Andhrapradesh: లిక్కర్ స్కాంలో ప్రధాన పాత్రదారులు ఆ అత్తా, కోడళ్లే..? వైసీపీ ప్రజాప్రతినిధుల సంచలన వ్యాఖ్యలు.. న్యాయవిచారణ జరిపించాలని డిమాండ్..

ఆంధ్రప్రదేశ్‌ లో మద్యాన్ని ఏరులై పారించింది తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు కుటుంబమేనని వైసీపీ మహిళా మంత్రులు, ప్రజాప్రతినిధులు ఆరోపించారు. మధ్యం విషయంలో రాష్ట్రప్రభుత్వాన్ని విమర్శించే నైతిక హక్కు తెలుగుదేశం పార్టీకి లేదంటూ.. చంద్రబాబు కుటుంబ..

Andhrapradesh: లిక్కర్ స్కాంలో ప్రధాన పాత్రదారులు ఆ అత్తా, కోడళ్లే..? వైసీపీ ప్రజాప్రతినిధుల సంచలన వ్యాఖ్యలు.. న్యాయవిచారణ జరిపించాలని డిమాండ్..
Minister Usha Sri Charan
Follow us

|

Updated on: Sep 04, 2022 | 8:51 PM

Andhrapradesh: ఆంధ్రప్రదేశ్‌ లో మద్యాన్ని ఏరులై పారించింది తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు కుటుంబమేనని వైసీపీ మహిళా మంత్రులు, ప్రజాప్రతినిధులు ఆరోపించారు. మధ్యం విషయంలో రాష్ట్రప్రభుత్వాన్ని విమర్శించే నైతిక హక్కు తెలుగుదేశం పార్టీకి లేదంటూ.. చంద్రబాబు కుటుంబ సభ్యులపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి కేవీ. ఉషశ్రీ చరణ్, ఎమ్మెల్సీలు వరుదు కళ్యాణి, పోతుల సునీత, ఎస్సీ(మాల)కార్పోరేషన్ చైర్ పర్సన్ పి.అమ్మాజీ వేర్వేరుగా మీడియాతో మాట్లాడారు. లిక్కర్‌కు, చంద్రబాబు నాయుడు కుటుంబానికి అవినాభావ సంబంధం ఉందన్నారు. పైకి కనిపించేది పాల వ్యాపారం అని తెర వెనక లిక్కర్‌ బేరం చేస్తారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అత్తా కోడళ్లు ఇద్దరికీ ఇదే పనంటూ భువనేశ్వరి, బ్రహ్మణిలను ఉద్దేశించి వ్యాఖ్యనించారు. మద్యం లైసెన్సులు ఇప్పించటం ఈ ఇద్దరికీ కాటేజ్‌ ఇండస్ట్రీ అని విమర్శించారు. చంద్రబాబు నాయుడు హయాంలోనే డిస్టిలరీలకు లైసెస్సులు ఇచ్చారని ఆరోపించారు. అన్నీ తమ పార్టీవారికే ఇచ్చుకున్నారని.. అందుకు ప్రతిఫలంగా పుచ్చుకున్నది ఎంతని ప్రశ్నించారు. ఈ అంశంపై న్యాయ విచారణ జరగాలని డిమాండ్ చేశారు. మద్యం తయారీ అనుమతులు ఇప్పించటం భువనేశ్వరి, బ్రహ్మణిలకు దశాబ్దాలుగా కుటీర పరిశ్రమంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

స్వయంగా మద్యం సేవించటంలో అత్తా కోడళ్లు పోటీపడతారని.. ఇలా తాగే ఈమధ్య కొట్టుకుంటున్నారని ఆరోపించారు. ఒక వంక మగువ, మరో వంక మద్యం… ఇదే పప్పు బ్రాండ్‌ అంటూ తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో ఉన్న మద్యం బ్రాండ్లు అన్నీ ‘బీ–3’ బ్రాండ్లు అని.. అంటే భువనేశ్వరి, బ్రహ్మణి, బాబు బ్రాండ్లు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. బాబు హయాంలోనే బూమ్‌ బూమ్‌ బీర్, ప్రెసిడెంట్స్‌ మెడల్, గవర్నర్స్‌ ఛాయిస్‌. పవర్‌ స్టార్‌ 999, రష్యన్‌ రోమనోవా, ఏసీబీ, 999 లెజండ్, హెవెన్స్‌ డోర్, క్రేజీ డాల్, క్లిఫ్‌ హేంగర్‌… ఇలా 254 బ్రాండ్‌లకు అనుమతులు ఇచ్చారని విమర్శించారు. బ్రాండ్ల పేరు పెట్టుకుని దత్త పుత్రుడి రుణం, వియ్యంకుడి రుణం కూడా తీర్చుకున్నారని ఆరోపించారు వైసీపీ ప్రజాప్రతినిధులు.

