AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Land Grabbing: భూమంతర్‌… ఖాళీ.. ఇంటెలిజెన్స్‌ ఎస్పీ స్థలంలోనే రోడ్డు.. విశాఖలో ఎంపీ వర్సెస్‌ ఎస్పీ..

రూపాయి.. రూపాయి కూడబెట్టి కొనుకున్న స్థలంలో ఎవరో వచ్చి రోడ్డు వేసుకుంటే తానూ ఎలా భరిస్తానని వాపోయాడు విశాఖ Visakha: ఇంటెలిజెన్స్‌ ఎస్పీ మధు(Visakha Intelligence SP Madhu). తన వెంచర్‌ సౌలభ్యం కోసం..

Land Grabbing: భూమంతర్‌... ఖాళీ.. ఇంటెలిజెన్స్‌ ఎస్పీ స్థలంలోనే రోడ్డు.. విశాఖలో ఎంపీ వర్సెస్‌ ఎస్పీ..
Land Grabbing Accusation Fo
Sanjay Kasula
|

Updated on: Mar 28, 2022 | 11:40 AM

Share

ఖాళీ జాగా కనిపిస్తే చాలు నేతలు కబ్జాచేస్తున్నారు(Land Grabbing). ప్రభుత్వ, అటవీ, బంజరు, చెరువు, ఈనాం ఇలా భూములు ఏవైనా సరే హాంఫట్‌ అనిపిస్తున్నారు. ఎకరాలకొద్దీ స్వాధీనం చేసుకుని ఇష్టానుసారంగా దోచుకుంటున్నారు. కొందరైతే అటవీ, ప్రభుత్వ భూములను ఆక్రమించుకుని అడ్డొచ్చినవారి సంగతేంటో తేల్చేస్తున్నారు. రికార్డుల్లో ఏమాత్రం లొసుగులు ఉన్నా ప్రైవేటు భూములను ఆక్రమించేస్తున్నారు. ఇచ్చింది తీసుకుని స్థలం ఖాళీచేయాలంటూ హెచ్చరిస్తున్నారు. మాట వినకుంటే రౌడీమూకలు, పోలీసులను రంగంలోకి దింపి బెదిరిస్తున్నారు. కొత్త రికార్డులను సృష్టించి కోర్టులపాలు చేస్తున్నారు. కేసులు కోర్టుల్లో ఉండగానే ఆ భూములను అడ్డగోలుగా విక్రయించి జేబులు నింపుకుంటున్నారు. స్థలం కనిపిస్తే చాలు కబ్జా చేసి భూ రాబందులుగా మారిపోతున్నారు.

రూపాయి.. రూపాయి కూడబెట్టి కొనుకున్న స్థలంలో ఎవరో వచ్చి రోడ్డు వేసుకుంటే తానూ ఎలా భరిస్తానని వాపోయాడు విశాఖ ఇంటెలిజెన్స్‌ ఎస్పీ మధు(Visakha Intelligence SP Madhu). తన వెంచర్‌ సౌలభ్యం కోసం ఒకమాట కూడా చెప్పకుండా ఇలా చేస్తే తమ పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. దీంతో ఇది కాస్తా.. ఎంపీ వర్సెస్‌ ఐపీఎస్‌గా మారిపోయింది. ఎంపీ ఎంవీవీ సత్యన్నారాయణకు(MP MVV Satyanarayana) చెందిన నిర్మాణ కంపెనీపై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. ఎంపీ ఎంవీవీకి చెందిన కొత్త వెంచర్‌ కోసం రోడ్డు నిర్మాణం చేపట్టారు. అది పక్కనే ఉన్న ఇంటెలిజెన్స్‌ బ్యూరో ఎస్పీ మధుకు చెందిన స్థలంలో రోడ్డు నిర్మాణం చేపట్టినట్లు ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు.

విశాఖలోని బక్కన్నపాలెం సర్వే నంబర్‌ 90/1A లో ఇంటెలిజెన్స్‌ బ్యూరో ఎస్పీ మధు కాంపౌండ్‌ వాల్‌ నిర్మిస్తుండగా.. ఎంవీవీ అనుచరులు అడ్డుకున్నారు. ఈ విషయంపై పీఎం పాలెం పోలీస్‌స్టేషన్‌లో మధు ఫిర్యాదు చేశారు. తన స్థలంలో ఎంవీవీ వెంచర్‌ కోసం రోడ్డు నిర్మాణం పనులు చేపట్టారని ఆరోపించారు. అది గమనించి తన స్థలంలో కాంపాండ్‌వాల్‌ నిర్మిస్తుండగా అడ్డుకున్నారని చెప్పారు. తన పరిస్థితే ఇలా ఉంటే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటని ఎస్పీ మధు ప్రశ్నించారు.

