AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Anil Kumar Yadav: వెంకటేశ్వరస్వామి ఆలయంలో అనిల్ ప్రమాణం.. లోకేష్, సోమిరెడ్డి చేయగలరా అంటూ సవాల్..

Nara Lokesh vs Anil Kumar Yadav: రాయలసీమలో పూర్తైన నారా లోకేష్ యువగళం పాదయాత్ర ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఎంటర్ కాగానే కాక మొదలైంది.. జిల్లా స్థాయిలో ప్రధాన పార్టీలు టిడిపి, వైసీపీ గతంలో ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్, టిడిపి నేతల మధ్య ఆరోపణలు ప్రత్యారోపణలు.. సవాళ్లు , ప్రతి సవాళ్లు చాలా సార్లు జరిగాయి..  తాజాగా జిల్లాలో చేపడుతున్న యువగళం పాదయాత్ర వేదికగా నారా లోకేష్..

Anil Kumar Yadav: వెంకటేశ్వరస్వామి ఆలయంలో అనిల్ ప్రమాణం.. లోకేష్, సోమిరెడ్డి చేయగలరా అంటూ సవాల్..
Anil Kumar Yadav
Ch Murali
| Edited By: శివలీల గోపి తుల్వా|

Updated on: Jul 07, 2023 | 4:16 PM

Share

Nara Lokesh vs Anil Kumar Yadav: రాయలసీమలో పూర్తైన నారా లోకేష్ యువగళం పాదయాత్ర ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఎంటర్ కాగానే కాక మొదలైంది.. జిల్లా స్థాయిలో ప్రధాన పార్టీలు టిడిపి, వైసీపీ గతంలో ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్, టిడిపి నేతల మధ్య ఆరోపణలు ప్రత్యారోపణలు.. సవాళ్లు , ప్రతి సవాళ్లు చాలా సార్లు జరిగాయి..  తాజాగా జిల్లాలో చేపడుతున్న యువగళం పాదయాత్ర వేదికగా నారా లోకేష్.. మాజీమంత్రి అనీల్ కుమార్ యాదవ్‌పై పేల్చిన బాంబు సంచలనంగా మారింది.. జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో ఆయా స్థానిక నేతలపై ఆరోపణలు చేస్తున్న లోకేష్ ప్రతి సభలో అనిల్‌‌ని టార్గెట్ చేస్తూనే వచ్చారు. ప్రతి సందర్భంలో టిడిపి అధినేత చంద్రబాబు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పై తీవ్ర పదజాలంతో మాజీమంత్రి అనీల్ కుమార్ ఘాటు విమర్శలు చేస్తూనే ఉంటారు.. బహుశా అదే కారణం కావొచ్చేమో.. ‘అనిల్ ఒక సిల్లీ బచ్చా’ అంటూ పదే పదే కామెంట్ చేస్తూ వచ్చిన లోకేష్ నెల్లూరు సభలో అనిల్ అక్రమార్జన వెయ్యి కోట్లు దాటిందని సంచలన ఆరోపణలు చేశారు.. ఆ మరుసటి రోజే ఆస్తుల కు సంబంధించిన డాక్యుమెంట్లు ఇవే అంటూ మీడియాకు విడుదల చేశారు.. దీంతో ప్రమాణాల పాలిటిక్స్‌కు మరో సారి తెరలేచింది.

మామూలుగానే ఇక్కడి నేతల మాటల తూటాలు ఓ రేంజ్‌లో పేలుతుంటాయి.. ఇపుడు నారా లోకేష్ చేపడుతున్న యువగళం మరింత హీట్ పెంచేసింది.. ఇక రచ్చ మాములుగా లేదిక్కడ.. రాయలసీమ నుంచి నెల్లూరు వచ్చాక లోకేష్ ఫోకస్ అంతా మాజీమంత్రి అనిల్‌‌పైనే అన్నట్టుగా ఉంది.. ఇక అనిల్ దూకుడు కూడా లోకేష్ మాత్రమే నా టార్గెట్ అన్నట్టుగా ఉంది.. నెల్లూరు ప్రజలు నారాయణ ను ఓడించి పాలిచ్చే అవును కాదని తన్నే దున్నపోతుని తెచ్చుకున్నారు అంటూ అనిల్ ని టార్గెట్ చేశారు. ‘సిల్లీ బచ్చా అనిల్ నెల్లూరుకి పీకింది ఏంటి పొడిచింది ఏంటి’ అంటూ నెల్లూరుకి వచ్చా వీఆర్సీ సెంటర్ వచ్చా అభివృద్ధి పై చర్చకు సిద్ధమా…. రా రా రా సిల్లీ బచ్చా అనీల్ అంటూ సవాల్ విసిరారు.  ఇంకా అభివృద్ధిపై చర్చకు సిద్ధమా అంటే తోక ముడిచావని, గడిచిన 4 ఏళ్ల 2నెలల్లో అనిల్ వెయ్యి కోట్లు వెనకేసుకున్నాడని అన్నారు లోకేష్. ఇక లోకేష్ చేసిన ప్రతి ఆరోపణకు కౌంటర్ ఇస్తూ వచ్చిన అనిల్ కూడా గట్టిగానే రియాక్ట్ అయ్యారు. ‘మనం ఇద్దరం తిరుమల వెళదాం. వెయ్యి కాదు 10 కోట్లకు మించి ఉన్నా, నా తండ్రి నాకు ఇచ్చిన ఆస్తి కన్నా రూపాయి ఎక్కువ ఉన్నా ప్రమాణం చేద్దామా. మీ తండ్రి 2 ఎకరాల ఆస్తి గురించి కూడా నేను మాట్లాడను. తిరుమల వెంకటేశ్వరుని దగ్గర ప్రమాణం చేద్దా’మంటూ ప్రతి సవాల్ విసిరారు.

ఇంకా చెన్నైలో నేను ఓ విల్లాలో అద్దెకు ఉంటున్నా అంటూ అద్దె ఇంటి రెంటల్ అగ్రిమెంట్ చూపించిన అనిల్ చర్చకు సిద్ధమా అంటూ ఛాలెంజ్ చేశారు.. సభలో స్టేజిపై నుంచి నిన్న చర్చకు నన్ను పిలవడం కాదు. సమయం చెప్పు ఇద్దరం చర్చిద్దామన్నారు.. దీంతో లోకేష్ అనిల్‌ ని ప్రమాణం చేయాలని చెప్పారు.. దీంతో ఇవాళ నెల్లూరులోని వెంకటేశ్వర పురంలోని తిరుమలేశుని ఆలయంలో మీడియా సమక్షంలో ప్రమాణం చేశారు.. తనకు లోకేష్ విడుదల చేసిన ఆస్తుల్లో ప్రమేయం లేదని.. మంత్రి అయ్యాక 7 కోట్ల విలువైన ఆస్తులు మాత్రమే కొన్నానని అంతకు మించి ఉంటే దేవుడే శిక్ష విడిస్తాడాని.. తాను ప్రమాణం చేసినట్లు టిడిపి నేతలు తనపై చేసిన ఆరోపణలు నిజమని చేసే దమ్ముందా అంటూ మరో సవాల్ విసిరారు.. డాక్యుమెంట్లను విడుదల చేసిన వారికి ప్రమాణం చేసే సత్తా లేదా అని ప్రశ్నించారు.

ఇవి కూడా చదవండి

అనిల్ బినామీ ఆస్తులు అంటూ లోకేష్ విడుదల చేసిన వివరాలు ఇవే..

  • దొంతాలి వద్ద బినామీలు చిరంజీవి, అజంతా పేర్ల మీద రూ.10 కోట్ల విలువ చేసే 50 ఎకరాలు.
  • నాయుడుపేట లో 58 ఎకరాలు బినామీ పేర్లతో. విలువ రూ.100 కోట్లు.
  • ఇనుమడుగు సెంటర్ లో  బినామీలు రాకేష్, డాక్టర్ అశ్విన్ పేరుతో 400 అంకణాలు. విలువ రూ.10 కోట్లు.
  • ఇస్కాన్ సిటీ లో బినామీల పేర్లతో 87 ఎకరాలు. విలువ రూ. 33 కోట్లు.
  • అల్లీపురం 4వ డివిజన్ కార్పొరేటర్, డాక్టర్ అశ్విన్ పేరుపై 42 ఎకరాలు. విలువ రూ.105 కోట్లు. ఇందులో 7 ఎకరాలు ఇరిగేషన్ భూమి.
  • సాదరపాళెం లో 4వ డివిజన్ కార్పొరేటర్, డాక్టర్ అశ్విన్ (అనిల్ తమ్ముడు) పేరుతో 12 ఎకరాలు. విలువ రూ.48 కోట్లు.
  • ఓ పెద్ద కాంట్రాక్టర్ నుంచి దశలవారీగా చిరంజీవికి రూ. కోట్లలో వచ్చాయి.
  • బృందావనంలో శెట్టి సురేష్ అనే పేరుతో 25 కోట్లు విలువ చేసే 4 ఎకరాలు.
  • గూడూరు- చెన్నూరు మధ్యలో 120 ఎకరాలు

-చెన్నూరు మురళీ, టీవీ9 తెలుగు, స్పెషల్ కరస్పాండెంట్

మరిన్ని ఆంధప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..