రాష్ట్రంలో మద్యం కంపెనీలన్నీ తెలుగుదేశం పార్టీకి చెందినవారివేనని విమర్శించారు. ఎస్‌పీవై బ్రాండ్‌ ఎవరిది.. ఎస్‌పీవై రెడ్డి ఏ పార్టీలో ఉన్నారు.. ఆయన టీడీపీ నాయకుడు కాదా అని ప్రశ్నించారు. విశాఖ డిస్టిల్లరీకి 2019, ఫిబ్రవరి 25న ఎవరు అనుమతి ఇచ్చారన్నారు. అది టీడీపీకే చెందిన అయ్యన్నపాత్రుడికి చెందిన కంపెనీ అని.. దాన్ని గత ఏడాది అమ్మేశానని అయ్యన్నపాత్రుడు చెప్పారన్నారు. అంటే ఏడాది క్రితం వరకు అది అయ్యన్నపాత్రుడిదే కదా.. ఎన్నికల ముందు అనుమతి ఇచ్చారా.. లేరా టిడిపి సమాధానం చెప్పాలన్నారు. పీఎంకే డిస్టిల్లరీ యనమల రామకృష్ణుడి వియ్యంకుడిది కాదా, శ్రీ కృష్ణా డిస్టిల్లరీ ఆదికేశవులునాయుడిది కాదా అని వైసీపీ ప్రజాప్రతినిధులు ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో మద్యం వినియోగం తగ్గిందని చెప్పారు. లిక్కర్‌ సేల్స్‌ పెంచితే కమిషన్లు వస్తాయిగానీ, బెల్ట్‌ షాపుల్ని రద్దు చేసి, బార్‌ లైసెన్సుల్ని 33 శాతం తగ్గించి, పర్మిట్‌ రూముల్ని మూయించి.. ప్రభుత్వ హయాంలోనే లిక్కర్‌ అమ్ముతున్న సమయంలో… ఏకంగా మద్యం సేల్స్‌ తగ్గిపోయిన పరిస్థితుల్లో… సేల్స్‌ తగ్గిస్తే ఎవరైనా కమీషన్లు ఇస్తారా.. దీనికి టీడీపీ నాయకులు సమాధానం చెప్పాలన్నారు. రాష్ట్రంలో మద్యం వినియోగం ఎంతగా తగ్గిందో అందరికీ తెలుసంటూ లెక్కలను ప్రస్తావించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం చూడండి..

సీఎం కొడుకుపై విరుచుకుపడ్డ స్టార్ హీరో.! చెప్పడానికి మీరెవరు అంటూ
సీఎం కొడుకుపై విరుచుకుపడ్డ స్టార్ హీరో.! చెప్పడానికి మీరెవరు అంటూ
శేఖర్ మాస్టర్ కు ధైర్యం చెబుతున్న నెటిజన్స్.! వీడియో..
శేఖర్ మాస్టర్ కు ధైర్యం చెబుతున్న నెటిజన్స్.! వీడియో..
డార్లింగ్ ప్రభా ఇది మీకు మాత్రమే! వీణా శ్రీవాణి స్పెషల్ గిఫ్ట్..
డార్లింగ్ ప్రభా ఇది మీకు మాత్రమే! వీణా శ్రీవాణి స్పెషల్ గిఫ్ట్..
ఒక్క ఆంధ్రలోనే 100 కోట్లు దటీజ్ ప్రభాస్‌|భార్యా భర్తల బంధం చెర్రీ
ఒక్క ఆంధ్రలోనే 100 కోట్లు దటీజ్ ప్రభాస్‌|భార్యా భర్తల బంధం చెర్రీ
విమాన ప్రయాణికులకు గుడ్‌ న్యూస్‌.! రూ.349కే విమాన ప్రయాణం.!
విమాన ప్రయాణికులకు గుడ్‌ న్యూస్‌.! రూ.349కే విమాన ప్రయాణం.!
14 వేల మందికిపైగా ఉద్యోగులను తొలగించనున్న టెస్లా!
14 వేల మందికిపైగా ఉద్యోగులను తొలగించనున్న టెస్లా!
అమెజాన్ 'బజార్' వచ్చేసింది.. ఇక్కడ అన్నీ చవక.. వీటికి పోటీగా..
అమెజాన్ 'బజార్' వచ్చేసింది.. ఇక్కడ అన్నీ చవక.. వీటికి పోటీగా..
ఈ టిప్స్ పాటిస్తే .. ఎంత ఎండలోనైనా ఊటీలో ఉన్నట్టే ఉంటుంది.
ఈ టిప్స్ పాటిస్తే .. ఎంత ఎండలోనైనా ఊటీలో ఉన్నట్టే ఉంటుంది.
తిరుమల వెంకన్న భక్తులకు గుడ్ న్యూస్.! ఏప్రిల్‌ 18న ఉదయం 10 గంటలకు
తిరుమల వెంకన్న భక్తులకు గుడ్ న్యూస్.! ఏప్రిల్‌ 18న ఉదయం 10 గంటలకు
లోన్ యాప్‌ల ఆగడాలకు చెక్ పెట్టడానికి డిజిటల్‌ అస్త్రం..
లోన్ యాప్‌ల ఆగడాలకు చెక్ పెట్టడానికి డిజిటల్‌ అస్త్రం..