Viral: మాంచి రసికుడివి సామీ.. భర్త ఐఫోన్ చూడగానే భార్యకు ఫ్యూజులౌట్.. ఆ తర్వాత జరిగిందిదే
యాపిల్ ఐఫోన్లు ప్రైవసీకి చాలా సెక్యూర్ అని అందరూ అంటుంటారు. ఒక్కసారి ఐఫోన్ నుంచి మెసేజ్‌లు, ఫోటోలు, వీడియోలను తొలగిస్తే.. మళ్లీ రీస్టోర్ చేయడం అసాధ్యం అని.. ఐఫోన్ వాడేవారి నమ్మకం. అయితే ఓ ఐఫోన్ కారణంగా భార్యాభర్తల మధ్య పెద్ద గొడవ జరిగి.. విడాకుల ఇచ్చేంత..
యాపిల్ ఐఫోన్లు ప్రైవసీకి చాలా సెక్యూర్ అని అందరూ అంటుంటారు. ఒక్కసారి ఐఫోన్ నుంచి మెసేజ్‌లు, ఫోటోలు, వీడియోలను తొలగిస్తే.. మళ్లీ రీస్టోర్ చేయడం అసాధ్యం అని.. ఐఫోన్ వాడేవారి నమ్మకం. అయితే ఓ ఐఫోన్ కారణంగా భార్యాభర్తల మధ్య పెద్ద గొడవ జరిగి.. విడాకుల ఇచ్చేంత వరకు తతంగం వెళ్లింది. అదీ కూడా పైన పేర్కొన్న ఫీచర్ వల్లే ఇదంతా జరగడం గమనార్హం. ఓ బ్రిటీష్ వ్యక్తికి ఈ ఫీచర్ కారణంగా తన భార్య విడాకులు ఇచ్చింది. దీంతో ఆపిల్ సంస్థపై దావా వేశాడు సదరు వ్యక్తి. తాను వేరొకరితో చాట్ చేసిన మెసేజ్‌లను తన భార్య చూసిందని.. ఆ మెసేజ్‌లను తను డిలీట్ చేసినా.. తన భార్య చూడగలిగిందని.. తద్వారా తనకు విడాకులు ఇచ్చిందని.. దీనికి యాపిల్‌దే బాధ్యత అంటూ ఆ వ్యక్తి తన వ్యాజ్యంలో కోర్టుకు వినిపించాడు.
ఇది చదవండి: రైలు టికెట్‌పై ఉండే 5 అంకెలను గమనించారా..? వీటి చరిత్ర తెలిస్తే ఆశ్చర్యపోతారు
వివరాల్లోకెళ్తే.. యాపిల్‌పై కేసు వేసిన సదరు బ్రిటీష్ వ్యక్తి.. తన ఐఫోన్ నుంచి పలు సెక్స్ వర్కర్లతో సెక్స్ చాటింగ్ చేశాడు. ఆ తర్వాత తన భార్యకు తెలియకూడదని.. వాటిని డిలీట్ చేశాడు. అయితే అతడి ప్రవర్తనపై అనుమానపడ్డ భార్య.. వేరొక పరికరం ద్వారా ఆ డిలీట్ చేసిన మెసేజ్‌లను చూసింది. ఈ ఘటనతో మనస్తాపానికి గురైన ఆ మహిళ తన భర్తకు విడాకులు ఇవ్వాలని నిర్ణయించుకుంది. దానికి ఫలితంగా ఆ వ్యక్తి ఆమెకు ఐదు మిలియన్ పౌండ్ల పరిహారం చెల్లించాలి. ఐఎం మెసేజింగ్ యాప్ నుంచి డిలీట్ చేసిన మెసేజ్‌లను భార్య చూడకుంటే.. ఇలాంటి పరిస్థితి తనకు తలెత్తేది కాదని.. సదరు వ్యక్తి న్యాయస్థానం ఎదుట తన వాదనలను వినిపించాడు.
అసలు ఇంతకీ డిలీట్ చేసిన మెసేజ్‌లను ఆమె ఎలా చూసింది..
టెక్నాలజీ బాగా అభివృద్ధి చెందటంతో.. వివిధ పరికరాలు ఒకదానితో మరొకటి అనుసంధానమవుతున్నాయి. తద్వారా ఐఫోన్ ఇతర ఆపిల్ పరికరాలతో సమకాలీకరించబడింది. ఈ సదరు బ్రిటిష్ వ్యక్తికి సంబంధించిన ఐఫోన్.. అతడి కుటుంబానికి చెందిన iMac సిస్టమ్‌కు కనెక్ట్ అయి ఉంది. ఇక్కడ ఆ వ్యక్తి తన మొబైల్‌లో సందేశాన్ని తొలగించినప్పటికీ, అది అతడి పరికరంలో మాత్రమే తొలగించబడింది. అతని ఫోన్‌తో సమకాలీకరించబడిన iMacలో ఆ సందేశం తొలగించబడలేదు. అందువల్ల, అతని భార్య iMacలో అతడి సందేశాలన్నింటిని చదవగలిగింది.
ఇది చదవండి: అదే జరిగితే.. టీ20 ప్రపంచకప్ నుంచి అర్ధాంతరంగా టీమిండియా ఔట్.? లెక్కలివే
కాగా, కోర్టులో ఆపిల్ సంస్థపై రూ. 53 కోట్లకు దావా వేసిన సదరు వ్యక్తి.. తన వాదనలను బలంగా వినిపించాడు. తన ఐఫోన్‌లో మాత్రమే మెసేజ్‌లు తొలగించబడ్డాయని.. దీనికి అనుసంధానమైన పరికరాల్లో ఇంకా అవి ఉన్నట్టు హెచ్చరిక వచ్చి ఉంటే.. తన పరిస్థితి వేరే రకంగా ఉండేదని పేర్కొన్నాడు. ఆపిల్ వల్ల తాను రూ.53 కోట్లు నష్టపోయానంటూ సదరు వ్యక్తి కోర్టుకు చెప్పాడు. ఇది ఇప్పుడు అక్కడ పెద్ద హాట్ టాపిక్ కాగా.. దీనిపై ఇంకా తీర్పు రావాల్సి ఉంది.
ఇది చదవండి: అరె మావా.! దమ్ముంటే ఈ ఫోటోలో పామును గుర్తించు.. కనిపెడితే ఖిలాడీవి నువ్వే
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి