AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: టీడీపీ, జనసేన కూటమిలో బీజేపీ చేరుతుందా..? ఏపీ నేతల అభిప్రాయంపై సర్వత్రా ఉత్కంఠ..

టీడీపీ, జనసేన కూటమిలో బీజేపీ చేరుతుందా? ఏపీ వ్యవహరాలపై బీజేపీ హైకమాండ్ ఫోకస్ పెట్టిందా.. ? పొత్తులపై అభిప్రాయాలను తెలుసుకునేందుకే తరుణ్‌చుగ్‌ వచ్చారా?. ఇవాళ్టి పదాధికారుల సమావేశంలో ఏం జరగబోతుంది.? ఇలాంటి ప్రశ్నలతో .. ఏపీలో రాజకీయం వేడేక్కింది. గెలుపే అజెండాగా ప్రధాన పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. ఇదే తరుణంలో ఏపీ బీజేపీ కూడా దూకుడు పెంచింది.

Andhra Pradesh: టీడీపీ, జనసేన కూటమిలో బీజేపీ చేరుతుందా..? ఏపీ నేతల అభిప్రాయంపై సర్వత్రా ఉత్కంఠ..
AP Politics
Shaik Madar Saheb
|

Updated on: Jan 04, 2024 | 11:23 AM

Share

టీడీపీ, జనసేన కూటమిలో బీజేపీ చేరుతుందా? ఏపీ వ్యవహరాలపై బీజేపీ హైకమాండ్ ఫోకస్ పెట్టిందా.. ? పొత్తులపై అభిప్రాయాలను తెలుసుకునేందుకే తరుణ్‌చుగ్‌ వచ్చారా?. ఇవాళ్టి పదాధికారుల సమావేశంలో ఏం జరగబోతుంది.? ఇలాంటి ప్రశ్నలతో .. ఏపీలో రాజకీయం వేడేక్కింది. గెలుపే అజెండాగా ప్రధాన పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. ఇదే తరుణంలో ఏపీ బీజేపీ కూడా దూకుడు పెంచింది. విజయవాడ కేంద్రంగా బీజేపీ ఏపీ చీఫ్ పురందేశ్వరి నేతృత్వంలో పదాధికారులు, జిల్లా అధ్యక్షుల సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో మొత్తం 11అంశాలతో ఏపీ బీజేపీ రాజకీయ తీర్మానం చేసింది. 10 తీర్మానాలు వైసీపీ వైసీపీ వైఫల్యాలపై చేస్తే.. ఒక తీర్మానం మాత్రం జనసేన మిత్రపక్షమని పేర్కొన్నారు. ఈ రాజకీయ తీర్మానాన్ని ఏపీ బీజేపీ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఏపీలో వైసీపీ సర్కార్‌ అవినీతిలో కూరుకుపోయిందని విమర్శించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి. వైసీపీ పాలనలో రాష్ట్రానికి ఒక్క కొత్త ఫ్యాక్టరీ కూడా రాలేదన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను తమవిగా చెప్పుకొని ప్రభుత్వం పబ్బం గడుపుతోందని మండిపడ్డారు పురందేశ్వరి.

టీడీపీతో పొత్తుపై పార్టీ నేతలతో చర్చించనున్న తరుణ్‌చుగ్

మరోవైపు తీర్మానాల్లో టీడీపీతో పొత్తు అంశాన్ని ప్రస్తావించలేదు. టీడీపీతో పొత్తు అంశాన్ని పార్టీ మైకమాండ్ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని పార్టీ ముఖ్య నేతలు సూచించారు. మొత్తంగా ఎన్నికలు దగ్గరపడుతున్న తరుణంలో పార్టీ శ్రేణుల్లో ఉన్న పొత్తుల డైలమాను తేల్చేసే దిశగా కసరత్తు చేస్తోంది బీజేపీ. టీడీపీ, జనసేన పార్టీలు ఇప్పటికే కలిసి పోటీ చేస్తామని ప్రకటించడంతో ఈ కూటమిలో బీజేపీ చేరుతుందా లేదా అన్న దానిపై సస్పెన్స్ కొనసాగుతోంది. తాజాగా బీజేపీ జాతీయ నేత తరుణ్ చుగ్.. ఈ అంశంపై పార్టీ నేతలతో మాట్లాడేందుకు విజయవాడ వచ్చారు. ఇవాళ జరిగే బీజేపీ ఏపీ కోర్ కమిటీ భేటీకి హాజరుకానున్నారు తరుణ్ చుగ్. పొత్తులపై నేతల అభిపప్రాయాలను తరుణ్ చుగ్‌కు ఏపీ బీజేపీ ముఖ్యనేతలు వివరించనున్నారు. నేతల అభిప్రాయాలను విడివిడిగా తెలుసుకొని కేంద్ర పెద్దలకు ఫైనల్‌ అవుట్‌పుట్ ఇస్తారని తెలుస్తుంది. షో ఇవాళ్టి పధాదికారుల భేటీలో పొత్తులపై స్పష్టత వచ్చే ఛాన్స్ లేకపోలేదంటున్నారు బీజేపీశ్రేణులు.

వీడియో చూడండి..

ఈ సమావేశానికి బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురందేశ్వరి, మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, సత్య కుమార్, ఎంపీ జీవీఎల్, సుజనా చౌదరి, సీఎం రమేష్‌ సహా కీలక నేతలు హాజరుకానున్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి ఎన్నికల వెళ్తాయన్న చర్చల నేపథ్యంలో పొత్తులపై చర్చించి.. బీజేపీ నేతలు ఢిల్లీకి రిపోర్ట్ ఇవ్వబోతున్నారు. రాష్ట్ర నేతల అభిప్రాయం మేరకు హైకమాండ్ స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..