Kurnool: మహిళను కరుణించిన లక్ష్మీదేవి.. వజ్రాల వేటలో లక్షలు విలువజేసే రంగురాయి లభ్యం..
కర్నూలు జిల్లాలో వర్షాలు కురుస్తుండటంతో వజ్రాల వేటను మొదలు పెట్టారు. స్థానిక గ్రామాల ప్రజలతో పాటు కొంతమంది బయట వ్యక్తులు కూడా వజ్రాల వేటలో బిజీగా అయిపోతున్నారు. ఎందుకంటే లక్ష్మీదేవి తలుపు తట్టి.. ఒక్క వజ్రం దొరికితే చాలు లక్షాదికారి అవ్వొచ్చు.. జీవితం సెటిలైనట్లే అనే ఆశతో వజ్రాల గాలింపు ని మొదలు పెట్టారు.

రాయలు ఏలిన సీమ రాయలసీమ గత వైభవం గురించి ఎంత చెప్పినా తక్కువే అని అంటారు. రాయలనాటి కాలంలో వజ్రవైడూర్యాలను రాశులుగా పోసి అంగాల్లో అమ్మేవారని అంటారు. అందుకు సాక్ష్యంగానేమో.. తరచుగా కర్నూలు, అనంతపురం జిల్లాల్లో వజ్రాలు బయటపడుతూ ఉంటాయి. తొలకరి జల్లులు పడితే చాలు పంట పొలాల్లో రంగు రాళ్ల కోసం వేట మొదలు పెడతారు కొందరు. ఏ చిన్న రాయి అయినా కనిపించకపోతుందా.. అంటూ కర్నూలు జిల్లాలో వర్షాలు కురుస్తుండటంతో వజ్రాల వేటను మొదలు పెట్టారు. స్థానిక గ్రామాల ప్రజలతో పాటు కొంతమంది బయట వ్యక్తులు కూడా వజ్రాల వేటలో బిజీగా అయిపోతున్నారు. ఎందుకంటే లక్ష్మీదేవి తలుపు తట్టి.. ఒక్క వజ్రం దొరికితే చాలు లక్షాదికారి అవ్వొచ్చు.. జీవితం సెటిలైనట్లే అనే ఆశతో వజ్రాల గాలింపు ని మొదలు పెట్టారు.
ప్రతి సంవత్సరం కర్నూలు జిల్లాలోని పరిసర ప్రాంతంలో తొలకరి వానల తర్వాత అనేక మంది వజ్రాల కోసం వెతుకుతూ ఉంటారు. గతంలో చాలా మందికి ఖరీదైన రాళ్లు దొరికాయి. వాటిని వ్యాపారుల దగ్గరకు తీసుకెళ్లి అమ్ముకుని సొమ్ము చేసుకున్నారు కూడా.. ఈ నేపథ్యంలో ఈ రోజు ఒక మహిళను లక్ష్మీదేవి కరుణించింది.. ఇవాళ పొలంలో రంగు రాళ్లకు వెకుతులాట మొదలుపెట్టిన ఓ మహిళకు వజ్రం దొరికింది.
మద్దికేర మండలం మదనంతపురం గ్రామానికి చెందిన మహిళ రైతుకు విలువైన వజ్రం లభ్యమైంది. దీని విలువ కొన్ని లక్షలు ఉంటుందని తెలుస్తోంది. మహిళ నుంచి ఆ వజ్రాన్ని జొన్నగిరికి చెందిన ఓ వజ్రాల వ్యాపారి 14 లక్షలు రూపాయలు నగదు, నాలుగు తులాల బంగారనికి కొనుగోలు చేశారు.




కర్నూలు జిల్లాల్లో స్థానికులే కాదు చుట్టు పక్కల జిల్లాల నుంచి వజ్రాల వేట కోసం చాలామంది వస్తుంటారు. ఒక్క వజ్రమైనా దొరక్కపొదా అనే ఆశతో వెతుకుతుంటారు. ఒకవేళ మెరుస్తూ రాయి కనిపిస్తే చాలు వజ్రాల వ్యాపారి దగ్గరకు పరుగులు పెడుతున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..