Andhra Pradesh: సీఎంఓ నుంచి పిలుపొచ్చింది..! రెడీ అవుతున్న మరో లిస్ట్.. ఆ వైసీపీ ఎమ్మెల్యేలకు నో టికెట్..

సమయం లేదు మిత్రమా.. శరణమా..! రణమా..!! ఇదొక సినిమా డైలాగ్.. కానీ, అచ్చం ఇలాంటి పరిస్థితే.. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరింత హీట్ పుట్టిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో ప్రధాన పార్టీలన్నీ స్పీడును పెంచాయి. వ్యూహ ప్రతి వ్యూహాలతో దూసుకెళ్తున్నాయి. ఈ తరుణంలో మరోసారి అధికారమే లక్ష్యంగా వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి నేతృత్వంలోని వైసీపీ మరింత స్పీడును పెంచింది.

Andhra Pradesh: సీఎంఓ నుంచి పిలుపొచ్చింది..! రెడీ అవుతున్న మరో లిస్ట్.. ఆ వైసీపీ ఎమ్మెల్యేలకు నో టికెట్..
Ys Jagan
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jan 23, 2024 | 8:26 PM

సమయం లేదు మిత్రమా.. శరణమా..! రణమా..!! ఇదొక సినిమా డైలాగ్.. కానీ, అచ్చం ఇలాంటి పరిస్థితే.. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరింత హీట్ పుట్టిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో ప్రధాన పార్టీలన్నీ స్పీడును పెంచాయి. వ్యూహ ప్రతి వ్యూహాలతో దూసుకెళ్తున్నాయి. ఈ తరుణంలో మరోసారి అధికారమే లక్ష్యంగా వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి నేతృత్వంలోని వైసీపీ మరింత స్పీడును పెంచింది. సీఎం వైఎస్ జగన్ ఇప్పటికే సర్వేల ఆధారంగా పలు నియోజకవర్గాల్లో అభ్యర్థులను మార్చుతూ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆయా నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితులు.. అంచనాలు.. బలం.. బలగం.. ఇలా చాలా విషయాలను పరిగణలోకి తీసుకుని.. మొదటి విడతలో 11మంది.. సెకండ్ లిస్ట్‌లో 27మంది, మూడో లిస్ట్‌లో 21 మంది.. నాలుగో లిస్ట్‌లో 9మంది ఇన్ఛార్జులను మార్చారు. మొత్తంగా నాలుగు విడతల్లో 58 అసెంబ్లీ,10 లోక్‌సభ స్థానాల ఇన్‌ఛార్జ్‌లని నియమించారు. అయితే, త్వరలోనే మరో రెండు విడతల్లో అభ్యర్థులను మార్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుండటంతో వైసీపీ ఎమ్మెల్యేల్లో టెన్షన్ నెలకొంది.

అభ్యర్థుల ఎంపికపై స్పీడ్‌ పెంచిన వైసీపీ.. ఇన్‌ఛార్జ్‌ల మార్పుపై కసరత్తు చేస్తోంది. ఇప్పటికే దశలవారీగా నియోజకవర్గాల ఇన్‌చార్జ్‌ల నాలుగు లిస్టులు రిలీజ్‌ చేసిన వైసీపీ.. మిగిలిన అభ్యర్థుల ఎంపికపై మరింత స్పీడ్‌ పెంచింది. ఈ తరుణంలో పలువురు ఎమ్మెల్యేలు, నేతలకు సీఎంవో నుంచి పిలుపు అందడంతో తాడేపల్లికి క్యూ కట్టారు. ఇవాళ శిల్పా చక్రపాణిరెడ్డి, రమేష్‌బాబు, కొట్టు సత్యనారాయణ, మోపిదేవి వెంకటరమణ సీఎంవోకు వెళ్లారు. ఇక.. రేపల్లె ఇన్‌ఛార్జ్‌గా నియమించాలని మోపిదేవి పట్టుబడుతుండగా.. ఇప్పటికే ఈవూరు గణేష్‌ను నియమించించింది వైసీపీ అధిష్ఠానం. ఈ క్రమంలో వైసీపీ అధినేత ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది.

ఇదిలాఉంటే.. వైసీపీ రాజీనామాల పర్వం కూడా కొనసాగుతోంది. సీటు దక్కకపోవడంతో ఇప్పటికే పలువురు నాయకులు పార్టీకి రాజీనామా చేశారు. తాజాగా.. ఎంపి పదవికి, వైసిపి సభ్యత్వానికి క్రిష్ణ దేవరాయలు రాజీనామా చేశారు. గుంటూరు నుంచి వైసిపి అభ్యర్థిగా పోటీ చేయడానికి ఇష్టపడని ఎంపీ ఊహించిన విధంగానే వైసిపిని వీడారు. అయితే ఆయన టీడీపీలో చేరతారా.. నర్సరావుపేట నుంచే ఎంపీగా పోటీ చేస్తారా అన్నదానిపై స్పష్టత రాలేదు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