Andhra Pradesh: R5 జోన్‌ లబ్ధిదారుల అంశంలో ఏపీ సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం

R5 జోన్‌ విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు సీఎం చంద్రబాబు. ఆర్‌5 జోన్‌లో గత ప్రభుత్వంలో ఇళ్లస్థలాలు పొందిన.. లబ్ధిదారులకు సొంతప్రాంతాల్లో ఇళ్ల స్థలాలు.. అవసరమైతే టిడ్కో ఇళ్లను నిర్మించి ఇచ్చేలా నిర్ణయం తీసుకున్నారు సీఎం

Andhra Pradesh: R5 జోన్‌ లబ్ధిదారుల అంశంలో ఏపీ సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం
Cm Chandrababu
Follow us

|

Updated on: Aug 05, 2024 | 9:27 PM

ఆర్5 జోన్ లబ్ధిదారుల విషయంలో ఏపీ సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. రాజధానిలో ఆర్5 జోన్‌లో ఇళ్ళ స్థలాలు పొందిన లబ్ధిదారులకు వారి సొంత ప్రాంతాల్లో ఇళ్ల స్థలాలు ఇవ్వాలని నిర్ణయించారు. అవసరమైతే టిడ్కో ఇళ్లు నిర్మించి ఇద్దామని అధికారులతో చెప్పారు. ప్రభుత్వ నిర్ణయంతో ఆర్5 జోన్ వివాదానికి పరిష్కారం దొరికింది. అమరావతి ప్రాంతంలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు గత ప్రభుత్వం 2022 అక్టోబర్‌లో సీఆర్డీయే చట్టం-2014కు మార్పులు చేసింది. ఆర్5 పేరుతో హౌసింగ్ జోన్ ఏర్పాటు చేసింది. సీఆర్డీయే చట్టంలోని సెక్షన్-53(డీ) ప్రకారం ల్యాండ్ ఫూలింగ్ కింద సమీకరించిన విస్తీర్ణంలో 5 శాతం గృహ నిర్మాణాలకు కేటాయించవచ్చు అనే అంశాన్ని ఆధారంగా గత వైసీపీ ప్రభుత్వం సెక్షన్ 41లో మార్పులు చేసి ఆర్ 5 జోన్‌గా పిలిచింది. 900.97 ఎకరాల భూమిని ఇళ్ల నిర్మాణం కోసం కేటాయిస్తున్నట్లు ప్రకటించింది. ఆ చట్టాలకు అనుగుణంగా 2023 మార్చి 31న జీవో 45 విడుదల చేసింది. ఆర్ 5జోన్ లో వైసీపీ ప్రభుత్వం విజయవాడ, గుంటూరు వాసులకు ఆర్5 జోన్‌లో ఇళ్ల స్థలాలను కేటాయించింది.

రాజధానిలో ఆర్‌-5 జోన్ పేరిట బయట వారికి ఇళ్ల స్థలాలు ఇవ్వడాన్ని రాజధాని వ్యతిరేకిస్తూ రాజధాని రైతులు కోర్టును ఆశ్రయించారు. తమకు కేటాయించాల్సిన ప్లాట్లు ఎక్కడ ఉన్నాయో చెప్పకుండా ప్రభుత్వం ఆర్5 జోన్‌ను ప్రకటించడాన్ని వ్యతిరేకించారు. ప్రభుత్వ నిర్ణయాన్ని హైకోర్టులో రైతులు సవాల్ చేశారు. రాజధానిలో నిర్మించిన టిడ్కో ఇళ్లు లబ్ధిదారులకు అందజేయకుండా ఇళ్ల పట్టాల పంపిణీపై ప్రభుత్వానికి తొందర ఎందుకని పిటిషనర్‌లు అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే ఇప్పడు తాజాగా ఆర్5 జోన్ సమస్యపై కూటమి ప్రభుత్వం స్పందించింది. లబ్ధిదారులకు వారి సొంత ప్రాంతాల్లో ఇళ్ల స్థలాలు ఇవ్వాలని నిర్ణయించింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..