Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gudivada Amarnath: ప్రజలు, కార్యకర్తలకు దూరంగా వెళ్లలేకపోతున్నా.. మంత్రి గుడివాడ అమర్నాథ్‌ కంటతడి..

అనకాపల్లి నియోజకవర్గాన్ని వదలాల్సి వస్తుందంటూ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. అనకాపల్లి నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన అమర్‌నాథ్.. మంత్రి పదవిని చేపట్టారు. అయితే, ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు వైసీపీ అధినేత, సీఎం జగన్ సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. నియోజకవర్గాల వారీగా సమీక్షలు జరుపుతూనే.. పలు చోట్ల అభ్యర్థులను మార్చుతున్నారు.

Gudivada Amarnath: ప్రజలు, కార్యకర్తలకు దూరంగా వెళ్లలేకపోతున్నా.. మంత్రి గుడివాడ అమర్నాథ్‌ కంటతడి..
Gudivada Amarnath
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jan 04, 2024 | 7:58 AM

అనకాపల్లి నియోజకవర్గాన్ని వదలాల్సి వస్తుందంటూ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. అనకాపల్లి నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన అమర్‌నాథ్.. మంత్రి పదవిని చేపట్టారు. అయితే, ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు వైసీపీ అధినేత, సీఎం జగన్ సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. నియోజకవర్గాల వారీగా సమీక్షలు జరుపుతూనే.. పలు చోట్ల అభ్యర్థులను మార్చుతున్నారు. వైనాట్ 175 టార్గెట్ సీఎం జగన్ పలు నియోజకవర్గాలకు కొత్త ఇంచార్జులను నియమిస్తున్నారు. ఈ క్రమంలో అనకాపల్లికి మలసాల భరత్‌ను సీఎం జగన్ ఇంచార్జిగా నియమించారు. మంత్రి అమర్‌నాథ్‌కు సంబంధించి పార్టీ అధిష్టానం.. ఎలాంటి ప్రకటన చేయలేదు. ఉత్తరాంధ్రకు సంబంధించిన జాబితాలోనూ మంత్రి అమర్‌నాథ్ పేరును ప్రకటించలేదు.. అంతేకాకుండా.. ఎలాంటి బాధ్యతలను సైతం అప్పగించలేదు.

ఈ క్రమంలో సిట్టింగ్ స్థానమైన అనకాపల్లి నియోజకవర్గాన్ని వీడటంపై మంత్రి అమర్‌నాథ్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. రాజకీయంగా పునర్జన్మను ఇచ్చిన అనకాపల్లి ప్రజలను వదిలి వెళ్ళలేనంటూ కన్నీరు పెట్టుకున్నారు. అనకాపల్లిలో వైసీపీ కొత్త నియోజకవర్గ ఇన్ఛార్జ్ మలసాల భరత్ కుమార్ పరిచయ సమావేశంలో ఈ ఘటన జరిగింది. రాజకీయ ప్రయాణంలో తనకు సహకరించిన కార్యకర్తలు, నాయకుల రుణం ఎప్పటికైనా తీర్చుకుంటానంటానన్నారు.

వీడియో చూడండి..

సీఎం జగన్ ఆదేశిస్తే పోటీకి దూరమై కార్యకర్తగా వైసీపీ గెలుపునకు కృషి చేస్తానని మంత్ర అమర్‌నాథ్ స్పష్టం చేశారు. ‘‘మిమ్మల్ని వీడి బాధతో వెళుతున్నా.. మీ రుణం ఎప్పటికైనా తీర్చుకుంటా’’ అంటూ అమర్ నాథ్ గద్గగ స్వరంతో మాట్లాడారు. అమర్‌నాథ్ తీవ్ర భావోద్వేగానికి గురవ్వడంతో పార్టీ నేతలు ఓదార్చారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..