Bhuma Akhila Priya: భూమా అఖిల ప్రియ అరెస్ట్ అంశంలో చంద్రబాబుపై కీలక వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే అంబటిరాంబాబు.. ఆయన ఏమన్నారంటే..
Bhuma Akhila Priya: టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ప్రతిపక్ష నేత చంద్రబాబుపై వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
Bhuma Akhila Priya: టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ప్రతిపక్ష నేత చంద్రబాబుపై వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. చంద్రబాబు తీరుపై విమర్శలు గుప్పించారు. శనివారం నాడు గుంటూరులో మీడియాతో మాట్లాడిన ఆయన.. మతాల మధ్య చిచ్చు పెట్టేందుకు కొన్ని దుష్ట శక్తులు యత్నిస్తున్నాయని పరోక్షంగా విపక్షాలపై తీవ్ర ఆరోపణలు చేశారు. దేవాలయాలపై చీకట్లో దాడులు చేయడం, జరగని సంఘటనలను జరిగినట్లు చెప్పడం వంటి దుష్ట రాజకీయాలు చేస్తున్నారంటూ అంబటి ధ్వజమెత్తారు. చంద్రబాబు ఇప్పటికే చాలా శృతి మించి మాట్లాడారని అన్నారు. అధికారం కోల్పోయాననే అసహనంతో చంద్రబాబు ఇలాంటి విష ప్రచారానికి తెరలేపారని తీవ్ర ఆరోపణలు చేశారు. జగన్ పుట్టుకతోనే క్రిస్టియన్ కావడంతో ఆయనను ఇబ్బంది పెట్టాలని కొందరు ప్రయత్నిస్తున్నారని అన్నారు.
ఆంధ్రప్రదేశ్ మత సామరస్యానికి ప్రతీక అని, రాష్ట్రంలో మతాల మధ్య ఘర్షణ లేనే లేదని అంబటి రాంబాబు పేర్కొన్నారు. ఇలాంటి పవిత్ర రాష్ట్రంలో చిచ్చుపెట్టాలనే ప్రయత్నం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఈ వ్యవహారంలో టీడీపీ, బీజేపీ నేతల పాత్ర ఉందని, వారు కలిసి చేసిన ఉదంతాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయని అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. పోలీసులు విచారణ చేసి వాస్తవాలు చెబుతుంటే వీళ్లకి గొంతులో వెళక్కాయ పడ్డట్టు అయ్యిందన్నారు. మతాన్ని అడ్డుపెట్టుకుని చేసే రాజకీయం చేస్తే వైసీపీ సహించదని అంబటి స్పష్టం చేశారు. చంద్రబాబు మతిభ్రమించి మాట్లాడుతున్నారని అన్నారు. బూట్లు వేసుకుని పూజలు చేసే చంద్రబాబుకు హిందూత్వంపై ప్రేమ ఉందంటే ఎలా నమ్ముతారని ఆయన ప్రశ్నించారు. వైఎస్సార్సీపీ కి మతమే లేదని, 51 శాతం ఓట్లు సంపాదించడమే దీనికి నిదర్శనం అని పేర్కొన్నారు. ఇంటింటికి సంక్షేమ పథకాలు అందించిన తమకు మతం ఎలా ఉంటుందని ఆయన ప్రశ్నించారు.
దేవతా మూర్తుల విగ్రహాలను ధ్వంసం చేసి ఆ నెపాన్ని వైసీపీ ప్రభుత్వం మోపేందుకు తెలుగుదేశం పార్టీ, బీజేపీలు ప్రయత్నిస్తున్నాయని ఎమ్మెల్యే అంబటి రాంబాబు ఆరోపించారు. కులాలను, మతాలను అడ్డుపెట్టుకుని వైషమ్యాలు పెంచే ఏ శక్తినైనా సహించేది లేదని, ఉక్కుపాదంతో అణిచివేస్తామని ఎమ్మెల్యే అంబటి ఉద్ఘాటించారు. దేవాలయాల్లో విగ్రహాల ధ్వంసంపై జరిగిన విచారణ అంశంలో డీజీపీపై రాజకీయ విమర్శలు చేస్తే టీడీపీ, బీజేపీకి ఎలాంటి లాభం లేదని వ్యాఖ్యానించారు. రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్రంలో టీడీపీ, బీజేపీ చేస్తున్న నీచ రాజకీయాలు ప్రజలకు అర్థమవుతున్నాయని అన్నారు. రాజకీయాలకు పనికిరాని లోకేష్ చేస్తున్న పనులు వల్ల ఆ పార్టీకే నష్టం వాటిల్లుతుందని వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో చంద్రబాబు మంత్రి వర్గంలో పని చేసిన భూమా అఖిల ప్రియ అరెస్ట్‌పై అంబటి రాంబాబు స్పందించారు. తన పార్టీ నాయకురాలు అరెస్టైతే చంద్రబాబు ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు.
Also read:
Alludu Adhurs’ Success Meet: బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటించిన ‘అల్లుడు అదుర్స్’ సక్సెస్ మీట్