Flexy War in AP: డీజిల్ దొంగ ఎవరు? తాడిపత్రిలో ఫ్లెక్సీ వార్ మొదలు..
తాడిపత్రి మున్సిపల్ కమిషనర్ వర్సెస్ తాడిపత్రి మునిసిపల్ చైర్మన్ అన్నట్టుగా సాగుతున్న రాజకీయాలు అనేక ఉద్రిక్తతలకు కారణంగా మారాయి. ఈ నేపథ్యంలోనే ఎవరి పాలనలో ఎంత ఖర్చు చేశారో తాడిపత్రి ప్రజలే తెలుసుకోవాలని పోస్టర్లు వెలిశాయి.
అనంతపురం జిల్లా రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. తాజాగా తాడిపత్రి పట్టణంలో ఫ్లెక్సీ వార్ మొదలైంది. తాడిపత్రిలో డీజిల్ దొంగ ఎవరు అంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం కలకలం రేపుతోంది. గత కొంతకాలంగా తాడిపత్రి మున్సిపాలిటీలో అక్రమంగా డీజిల్ దొంగతనం జరుగుతోందని ఆరోపించారు మున్సిపల్ చైర్మన్ జెసి ప్రభాకర్ రెడ్డి. మరోవైపు ఇప్పటికే తాడిపత్రి మున్సిపల్ కమిషనర్ వర్సెస్ తాడిపత్రి మునిసిపల్ చైర్మన్ అన్నట్టుగా సాగుతున్న రాజకీయాలు అనేక ఉద్రిక్తతలకు కారణంగా మారాయి. ఈ నేపథ్యంలోనే ఎవరి పాలనలో ఎంత ఖర్చు చేశారో తాడిపత్రి ప్రజలే తెలుసుకోవాలని పోస్టర్లు వెలిశాయి. డీజిల్ దొంగ ఎవరు అనేది తాడిపత్రి ప్రజలే నిర్ణయించుకోవాలి??? అంటూ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు.
ఈ బ్యానర్లు ప్రజల్లో తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. ఇటీవల మున్సిపల్ కమిషనర్ తీరుకి నిరసనగా మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకరరెడ్డి నిరసన చేపట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మున్సిపాలిటీలో డీజిల్ దొంగ ఎవరు అని వెలసిన భారీ ఫ్లెక్సీలపై చర్చ సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..