CM Jagan: కుప్పం సీటు బీసీలదైతే.. చంద్రబాబుపై సీఎం జగన్ తీవ్ర స్థాయిలో విమర్శలు..

కుప్పం సీటు బీసీలదైతే చంద్రబాబు లాక్కున్నారని ఆరోపించారు సీఎం జగన్. వెన్నుపోటుకి.. దొంగ ఓటుకి.. చంద్రబాబు కేరాఫ్‌ అడ్రస్‌ అంటూ విమర్శలు గుప్పించారు సీఎం జగన్‌.

CM Jagan: కుప్పం సీటు బీసీలదైతే.. చంద్రబాబుపై సీఎం జగన్ తీవ్ర స్థాయిలో విమర్శలు..
Cm Jagan
Follow us

|

Updated on: Sep 23, 2022 | 4:32 PM

చేతకాని నాయకుడు చంద్రబాబు అంటూ కుప్పం సభలో సెటైర్లు సంధించారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. YSR చేయూత పథకం ద్వారా 26.39 లక్షల మంది మహిళలకు 4949 కోట్ల రూపాయలను లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు బటన్‌ నొక్కి బదిలీ చేశారు. చిత్తూరుజిల్లాలోని 1.02 లక్షల మంది లబ్ధిదారులకు 192 కోట్ల రూపాయలు బదిలీ చేశారు. కుప్పం మున్సిపాలిటీలో 66 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత కుప్పంలో గెలుపే లక్ష్యంగా పార్టీ కార్యకర్తలకు సీఎం జగన్‌ దిశానిర్దేశం చేశారు. కుప్పం సీటు బీసీలదైతే చంద్రబాబు లాక్కున్నారని ఆరోపించారు సీఎం జగన్. వెన్నుపోటుకి.. దొంగ ఓటుకి.. చంద్రబాబు కేరాఫ్‌ అడ్రస్‌ అంటూ విమర్శలు గుప్పించారు సీఎం జగన్‌.

కుప్పం అంటే ఈరోజు అక్క చెల్లెమ్మల అభివృద్ధి అని.. కుప్పం అంటే ఈరోజు నా ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, నా మైనార్టీలు.. ఇలా ప్రతి ఇంటా అభివృద్ధి కనిపిస్తోందన్నారు. కుప్పంలో వీరి చిరునవ్వుల మధ్య అభివృద్ధి కనిపిస్తోందన్నారు. కుప్పంలో ఇవాళ మంచి కార్యక్రమాన్ని చేస్తున్నామన్నారు. మనసా , వాచా, కర్మణా అమలు చేశామన్నారు. ఈ మూడో విడత వరుసగా అదే అక్క చెల్లెమ్మకు అక్షరాల చేయూత ద్వారా రూ.56,250లు పెట్టినట్టు అవుతుందన్నారు. 45–60 సంవత్సరాల మధ్యలోని నా పేద అక్కచెల్లెమ్మలు నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అక్క చెల్లెమ్మల కోసం ఈ పథకాన్ని తీసుకు వచ్చామని స్పష్టం చేశారు. ఈ వయస్సులో ఉన్న అక్క చెల్లెమ్మలు మొత్తం కుటుంబాన్ని ఒక బాధ్యతతో మోస్తున్నారని.. వాళ్ల చేతిలో డబ్బులు పెడితే.. ఆ కుటుంబం ఎదుగుతుందని విశ్వసించాలన్నారు.

ఇక 60 ఏళ్లు దాటితే ఎలాగూ పెన్షన్‌వస్తుంది.. సూర్యోదయానికి ముందే.. ఠంచనుగా పెన్షన్‌ ఒకటో తారీఖున వస్తోందని.. అయితే ప్రస్తుతం రూ.2500 వస్తున్న పెన్షన్‌‌ కూడా ఈ జనవరి నుంచి రూ.2,750లకు పెంచుతుట్లుగా హామీ ఇచ్చారు. వైఎస్సార్‌ చేయూత పథకం ద్వారా చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు సీఎం జగన్‌.

