Nellore Crime: జన్మదినమే ఆఖరి రోజు.. వేడుకలకు ఇంటికి బయల్దేరిన యువకుడు.. మార్గమధ్యలో ఊహించని ప్రమాదం
పుట్టిన రోజు వేడుకలను(Birth day celebrations) తల్లిదండ్రులతో కలిసి జరుపుకోవాలని ఆ యువకుడు నిర్ణయించుకున్నాడు. వారికి సమాచారం ఇవ్వకుండా స్నేహితుడితో కలిసి బైక్ పై స్వగ్రామానికి బయల్దేరాడు. మరికొద్ది...
పుట్టిన రోజు వేడుకలను(Birth day celebrations) తల్లిదండ్రులతో కలిసి జరుపుకోవాలని ఆ యువకుడు నిర్ణయించుకున్నాడు. వారికి సమాచారం ఇవ్వకుండా స్నేహితుడితో కలిసి బైక్ పై స్వగ్రామానికి బయల్దేరాడు. మరికొద్ది గంటల్లో ఇంటికి చేరతామనే ఊహించని ప్రమాదం జరిగింది. జాతీయ రహదారిపై బైక్ (Bike Accident) అదుపుతప్పి కింద పడింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. విషయం తెలుసుకున్న మృతుడి కుటుంబీకులు.. తాము వస్తున్నట్లు ముందస్తు సమాచారం ఇవ్వలేదని, ఒకవేళ ఇస్తే వేరే వాహనంలో వచ్చేలా సూచించేవాళ్లమని ఆవేదన వ్యక్తం చేశారు. అల్లారుముద్దుగా చూసుకుంటున్న తమ కుమారుడు విగతజీవిగా మారడంతో ఆ తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. నెల్లూరు (Nellore) పట్టణంలోని ముత్యాలపాలెం ప్రాంతానికి చెందిన కిరణ్‌కుమార్, సుజాత దంపతుల కుమారుడు లీనత్‌కుమార్.. చెన్నైలోని ఓ కళాశాలలో హోటల్ మేనేజ్‌మెంట్ తొలి సంవత్సరం చదువుతున్నాడు. ఆదివారం తన పుట్టిన రోజు కావడంతో ఇంట్లో జరుపుకోవాలని నిర్ణయించుకున్నారు.
కుటుంబసభ్యులకు సర్ ప్రైజ్ చేయాలనే ఉద్దేశ్యంతో వారికి సమాచారం ఇవ్వకుండా స్నేహితుడితో కలిసి బైక్ పై నెల్లూరుకు బయల్దేరారు. వారు ప్రయాణిస్తున్న వాహనం తడ మండలం కొండూరు ఓయో హోటల్ సమీపంలో రాగానే జాతీయ రహదారిపై అదుపుతప్పి కింద పడింది. తీవ్రంగా గాయపడిన లీనత్ కుమార్ ను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో ప్రాణాలు కోల్పోయాడు. అతని స్నేహితుడు, విశాఖపట్నానికి చెందిన మరో యువకుడు ఉమాశంకర్ నారాయణ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ప్రమాదంపై తడ పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు.
Also Read
Kidney Healthy Foods: కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే ఎలాంటి పదార్థాలు తినాలి.. ఏమి తినకూడదో తెలుసా..
Viral Video: మొసళ్ల గుంపుతో సింహం జంట భయంకరమైన యుద్దం.. షాకింగ్ వీడియో వైరల్..
హలీమ్ ప్రియులకు గుడ్ న్యూస్.. రంజాన్‌కు ముందే సరికొత్త టెస్ట్‌తో !!