ఎస్పీ మధు చేసిన ఆరోపణలను ఎంపీ ఎంవీవీ సత్యన్నారాయణ ఖండించారు. మధు అర్థరాత్రి అక్కడ గోడ నిర్మిస్తుండటంతో స్థానికులు సమాచారం ఇచ్చారన్నారు. వారి ఫిర్యాదుతో అనుమానం వచ్చి పనులు ఆపేశామన్నారు. రికార్డ్స్‌లో అది లే అవుట్‌ రోడ్‌గా చూపిస్తోందన్నారు ఎంవీవీ సత్యన్నారాయణ. ఆ భూమి నిజంగానే ఎస్పీ సొంతమైతే తమకు ఎలాంటి ఇబ్బంది లేదన్నారు ఎంవీవీ సత్యన్నారాయణ.

ఇవి కూడా చదవండి: Viral Video: మొసళ్ల గుంపుతో సింహం జంట భయంకరమైన యుద్దం.. షాకింగ్ వీడియో వైరల్..

Summer Skin Care: కేవలం 15 రోజుల్లో మెరిసిపోయే అందం మీ సొంతం.. జస్ట్ ఈ చిట్కాలు మీ కోసం..

సర్కార్ టీచర్లకు అగ్ని పరీక్ష.. సుప్రీం తీర్పుతో కొత్త టెన్షన్!
సర్కార్ టీచర్లకు అగ్ని పరీక్ష.. సుప్రీం తీర్పుతో కొత్త టెన్షన్!
హైదరాబాద్ ప్రజలకు శుభవార్త.. అందుబాటులోకి ఎలక్ట్రిక్ బస్సు సేవలు
హైదరాబాద్ ప్రజలకు శుభవార్త.. అందుబాటులోకి ఎలక్ట్రిక్ బస్సు సేవలు
ధైర్యంగా ఉండండి.. 'మోగ్లీ' సినిమా దర్శకుడికి అండగా మెగా హీరో
ధైర్యంగా ఉండండి.. 'మోగ్లీ' సినిమా దర్శకుడికి అండగా మెగా హీరో
పాకిస్తాన్ హోంమంత్రికి ఘోర పరాభవం..!
పాకిస్తాన్ హోంమంత్రికి ఘోర పరాభవం..!
ఆయుష్మాన్‌ కార్డును ఏడాదిలో ఎన్ని సార్లు ఉపయోగించుకోవచ్చు?
ఆయుష్మాన్‌ కార్డును ఏడాదిలో ఎన్ని సార్లు ఉపయోగించుకోవచ్చు?
బ్యాంకుల్లో ఫిక్స్‌డ్ డిపాజిట్లు చేసేవారికి బ్యాడ్‌న్యూస్
బ్యాంకుల్లో ఫిక్స్‌డ్ డిపాజిట్లు చేసేవారికి బ్యాడ్‌న్యూస్
లాభ స్థానంలోకి కేతువు వచ్చేస్తున్నాడు! ఈ రాశులవారు యమా లక్కీ..!
లాభ స్థానంలోకి కేతువు వచ్చేస్తున్నాడు! ఈ రాశులవారు యమా లక్కీ..!
రూటు మార్చిన టాస్ ఓడిన సూర్య.. ప్లేయింగ్ 11లో మార్పులు ఇవే..
రూటు మార్చిన టాస్ ఓడిన సూర్య.. ప్లేయింగ్ 11లో మార్పులు ఇవే..
బాలున్ని మూట కట్టి పాతిపెట్టిన దుర్మార్గుడు..!
బాలున్ని మూట కట్టి పాతిపెట్టిన దుర్మార్గుడు..!
తెలంగాణ పదో తరగతి పబ్లిక్ పరీక్షల 2026 టైం టేబుల్ విడుదల
తెలంగాణ పదో తరగతి పబ్లిక్ పరీక్షల 2026 టైం టేబుల్ విడుదల