AP News: ఈ పాలు లీటర్ ఏకంగా రూ.2వేలు.. అయినా ఎగబడుతున్న జనం
ఏలూరు జిల్లా కొయ్యలగూడెంకు చెందిన రైతు వినూత్న వ్యాపారాన్ని మొదలు పెట్టారు.. మంచి లాభాలను అర్జిస్తున్నాడు. లీటర్ పాలను ఏకంగా రూ.2వేలకు విక్రయిస్తున్నారు. మార్కెట్‌లో ఉన్న డిమాండ్‌ను గమనించి వ్యాపారాన్ని ప్రారంభించాడు. ఇంతకీ అది ఏం బిజినెస్..? ఆ డీటేల్స్ తెలుసకుందాం పదండి....
గొర్రెల మందలా ఏదో ఇతరుల్ని ఫాలో అయితే వ్యాపారాల్లో లాభాలు ఏం ఉంటాయ్ చెప్పండి.. కాస్త క్రియేటివిటీ ఉంటేనే ఎక్కడైనా నెగ్గుకురావొచ్చు. అలా తన బుర్రకు పదను పెట్టిన ఓ పాడి రైతు సరికొత్త ఐడియాతో లక్షల్లో ఆదాయాన్ని అర్జిస్తున్నాడు. లీటర్ పాలను ఏకంగా 2 వేల రూపాయలకు అమ్ముతున్నాడు. వామ్మో.. పాలకు ఇంత రేటు ఏంటి అనుకుంటున్నారా..? అక్కడే ఉంది మరి కిటుకు. ఆ పాలు గేదె పాలో, ఆవు పాలో, మేక పాలో కాదు.. నికార్సయిన వయస్సులో ఉన్న గాడిద పాలు. ఏకంగా డెయిరీ ఫామ్ రేంజ్‌లో గాడిద పాల బిజినెస్ చేస్తున్నాడు.. ఏలూరు జిల్లాకు చెందిన ఓ రైతు. మన దగ్గర ఎక్కవగా బర్రె పాల వినియోగం ఉంటుంది. అక్కడక్కడ ఆవు పాలను కూడా వాడుతుంటారు. అయితే ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గం కొయ్యలగూడెం మండలం నరసన్న పాలెంకు చెందిన వెంకటరెడ్డి అనే రైతు గాడిద పాలను అమ్ముతూ మంచి బిజినెస్ చేస్తున్నాడు. వెంకటరెడ్డి ఇటీవలి వరకు గొర్రెలను మేపుకుంటూ జీవనం సాగించేవాడు. ఇంతలో గాడిద పాలకు డిమాండ్ పెరుగుతుందన్న సంకేతాలు రావడంతో ఆ దిశగా అడుగులు వేశారు. గాడిద పాలు తాగితే ఊపిరితిత్తుల్లో నెమ్ము, ఆయాసం తగ్గుతుందని ప్రచారం ఉండంతో.. లాభాసాటిగా ఉంటుందని ఆ వైపు మళ్లాడు.
వెంకటరెడ్డి రూ.7లక్షలతో 40 గాడిదలను కొనుగోలు చేశారు. ఆ తర్వాత గాడిద పాలు తమ దగ్గర దొరకుతాయని ప్రచారం చేశాడు. పలు చోట్ల ప్లెక్సీలను ఏర్పాటు చేశాడు. ఈ సమాచారం తెలియడంతో ప్రజలు పాలను కొనుగోలు చేసేందుకు బాగానే వస్తున్నారు. లీటర్ పాలు రూ.2వేలకు విక్రయిస్తున్నట్లు వెంకట రెడ్డి చెబుతున్నారు. డిమాండ్‌ను బట్టి పాలను గాడిదల నుంచి సేకరించి విక్రయిస్తున్నట్లు వెల్లడించాడు. రోజుకు సుమారుగా నాలుగు లీటర్ల పాలను సేకరిస్తున్నామని.. ఏపీతో పాటు తెలంగాణ, తమిళనాడు నుంచి కూడా కొందరు వచ్చి పాలు తీసుకువెళ్తున్నారని చెబుతున్నాడు. అందుకే అక్కడికి కూడా సంఫరా చేసే ఆలోచన చేస్తున్నట్లు వెంకటరెడ్డి తెలిపారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..