ఆదర్శంగా మారిన అతని ఆలోచన.. లక్షల్లో సంపాదిస్తున్న యువకుడు..

| Edited By: Srikar T

May 27, 2024 | 2:09 PM

గంగిగోవు పాలు గరిటడైన చాలు.. కడవడైతే నేమి ఖరము పాలు అనే సూక్తి అందరికీ తెలిసే ఉంటుంది. ఇందుకు భిన్నంగా ఓ రైతు వినూత్న ఆలోచన అందరి మన్ననలు పొందేలా చేసింది. ఇప్పటివరకు గేదెల ఫామ్, గొర్రెల ఫామ్, కోళ్ల ఫామ్, పక్షుల ఫామ్ ఇలా రకరకాల ఫామ్ల గురించి మనం విన్నాం. కళ్ళారా చూశాం. కానీ ఆ ప్రాంతంలో ఏర్పాటుచేసిన ఆ ఫామ్ గురించి ఎంతో ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. లాభనష్టాలు సంగతి ఎలా ఉన్నా అలాంటి ఫామ్ పెట్టాలనే ఆ రైతు ఆలోచనను పలువురు అభినందిస్తున్నారు.

ఆదర్శంగా మారిన అతని ఆలోచన.. లక్షల్లో సంపాదిస్తున్న యువకుడు..
Eluru District
Follow us on

గంగిగోవు పాలు గరిటడైన చాలు.. కడవడైతే నేమి ఖరము పాలు అనే సూక్తి అందరికీ తెలిసే ఉంటుంది. ఇందుకు భిన్నంగా ఓ రైతు వినూత్న ఆలోచన అందరి మన్ననలు పొందేలా చేసింది. ఇప్పటివరకు గేదెల ఫామ్, గొర్రెల ఫామ్, కోళ్ల ఫామ్, పక్షుల ఫామ్ ఇలా రకరకాల ఫామ్ల గురించి మనం విన్నాం. కళ్ళారా చూశాం. కానీ ఆ ప్రాంతంలో ఏర్పాటుచేసిన ఆ ఫామ్ గురించి ఎంతో ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. లాభనష్టాలు సంగతి ఎలా ఉన్నా అలాంటి ఫామ్ పెట్టాలనే ఆ రైతు ఆలోచనను పలువురు అభినందిస్తున్నారు. ఇంతకు ఏంటి ఆ వెరైటీ ఫామ్. ఫామ్ వల్ల లాభాలు ఏంటి అనే వివరాలు ఇప్పుడు ఈ స్టోరీలో తెలుసుకుందాం. ఏలూరు జిల్లా కొయ్యలగూడెం మండలం నరసన్న పాలెం గ్రామానికి చెందిన వెంకటరెడ్డి అనే రైతు ఎంతోకాలంగా గొర్రెల మేపుతూ జీవనం సాగిస్తున్నాడు. అయితే అతనికి గొర్రెలతో పాటు ఒక గాడిద కూడా ఉండేది. గాడిదల ఫామ్ పెడితే బాగుంటుందని, గాడిద పాలకు కూడా మంచి డిమాండ్ ఉందని యూట్యూబ్ ద్వారా తెలుసుకున్న వెంకటరెడ్డి అందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. సుమారు రూ.7 లక్షల ఖర్చు పెట్టి 40 గాడిదలను కొనుగోలు చేశాడు.

తనకున్న గొర్రెలతో పాటు గాడిదలను మేపుతున్నాడు. అంతేకాక గాడిద పాలకు మంచి గిరాకీ ఉందని తెలిసిన వెంకటరెడ్డి గ్రామంలో తన వద్ద గాడిద పాలు లభిస్తాయని, గాడిద పాలు అవసరం ఉన్నవారు తనను సంప్రదించాలని ఫ్లెక్సీలు సైతం ఏర్పాటు చేశాడు. దాంతో ఆ ఫ్లెక్సీలో చూసిన స్థానికులతో పాటు మరి కొందరు మొదట్లో ఆశ్చర్యం వ్యక్తం చేశారు. సాధారణంగా కొందరు గాడిద పాలను కొన్ని రోగాలకు మందుగా ఉపయోగిస్తారు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు తమ ప్రాంతంలో ఏప్పుడైనా గాడిదలు సంచరించినప్పుడు వాటి పాలను కొనుగోలు చేసేవారు. ఇప్పుడు తమ ప్రాంతంలోనే గాడిదల ఫామ్ ఏర్పాటుచేసి పాలు అమ్ముతున్న విషయం తెలుసుకున్న స్థానికులు వెంకటరెడ్డిని పాల కోసం సంప్రదిస్తున్నారు. ముఖ్యంగా ఉబ్బసం, గుండె, ఊపిరితిత్తుల నిమ్ము వంటి రోగాలకు గాడిద పాలు ఎక్కువగా వాడతారని, లీటరు గాడిద పాలు ధర రూ.2. వేలకు అమ్ముతున్నట్లు, రోజుకు రెండు నుంచి నాలుగు లీటర్ల వరకు పాలు అమ్ముతున్నట్లు వెంకటరెడ్డి తెలిపారు. అదే విధంగా గాడిద పాలు రాష్ట్రాలకు ఎగుమతి చేసే విధంగా సహకరించాలని కోరుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..