Vizianagaram: విజ‌య‌న‌గ‌రం జిల్లాలో భారీ పెన్ష‌న్ స్కామ్.. అంద‌రూ కుమ్మ‌క్కై ఇలా నొక్కేస్తున్నారు !

విజయనగరం జిల్లాలో పెన్షన్ అక్రమాల విచారణతో అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ఇప్పటికే విచారణ పూర్తి అవటంతో.. చేతివాటం ప్రదర్శించిన....

Vizianagaram:  విజ‌య‌న‌గ‌రం జిల్లాలో భారీ పెన్ష‌న్ స్కామ్.. అంద‌రూ కుమ్మ‌క్కై ఇలా నొక్కేస్తున్నారు !
Ap Pension Scam
Follow us
Ram Naramaneni

|

Updated on: Jun 14, 2021 | 2:32 PM

విజయనగరం జిల్లాలో పెన్షన్ అక్రమాల విచారణతో అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ఇప్పటికే విచారణ పూర్తి అవటంతో.. చేతివాటం ప్రదర్శించిన ప్రభుత్వ సిబ్బందికి ముచ్చెమటలు పడుతున్నాయి.. ప్రభుత్వ ఆదేశాలతో విచారణ పూర్తి చేశారు అధికారులు. పెన్ష‌న్ అక్రమాల విచారణతో అధికారులకు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యే వాస్తవాలు బయటపడ్డాయి. అర్హత లేకున్నా నెలకు వేల రూపాయల పెన్సన్ కాజేస్తూ ఎంచక్కా ఎంజాయ్ చేస్తున్నారు అక్రమార్కులు..

ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వైఎస్ఆర్ పెన్ష‌న్ కానుక పక్కదారి పట్టడంతో ఈ వ్యవహారంను సీరియస్ గా తీసుకున్నారు అధికారులు. సహజంగా నడవలేని, అనేక దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్న వారికి వైద్య సదుపాయంతో పాటు పోషణ కోసం తెల్ల రేష‌న్ కార్డు ఉన్న లబ్ధిదారులకు వైఎస్ఆర్ పెన్ష‌న్ కానుక ద్వారా ప్ర‌భుత్వం చేయూత ఇస్తుంది. ఈ స్కీమ్ లో రోగి పరిస్థితిని బట్టి మూడు వేలు, ఐదు వేలు, పది వేలు ఇలా మూడు రకాలుగా పెన్ష‌న్స్‌ను ఒకటో తారీఖున డిఆర్డిఏ ద్వారా వాలంటీర్లతో ఇంటిఇంటికి పంపిణీ చేస్తున్నారు అధికారులు.. ఈ స్కీమ్ ద్వారా జిల్లాలో మొత్తం 4998 మంది లబ్ధిదారులు పెన్ష‌న్స్ పొందుతున్నారు.. అయితే  పలువురు అక్రమార్కులు అర్హత లేకుండా దొడ్డిదారిన పింఛ‌న్లు పొందుతున్నారు.. అలా పొందిన అక్రమార్కులను నిగ్గు తేల్చే పనిలో పడ్డారు అధికారులు.

దీంతో అసలైన దొంగలు ఒక్కొక్కరుగా బయటపడుతున్నారు.. కొందరు నకిలీ సర్టిఫికెట్స్, మరి కొందరు ఎమ్‌పీడీఓ, సెర్ప్ ద్వారా పెన్సన్ మంజూరు చేయించుకున్నారు. ఈ స్కాంలో పీహెచ్‌సీ సెంటర్‌ సిబ్బంది నిర్లక్ష్యం కనిపిస్తుంది.. ప్రభుత్వ నిబంధనల ప్రకారం లబ్ధిదారులు వైఎస్ఆర్ పెన్ష‌న్ కానుక వెబ్ పోర్టల్ లో వివ‌రాలు అప్ లోడ్ చేయాలి.. అలా అప్ లోడ్ చెసేందుకు డిఎమ్ అండ్ హెచ్ఓ కార్యాలయం, సెర్ప్ సిబ్బందికి మాత్రమే లాగిన్ ఇచ్చారు.. అయితే ఉన్నతాధికారులు పీహెచ్‌సీ సెంటర్లకు అప్ లోడ్ చేసే బాధ్యత అప్పగించారు.. అలా మండల స్థాయిలో ఉన్న మెడికల్ ఆఫీసర్స్ క్రింది స్థాయి సిబ్బందికి అప్ లోడ్ చేసే బాధ్యత అప్పగించారు.. ఇలా ఉన్నతాధికారుల నిర్లక్ష్యంతో పాటు క్రింది స్థాయి సిబ్బంది చేతివాటంతో సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ జరగకుండా అక్రమార్కులకు సైతం లబ్ధిదారులుగా అప్ లోడ్ చేయటంతో పెన్ష‌న్ మంజూరు అయ్యింది.. ఇప్పటి వరకు జరిగిన ప్రాథమిక విచారణలో సుమారు 25 శాతం మంది అక్రమార్కులు పెన్ష‌న్ పొందినట్లు గుర్తించి వారిపై చర్యలు తీసుకునే పనిలో పడ్డారు అధికారులు..

అయితే ప్రస్తుతం జరుగుతున్న విచారణతో నిజమైన లబ్ధిదారులు సైతం ఆందోళన చెందుతున్నారు.. పెన్ష‌న్ నిలిచిపోతుందన్న అనేక ఊహాగానాలతో బెంబేలెత్తి పోతున్నారు. విచారణ త్వరగా పూర్తి చేసి తమకు పింఛ‌న్లు సకాలంలో అందించాలని కోరుతున్నారు.. పెన్షన్ స్కామ్‌పై విచారణతో అక్రమార్కులకు సహకరించిన ఇంటి దొంగలు కూడా భయపడిపోతున్నారు.. అనర్హులకు పెన్ష‌న్ మంజూరు వ్యవహారంలో పీహెచ్‌సీ మెడికల్ ఆఫీసర్స్ తో పాటు క్రింది స్థాయి సిబ్బందిపై కూడా చర్యలకు సిద్ధమవుతున్నారు ఉన్నతాధికారులు.

Also Read: మరణించిన ఖాతాదారుడి ఖాతాను కంటిన్యూ చేయొచ్చా..! లేదా మూసివేయాలా.. ఆర్బీఐ ఏం చెబుతుంది..

 బంగాళాఖాతంలో స్థిరంగా కొనసాగుతున్న అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాలో భారీ వర్షాలు..!