Janasena: సభ్యత్వాల్లో అదరగొట్టిన జనసేన.. రెండు వారాల్లో ఏకంగా 14 లక్షలు నమోదు.!
జనసేన పార్టీలో అధికార జోష్.. సభ్యత్వ నమోదుకు ఊహించని రీతిలో స్పందన.. టార్గెట్‌కు డబుల్ మెంబర్‌షిప్స్.. ఎస్.. జనసేన సభ్యత్వ నమోదు కార్యక్రమం రికార్డ్‌లను బ్రేక్ చేసింది. పార్టీ సభ్యత్వాలు గతేడాది కంటే రెట్టింపు కావడంతో జనసేన పార్టీ శ్రేణుల్లో జోష్ నెలకొంది.
జనసేన పార్టీలో అధికార జోష్.. సభ్యత్వ నమోదుకు ఊహించని రీతిలో స్పందన.. టార్గెట్‌కు డబుల్ మెంబర్‌షిప్స్.. ఎస్.. జనసేన సభ్యత్వ నమోదు కార్యక్రమం రికార్డ్‌లను బ్రేక్ చేసింది. పార్టీ సభ్యత్వాలు గతేడాది కంటే రెట్టింపు కావడంతో జనసేన పార్టీ శ్రేణుల్లో జోష్ నెలకొంది. ఇంతకీ.. జనసేన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఆకట్టుకున్న అంశాలేంటి?..
ఏ పార్టీకైనా క్యాడరే బలం.. ఇది వంద శాతం కరెక్ట్.. అవును.. క్యాడర్ బలంగా ఉంటేనే పార్టీలు మనుగడ సాధించగల్గుతాయి. ఈ మాట జనసేన పార్టీకి సరిగ్గా షూటవుతుంది. ఎందుకంటే.. ఎవరు అవునన్నా.. కాదన్నా.. నిన్నమొన్నటి వరకు జనసేన పార్టీకి బలమైన కార్యకర్తలే లేరు.. కేవలం.. సానుభూతిపరులు, ఫ్యాన్స్‌తోనే పదేళ్లుగా రాజకీయాల్లో నెట్టుకుంటూ వస్తోంది. కానీ.. మొన్నటి ఎన్నికల్లో కూటమి ఘనవిజయం సాధించడం.. జనసేన 100 పర్సెంట్ స్ట్రైక్ రేట్‌తో రికార్డ్ సృష్టించడంతో ఆ పార్టీలో జోష్ నెలకొంది. సరిగ్గా ఇలాంటి సమయంలో.. క్యాడర్ పెంచుకునేందుకు వ్యూహాత్మకంగా వ్యవహారిస్తోంది. గెలుపు జోష్‌ను కంటిన్యూ చేసేందకు ఏమాత్రం గ్యాప్ తీసుకోకుండా జనసేన సభ్యత్వ నమోదుకు శ్రీకారం చుట్టింది.
అధికార భాగస్వామ్యంలో ఉన్న జనసేన.. పార్టీ బలోపేతానికి కీలకమైన అడుగులు వేస్తుంది. దానిలో భాగంగానే.. ఏపీ వ్యాప్తంగా సభ్యత్వాల నమోదు కార్యక్రమాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లింది. గత నెల 18నుంచి.. ఆగస్టు 5వరకు సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టింది. దాంతో.. జనసేన పార్టీ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా.. ఈ సంవత్సరం 10 లక్షల పైగా సభ్యత్వాలు నమోదయ్యాయి. నిజానికి.. తొలుత జూలై18 నుంచి 28వరకు సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించగా.. అప్పటికే 10లక్షల సభ్యత్వాలు దాటడంతో మరో వారం పాటు గడువు పెంచింది. దాంతో.. రెండు వారాల్లోనే 13 నుంచి 14లక్షల వరకు సభ్యత్వాలు నమోదు అయినట్లు జనసేన అంచా వేస్తోంది. గత ఏడాది నెల రోజుల వ్యవధిలో కేవలం 5,40,000 మాత్రమే సభ్యత్వాలు నమోదు కాగా.. ఈ ఏడాది దానికి రెండింతలు అధికంగా రికార్డ్ అవడంతో జనసేన పార్టీలో మెంబర్‌షిప్ జోష్ నెలకొంది.
