమాదం అనంతరం ఎమ్మెల్యే మరో కారులో జంగారెడ్డి గూడెం క్యాంప్ కార్యాలయానికి వెళ్లారు. ఈ కారులో ఎమ్మెల్యేతో పాటు ఆయన కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు.

ఎమ్మెల్యే వీఆర్ ఎలిజా, ఆయన కుటుంబసభ్యులకు ఎలాంటి గాయాలు కాకపోవడంతో అనుచరులు, వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు ఊపిరి పీల్చుకున్నారు. నిద్రమత్తులో ప్రమాదం జరిగిందా.. ఇంకేమైనా కారణాలు ఉన్నాయా అనేది తెలియాల్సి ఉంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ వార్తల కోసం..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu