AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bapatla: బావమరుదులతో మహిళ ఎఫైర్.. చూడండి చివరకు ఎంత పని అయిందో

వివాహేతర సంబంధం ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది... తనను పెళ్లి చేసుకోవాలని కోరినందుకు ప్రియురాలికి మద్యం తాగించి, ఆపై కొట్టి చంపేశాడు ప్రియుడు. గుట్టుచప్పుడు కాకుండా మృతదేహాన్ని పూడ్చేసి ఏమీ ఎరగనట్టు గప్‌చుప్‌ అయిపోయాడు... మహిళను హత్య చేసిన విషయం తెలియక ఆమె కనిపించడం లేదంటూ బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో హత్య కేసు వెలుగులోకి వచ్చింది... విచిత్రం ఏంటంటే పోలీసులు ఓ హత్యకేసులో నిందితులను విచారిస్తుండగా నెలరోజుల క్రితం జరిగిన ఈ హత్య కేసు వెలుగులోకి వచ్చింది. హతురాలు భర్త చనిపోవడంతో మద్యానికి బానిసగా మారి మరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకోవడమే ఆమె ప్రాణాలను తీసింది. దీంతో ఆమె ఇద్దరు పిల్లలు అనాధలుగా మారారు.

Bapatla: బావమరుదులతో మహిళ ఎఫైర్.. చూడండి చివరకు ఎంత పని అయిందో
Prameela
Fairoz Baig
| Edited By: Ram Naramaneni|

Updated on: Jun 09, 2025 | 8:57 AM

Share

బాపట్ల జిల్లా వేటపాలెం మండలం రామన్నపేటకు చెందిన 24 ఏళ్ళ మానికల దీపిక అలియాస్‌ ప్రమీల మిస్సింగ్ కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. కనిపించకుండా పోయిన మహిళను ఇద్దరు నిందితులు పథకం ప్రకారం హత్య చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. రామన్నపేట పంచాయతీ వినాయకపురంలో నివాసముండే మృతురాలు ప్రమీల భర్త మరణంతో చెడు వ్యసనాలకు బానిసగా మారింది.  ఈక్రమంలో ఈగ వెంకటేశ్వరరావు అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. నిజాంపట్నంకు చెందిన ఈగ వెంకటేశ్వరరావు గత కొంతకాలంగా రామన్నపేటలో ఉంటున్నాడు. ఈగ వెంకటేశ్వరరావు తనతో సన్నిహితంగా ఉండే సైకం నాగబాబుకు తన చెల్లెలిని ఇచ్చి వివాహం చేశాడు… ఇదే సమయంలో ఒకవైపు వెంకటేశ్వరరావుతో వివాహేతర సంబంధం నెరపుతూనే మరోవైపు అతని బావ నాగబాబుతో చనువుగా ఉంటోంది… అంతే కాకుండా వెంకటేశ్వరరావు చెల్లెలును వదిలేసి తనను వివాహం చేసుకోవాలని నాగబాబుపై ఒత్తిడి తెచ్చింది… ఈ విషయంలో ఈగ వెంకటేశ్వరరావు, సైకం నాగబాబులు ఒక్కటై ప్రమీల అడ్డు తొలగించుకోవాలని భావించి పధకం వేశారు… మద్యం అలవాటు ఉన్న ప్రమీలను బీరు తాగుదామంటూ పందిళ్లపల్లి -తిమ్మసముద్రం రోడ్డులో ఉన్న నిర్జన ప్రదేశానికి తీసుకెళ్ళారు… అక్కడ ప్రమీలకు ఫూటుగా మద్యం తాగించి బీరుబాటిల్‌తో ఆమె తలపై కొట్టి అనంతరం గొంతు నులిమి చంపేశారు… ఈ విషయం ఎక్కడా బయట పడకుండా ఉండేందుకు ఎప్పటిలాగే ప్రవర్తించ సాగారు… ప్రమీల కూడా భర్త చనిపోయిన తరువాత చెడు వ్యసనాలకు బానిసగా మారి ఇంటి నుంచి కొన్నాళ్ళు బయటకు వెళ్ళి తిరిగి వస్తుండటంతో ఆమె మళ్ళీ వస్తుందన్న నమ్మకంతో బంధువులు ఆమెకోసం గాలించలేదు… అయితే ప్రమీలను ఆమెతో వివాహేతర సంబంధం పెట్టుకున్న వెంకటేశ్వరరావు, అతని బావ నాగబాబులు చంపేశారంటూ గ్రామంలో ప్రచారం జరుగుతుండటంతో అలర్ట్‌ అయిన ప్రమీల బంధువులు ఈనెల 1వ తేదిన పోలీసులను ఆశ్రయించడంతో ప్రమీల హత్య కేసు వెలుగులోకి వచ్చింది.

నెలరోజుల క్రితం అదృశ్యం… ఓ హత్యకేసు విచారణలో బయటపడ్డ ప్రమీల హత్య ఉదంతం…

తొలుత ప్రమీల అదృశ్యంపై మిస్సింగ్‌ కేసు నమోదు చేసుకున్న పోలీసులు అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు… ఈ క్రమంలో మరో గుర్తు తెలియని మహిళ మృతదేహం లభించింది… తాము హత్య చేసిన ప్రమీల మృతదేహం లభించిందని భావించిన నిందితులు వెంకటేశ్వరరావు, నాగబాబులు తాము ప్రమీలను నెలరోజుల క్రితం హత్య చేసిన విషయాన్ని పోలీసుల ముందు ఒప్పుకున్నారు… ఆమెను హత్య చేసి పూడ్చిపెట్టిన ప్రాంతాన్ని చూపించారు… దీంతో అదృశ్యమైన ప్రమీల హత్యకు గురైందని పోలీసులు నిర్ధారించుకుని మృతదేహాన్ని వెలికితీశారు… ప్రమీల మృతదేహాన్ని బంధువులు గుర్తించడంతో ఈగ వెంకటేశ్వరరావు, సైకం నాగబాబులను పోలీసులు అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించామని చీరాల డిఎస్‌పి మొయిన్‌ తెలిపారు.

చెడు వ్యసనాలకు బానిసగా మారిన మహిళ వివాహేతర సంబంధాలు పెట్టుకోవడం, ఈ కారణాలతో చెలరేగిన వివాదాల్లో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయింది… దీంతో అటు తండ్రి, ఇటు తల్లి లేక ఆమె ఇద్దరు పిల్లలు అనాధలుగా మారారు… కట్టుతప్పిన జీవితాలు చివరికి అర్ధాంతరంగా ముగుస్తాయనడానికి ప్రమీల హత్య ఉదంతం ఓ ఉదాహరణగా నిలుస్తోంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

వెస్ట్రన్ టాయిలెట్ ఇంట్లో ఉందా?.. ఈ పొరపాట్లు చేయకండి..
వెస్ట్రన్ టాయిలెట్ ఇంట్లో ఉందా?.. ఈ పొరపాట్లు చేయకండి..
శుక్ర, బుధుల యుతి..ఆ రాశుల వారికి కష్టనష్టాలు.. జాగ్రత్త..!
శుక్ర, బుధుల యుతి..ఆ రాశుల వారికి కష్టనష్టాలు.. జాగ్రత్త..!
తన ఇంటిని తాకట్టు పెట్టిమరీ.. మేనమామ కష్టం తీర్చాడు.. చివరకు
తన ఇంటిని తాకట్టు పెట్టిమరీ.. మేనమామ కష్టం తీర్చాడు.. చివరకు
ఆ సినిమా కోసం రజనీ తో మోహన్‌లాల్‌ ములాఖత్‌.. అబ్బో ఇక సీన్ సితారే
ఆ సినిమా కోసం రజనీ తో మోహన్‌లాల్‌ ములాఖత్‌.. అబ్బో ఇక సీన్ సితారే
లెక్క తప్పితే డేంజరే.. మీ ఏజ్ ప్రకారం ఎంత సేపు నిద్రపోవాలో..
లెక్క తప్పితే డేంజరే.. మీ ఏజ్ ప్రకారం ఎంత సేపు నిద్రపోవాలో..
ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా
ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా
ప్రపంచంలో ధూమపానాన్ని నిషేధించిన మొట్టమొదటి దేశం ఇదేనట!
ప్రపంచంలో ధూమపానాన్ని నిషేధించిన మొట్టమొదటి దేశం ఇదేనట!
మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చిన దర్శకుల డ్రీమ్ ప్రాజెక్ట్స్..
మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చిన దర్శకుల డ్రీమ్ ప్రాజెక్ట్స్..
రాత్రుళ్లు ఈ ప్రదేశాలు మహాద్భుతం.. హాలీవుడ్ భవనాలను తలపిస్తాయి..
రాత్రుళ్లు ఈ ప్రదేశాలు మహాద్భుతం.. హాలీవుడ్ భవనాలను తలపిస్తాయి..