Chandrababu-Delhi: ఇండియా- పాక్ క్రికెట్‌కు లింక్ పెడుతూ టీడీపీని చెడుగుడు ఆడుకున్న ఎంపీ విజయసాయి.. ఇంతకీ ఏం కామెంట్స్ చేశారంటే..
Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఇండియా- పాక్ క్రికెట్ నూ వదలడం లేదు. తాజాగా ఇండియా-పాకిస్తాన్ మధ్య జరిగిన క్రికెట్ మ్యాచ్‌ను ముడిపెడుతూ టీడీపీపై ఫైర్ అయ్యారు..
Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఇండియా- పాక్ క్రికెట్ నూ వదలడం లేదు. తాజాగా ఇండియా-పాకిస్తాన్ మధ్య జరిగిన క్రికెట్ మ్యాచ్‌ను ముడిపెడుతూ టీడీపీపై ఫైర్ అయ్యారు వైసపీ ఎంపీ విజయసాయి రెడ్డి. ఈ మేరకు ట్వీట్ చేసిన ఆయన.. చంద్రబాబుపై ఓ రేంజ్‌లో సెటైర్లు వేశారు. ఇంతకీ ఆయన ఏం ట్వీట్ చేశారో ఇప్పుడు తెలుసుకుందాం. ‘‘ప్రపంచం అంతా ఇండియా – పాకిస్తాన్ మ్యాచ్‌పై ఆసక్తిగా ఉంటే.. మన ప్రతిపక్ష నాయకుడు, ఆయన పుత్రరత్నం ఆలోచన మాత్రం వేరుగా ఉంది.’’ అంటూ విజయసాయి ట్వీట్ చేశారు. అంతేకాదు.. ‘‘ఆంధ్రప్రదేశ్‌లో సంక్షేమ పథకాలను ఎలా అడ్డుకోవాలి? ఆంధ్రప్రదేశ్ బ్రాండ్‌ని ఎలా చెడగొట్టాలి? కులాల మధ్య కుంపటి ఎలా రగిలించాలి? ఇదే ఆలోచనతో నిత్యం కుట్రలు చేస్తూనే ఉన్నారు. ఎవడి కర్మకు ఎవరు బాధ్యులు?’’ అంటూ ఎంపీ విజయసాయి రెడ్డి తనదైన శైలిలో తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు.
‘‘విజయం అసాధ్యమనే నిస్పృహ మనిషిని ఉన్మాద స్థితిలోకి నెడుతుంది. సైకాలజీలో దీన్ని Post-traumatic Stress Disorder అంటారు. ప్రజాక్షేత్రాన్ని వదిలి వ్యక్తి కేంద్రంగా దాడులకు దిగడం దీని లక్షణమే. తొలుత దొంగ దెబ్బలతో బెదిరించాలని చూస్తారు. ఫైనల్ గా భౌతిక నిర్మూలనకు కుట్ర చేస్తారు. స్కూల్స్ పరిసర ప్రాంతాల్లో పొగాకు అమ్మకాల నిషేధం కఠినంగా అమలు. అందుకే.. చిన్నారులు అతి తక్కువగా పొగబారిన పడుతున్న 5 రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్ స్థానం సంపాదించిందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. గ్లోబల్ యూత్ టొబాకో సర్వే కూడా ఇదే విషయం చెప్పింది.’’ అని విజయసాయిరెడ్డి తన ట్వీట్స్‌లో పేర్కొన్నారు. కానీ, ఇవేవీ టీడీపీ అధినేత చంద్రబాబుకు కనిపించవు.. వినిపించవు.. కేవలం కుట్ర రాజకీయాలు చేయడమే ఆయనకు తెలుసునంటూ విరుచుకుపడ్డారు.
ఇదిలాఉంటే.. టీడీపీ అధినేత చంద్రబాబు నేతృత్వంలోని 18 మంది పార్టీ సభ్యుల బృందం ఇవాళ ఢిల్లీకి వెళ్లారు. మధ్యాహ్నం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కలిశారు. టీడీపీ కార్యాలయంపై వైసీపీ శ్రేణులు దాడులు చేయడంపై ఫిర్యాదు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రపతి పాలన పెట్టాలంటూ రాష్ట్రపతిని కోరారు. ఆంధ్రప్రదేశ్‌లోఅరాచక పాలన కొనసాగుతోందని, డ్రగ్స్ మాఫియా రెచ్చిపోతోందని రాష్ట్రపతికి చంద్రబాబు ఫిర్యాదు చేశారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని వైసీపీ శ్రేణులు రెచ్చిపోతున్నారని, విచ్చలవిడిగా దాడులకు తెగబడుతున్నారని దుయ్యబట్టారు. రాష్ట్ర పార్టీ కార్యాలయంపై దాడి చేయడం చరిత్రలోనే తొలిసారి అని, ఇది ఖచ్చితంగా ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాదమేనంటూ రాష్ట్రపతికి చేసిన ఫిర్యాదు పత్రంలో పేర్కొన్నారు.
ప్రపంచం అంతా ఇండియా- పాకిస్థాన్ మ్యాచ్ పై ఆసక్తిగా ఉంటే మన ప్రతిపక్ష నాయకుడు, అయన పుత్రరత్నం మాత్రం ఆంధ్రప్రదేశ్ లో సంక్షేమ పథకాలను ఎలా అడ్డుకోవాలి? ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ను ఎలా చెడగొట్టాలి? కులాల మధ్య కుంపటి ఎలా రగిలించాలి? ఇదే ఆలోచన. ఎవడి కర్మ కు ఎవరు బాధ్యులు?
— Vijayasai Reddy V (@VSReddy_MP) October 25, 2021
Also read:
Andhra Pradesh: ‘ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక డిగ్రీ కాలేజీ’.. విద్యార్థులకు మరో గుడ్ న్యూస్