Andhra Pradesh: అర్థరాత్రి ఇంట్లోకి దూరి బొప్పాయి చెట్టుకు మేకులు కొట్టాడు.. అది గమనించిన స్థానికులు ఏం చేశారంటే..

Black Magic-Andhra Pradesh: కృష్ణా జిల్లాలోని ఏ-కొండూరు మండలం మారేపల్లి గ్రామంలో క్షుద్రపూజలు కలకలం రేపాయి. క్షుద్ర పూజలు చేస్తున్నాడనే సమాచారంతో ఓ వ్యక్తికి గ్రామస్తులు దేహశుద్ధి చేశారు.

Andhra Pradesh: అర్థరాత్రి ఇంట్లోకి దూరి బొప్పాయి చెట్టుకు మేకులు కొట్టాడు.. అది గమనించిన స్థానికులు ఏం చేశారంటే..
Representative image
Follow us
Shiva Prajapati

|

Updated on: Oct 25, 2021 | 2:32 PM

Black Magic-Andhra Pradesh: కృష్ణా జిల్లాలోని ఏ-కొండూరు మండలం మారేపల్లి గ్రామంలో క్షుద్రపూజలు కలకలం రేపాయి. క్షుద్ర పూజలు చేస్తున్నాడనే సమాచారంతో ఓ వ్యక్తికి గ్రామస్తులు దేహశుద్ధి చేశారు. గ్రామంలోని ఒక ఇంట్లో బొప్పాయి చెట్టుకు మేకులు కొట్టాడని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి స్థానికులు, ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మారేపల్లి గ్రామానికి చెందిన తిరుపతి రావు అర్థరాత్రి వేళ కొబ్బరికాయలు, నిమ్మకాయలతో క్షుద్రపూజలు చేసి రోడ్డుపై పడేశాడు. ఆ తరువాత ఓ ఇంట్లోకి వెళ్లి బొప్పాయి చెట్టుకు మేకులు కొట్టాడు. అది గమనించిన స్థానికులు అతన్ని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అసలు ఏం చేస్తున్నావంటూ నిలదీశారు.

ఈ ఘటనతో ఉక్కసారిగా ఉలిక్కిపడ్డ గ్రామస్తులు.. తిరుపతిరావుకు దేహశుద్ధి చేశారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు మారేపల్లి గ్రామానికి చేరుకున్నారు. తిరుపతిరావును అదుపులోకి తీసుకునేందుకు యత్నించగా.. పోలీసులకు అడ్డం తిరిగారు గ్రామస్తులు. ఉదయం వరకూ అక్కడ తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎట్టకేలకు క్షుద్రపూజలకు పాల్పడుతున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గ్రామస్తుల దాడిలో తీవ్రంగా గాయపడిన తిరుపతిరావును పోలీసులు మైలవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

Also read:

PM Modi: వారణాశి నుంచి పీఎం ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మిషన్ ప్రారంభించిన ప్రధాని మోడీ

Vasireddy Padma: అత్యాచార ఘటనపై స్పందించిన వాసిరెడ్డి పద్మ.. నిందితులపై చర్యలు తీసుకోవాలని ఆదేశం..

Nabha Natesh: నభా నటేష్ అందాలు చూడతరమా… లేటెస్ట్ ఫొటోస్ తో పిచ్చెక్కిస్తున్న బ్యూటీ.. (ఫొటోస్)

మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!