AP Weather: ఏపీలోని ఈ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదే
ఏపీలో అకాల వర్షాలు దంచి కొడుతున్నాయి. ఉరుములు, మెరుపులతో పాటు పలు ప్రాంతాల్లో పిడుగులు అల్లకల్లోలం సృష్టిస్తున్నాయి. ఈదురుగాలులకు పెద్ద.. పెద్ద చెట్లు విరిగి పడుతున్నాయి. వర్షం పడేటప్పుడు చెట్ల కింద ఉండవద్దని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది.
అల్పపీడన ద్రోణి/గాలులు కోత ఇప్పుడు పశ్చిమ విదర్భ నుండి మరాట్వాడా మీదుగా అంతర్గత కర్ణాటక వరకు వ్యాపించి , సగటు సముద్ర మట్టానికి 1 . 5 కి.మీ ఎత్తులో కోనసాగుతున్నది. ఆంధ్రప్రదేశ్, యానంలలో దిగువ ట్రోపో ఆవరణములో ఆగ్నేయ / నైరుతి గాలులు వీస్తున్నాయి. దీంతో పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అకాల వర్షాలకు ఇప్పటికే మామిడి, మొక్కజొన్న, వరి, బొప్పాయి వంటి పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. మరోసారి వర్ష సూచన రావడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
రాబోవు మూడు రోజులకు వాతావరణ సూచనలు :-
——————————————
ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం :–
గురువారం, శుక్రవారం :- తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది.
శనివారం :- తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవంచే అవకాశం ఉంది. బలమైన గాలులు (గంటకు 30 -40 కి మీ వేగం తో)ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశం ఉంది.
దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ :-
గురువారం :-వాతావరణం పొడి గా ఉండే అవకాశం ఉంది.
శుక్రవారం :- తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది .
శనివారం :- తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవంచే అవకాశం ఉంది.
రాయలసీమ :-
గురువారం, శుక్రవారం :- తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది.
శనివారం :- తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవంచే అవకాశం ఉంది. బలమైన గాలులు (గంటకు 30 -40 కి మీ వేగం తో)ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశం ఉంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..