ఇదిలావుంటే.. ఏపీలో అనేకమంది నేతలు, కార్యకర్తలు జనసేన వైపు చూస్తున్నట్లు ఆ పార్టీ నేతలు చెప్తున్నారు. దానికి తగ్గట్లే.. గ్రామ, మండల, రాష్ట్రస్థాయిల్లో భారీ ఎత్తున జనసేనలోకి జాయినింగ్‌లు కొనసాగుతున్నాయంటున్నారు. జనసేన హిస్టరీలో ఇప్పటివరకు మూడు దఫాలుగా సభ్యత్వం నమోదు కార్యక్రమాన్ని పూర్తి చేయగా.. ఇప్పుడు అధికార భాగస్వామ్యంలోకి వచ్చిన తర్వాత ఫోర్త్ ఫేజ్ మెంబర్ షిప్ ప్రోగ్రామ్ చేపట్టింది. అదేసమయంలో.. క్యాడర్ నిర్మాణం, పార్టీ బలోపేతం, కొత్త కమిటీలు, పాత నాయకత్వానికి భరోసా ఇస్తూనే.. కొత్త నాయకత్వాన్ని ఆహ్వానిస్తోంది. భవిష్యత్‌లో జనసేనను సంస్థాగతంగా మరింత బలోపేతం చేసేలా పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తూ కొత్తవారిని స్వాగతిస్తూ సభ్యత్వ కార్యక్రమం నిర్వహించింది. ఫలితంగా.. ప్రతి నియోజకవర్గంలోనూ ఇన్‌చార్జ్‌లు, పార్టీ నేతలు, కార్యకర్తలు సభ్యత్వ నమోదుపై స్పెషల్ ఫోకస్ పెట్టారు.
ఇదంతా ఒక ఎత్తయితే.. సభ్యత్వ నమోదులో జనసేన పార్టీ తీసుకున్న వినూత్న నిర్ణయం మరో ఎత్తు అని చెప్పొచ్చు. ఇప్పుడే జనసేనకు బూస్టప్‌గా మారింది. ఇతర పార్టీలకు భిన్నంగా క్రియాశీలక సభ్యత్వం తీసుకున్నవారికి 500 రూపాయలతో బీమా కల్పిస్తోంది జనసేన. ప్రమాదవశాత్తు ఎవరైనా చనిపోతే క్రియాశీలక సభ్యత్వం ఉన్న కుటుంబాలకు ఐదు లక్షల బీమా చెక్కులు అందజేస్తోంది. ఇప్పటికే 20 కోట్ల రూపాయలకు పైగా విలువైన చెక్కులను వందలాదిమంది క్రియాశీలక సభ్యుల ఫ్యామిలీలకు అందించడంతో జనసేనకు విస్తృత ప్రచారం లభించింది. మిగతా పార్టీల్లో సభ్యత్వాలు ఉన్నప్పటికీ.. ఎలాంటి ప్రయోజనం లేని కారణంగా అనేకమంది ఈసారి జనసేన వైపు మొగ్గు చూపారు. చిన్నచిన్న పనులు చేసుకునేవారి నుంచి.. డ్రైవర్లు, పైస్థాయి ఉద్యోగుల వరకు అనేకమంది ఫ్యామిలీలకు ఫ్యామిలీలే జనసేన సభ్యత్వం తీసుకున్నారు. దాంతో.. గతేడాది కంటే డబుల్ సభ్యత్వాలు నమోదయ్యాయి. మొత్తంగా.. అధికారంలో భాగస్వామ్యం, కార్యకర్తలకు ఇస్తోన్న భరోసా, బీమా బెనిఫిట్స్.. లాంటి అంశాలు జనసేన సభ్యత్వ నమోదులో డబుల్ జోష్ నింపాయి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..