మేనిఫెస్టోలో చెప్పినట్టుగా రూ.3వేల వరకూ తీసుకుని పోతాను అంటూ చెప్పిన మాటను నెరవేరుస్తున్నంటూ మరోసారి హామీ ఇచ్చారు. అమ్మ కడుపులోని బిడ్డ నుంచి, ఆప్యాయంగా ఆశీర్వదించే అవ్వల వరకూ మన ప్రభుత్వం అండగా నిలుస్తోందని గుర్తు చేశారు. ఈ ప్రభుత్వం మీది, అక్క చెల్లెమ్మల ప్రభుత్వం అని చెప్పడానికి గర్విస్తున్నానని సీఎం జగన్ అన్నారు. ఈ 39 నెలల కాలంలో ఇప్పటివరకూ నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఈ చేయూత ద్వారానే రూ.14,110 కోట్లు అందించామని అన్నారు. అక్కచెల్లెమ్మల సాధికారితే లక్ష్యంగా తమ ప్రభుత్వం అడుగులు ముందుకేసిందని అన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా 31 లక్షల మంది అక్క చెల్లెమ్మలకు ఇళ్లపట్టాలు ఇచ్చామని.. 21 లక్షల ఇళ్ల నిర్మాణలు వేగంగా జరుగుతున్నాయన్నారు. ఇక ఇళ్లు పూర్తైతే ఒక్కో ఇంటి విలువ కనీసం రూ.7–10 లక్షల వరకు ఇచ్చినట్లవుతుందన్నారు. ఇళ్ల కార్యక్రమం ద్వారా అక్క చెల్లెమ్మల చేతిలో రూ. 2–3 లక్షల కోట్లు పెట్టినట్టు అవుతుంది. అయితే ఈ తేడాను ప్రతి అక్కా చెల్లెమ్మ గమనించాలని అన్నారు.

ఇంతకుముందు పరిపాలనలో ఉన్న ముఖ్యమంత్రి హయాంలో అదే బడ్జెట్.. అదే ముఖ్యమంత్రి.. అప్పుడు చేసిన అప్పులు కన్నా.. ఇప్పుడు తాము చేసిన అప్పులు తక్కువే అని.. ఆ ప్రభుత్వంలో అభివృద్ధి ఎందుకు జరగలేదని ప్రశ్నించారు. ఎందుకు ఇప్పుడు పనులు జరుగుతున్నాయో ఆలోచన చేయలేన్నారు.

ఆ రోజుల్లో దోచుకో.. పంచుకో తినుకో.. పద్ధతి ఉండేదని.. అప్పుడు ప్రజలకు డబ్బు పోయేది లేదు.. ఇవాళ బటన్‌ నొక్కుతున్నాం.. నేరుగా మీ ఖాతాల్లోకి డబ్బులు వచ్చి చేరుతున్నాయని అన్నారు. అందుకనే ఇప్పుడు పనులు జరుగుతున్నాయి.. ఇప్పుడు అదే పనులు జరగలేదని తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు సీఎం జగన్.

మరిన్ని ఏపీ న్యూస్ కోసం

Current Bill: కరెంట్ బిల్లు సగానికి సగం తగ్గాలా? ఇవిగో టిప్స్
Current Bill: కరెంట్ బిల్లు సగానికి సగం తగ్గాలా? ఇవిగో టిప్స్
అలా అయితే భారత్‌లో వాట్సాప్‌ సేవలు నిలిచిపోతాయి..
అలా అయితే భారత్‌లో వాట్సాప్‌ సేవలు నిలిచిపోతాయి..
కియారా అద్వానీ లిస్ట్ లో అందరూ సౌత్‌ స్టార్లేనా.? స్టార్ కాస్ట్..
కియారా అద్వానీ లిస్ట్ లో అందరూ సౌత్‌ స్టార్లేనా.? స్టార్ కాస్ట్..
నేనే నెంబర్ వన్ అంటున్న పల్లెటూరు విద్యార్థి!
నేనే నెంబర్ వన్ అంటున్న పల్లెటూరు విద్యార్థి!
ఎన్నికల ప్రచారంలో బిజీగా రామ్ చరణ్ హీరోయిన్.. ఎవరికోసమంటే..
ఎన్నికల ప్రచారంలో బిజీగా రామ్ చరణ్ హీరోయిన్.. ఎవరికోసమంటే..
Ex-Cricketerపై చిరుత దాడి..ప్రాణాలకు తెగించి కాపాడిన పెంపుడుకుక్క
Ex-Cricketerపై చిరుత దాడి..ప్రాణాలకు తెగించి కాపాడిన పెంపుడుకుక్క
ఉద్యోగం మానేసినందుకు పండగ చేసుకున్నాడు.. నచ్చని కంపెనీలో పనిచేసే
ఉద్యోగం మానేసినందుకు పండగ చేసుకున్నాడు.. నచ్చని కంపెనీలో పనిచేసే
పెళ్లి డ్రెస్ కు కొత్త రూపం ఇచ్చిన సమంత.. ఇకపై ఇలాగే..
పెళ్లి డ్రెస్ కు కొత్త రూపం ఇచ్చిన సమంత.. ఇకపై ఇలాగే..
శ్రీశైలంలో ఘనంగా శ్రీ భ్రమరాంబికాదేవికి కుంభోత్సవం
శ్రీశైలంలో ఘనంగా శ్రీ భ్రమరాంబికాదేవికి కుంభోత్సవం
హుండీలోని రూ 2 వేల నోట్ల మార్పిడికి ఆర్బీఐ గ్రీన్‌ సిగ్నల్
హుండీలోని రూ 2 వేల నోట్ల మార్పిడికి ఆర్బీఐ గ్రీన్‌ సిగ్నల్