AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pawan Kalyan: పవన్ ఫ్యాన్ అంటే ఆ మాత్రం ఉంటది.. పెళ్లి కార్డుపై జనసేనాని ఫోటో.. వీడియో వైరల్

అభిమానాన్ని ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చూపిస్తారు. తాము అభిమానించే సెలబ్రిటీలు, రాజకీయ నాయకులకు వారిపై తమకున్న అభిమానాన్ని వ్యక్తపరుస్తూ దృశ్యరూపంలో కొందరు, చిత్రరూపంలో మరికొందరు ప్రదర్శిస్తూ తమ అభిమానాన్ని చాటుకుంటూ ఉంటారు. ఆ వివరాలు ఇలా..

Pawan Kalyan: పవన్ ఫ్యాన్ అంటే ఆ మాత్రం ఉంటది.. పెళ్లి కార్డుపై జనసేనాని ఫోటో.. వీడియో వైరల్
Marriage Card
N Narayana Rao
| Edited By: |

Updated on: Jun 18, 2024 | 11:22 AM

Share

అభిమానాన్ని ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చూపిస్తారు. తాము అభిమానించే సెలబ్రిటీలు, రాజకీయ నాయకులకు వారిపై తమకున్న అభిమానాన్ని వ్యక్తపరుస్తూ దృశ్యరూపంలో కొందరు, చిత్రరూపంలో మరికొందరు ప్రదర్శిస్తూ తమ అభిమానాన్ని చాటుకుంటూ ఉంటారు. ఈ తరహాలోనే ఈ వ్యక్తి కూడా అంతే.! పవన్ కళ్యాణ్‌పై తనకున్న అభిమానాన్ని అదిరిపోయే రీతిలో వ్యక్తపరిచాడు. వివరాల్లోకెళ్తే.. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం వల్లపురం గ్రామానికి చెందిన జొన్నలగడ్డ కుటుంబరావు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌ వీరాభిమాని. ఆయనపై తనకున్న అభిమానాన్ని వినూత్నంగా చాటుకున్నాడు సదరు వ్యక్తి. ఈ నెల 18న కుటుంబరావు పెళ్లి ఉండగా తన పెళ్లి పత్రికపై జనసేనాని ఫోటో, అలాగే పార్టీ గుర్తును ముద్రించి తన అభిమానాన్ని చాటుకున్నాడు.

ఇది చదవండి: రైలు టికెట్‌పై ఉండే 5 అంకెలను గమనించారా..? వీటి చరిత్ర తెలిస్తే ఆశ్చర్యపోతారు

ముదిగొండ మండల జనసేన పార్టీ కో-ఆర్డినేటర్‌గా పని చేస్తున్న కుటుంబరావు పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తమ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ జన్మదిన సందర్భంగా పలుసార్లు రక్తదాన శిబిరాలు నిర్వహించాడు. ఇక ఇప్పుడు పవన్ ఉప ముఖ్యమంత్రి కావడం తమకెంతో సంతోషంగా ఉందని.. అందుకే తన పెళ్లి కార్డుపై పవన్ కళ్యాణ్, పార్టీ గుర్తును ముద్రించుకొని పలువురికి పంచానని కుటుంబరావు తెలిపారు. ప్రస్తుతం జిల్లావ్యాప్తంగా ఈ పెళ్లికార్డు వైరలవుతోంది. లేట్ ఎందుకు మీరూ ఓసారి లుక్కేయండి.

ఇది చదవండి: మాంచి రసికుడివి సామీ.. భర్త ఐఫోన్ చూడగానే భార్యకు ఫ్యూజులౌట్.. ఆ తర్వాత జరిగిందిదే

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us