AP Rains: అల్పపీడనంగా ఉపరితల ఆవర్తనం..! ఆ జిల్లాలకు ఆరెంజ్ ఎల్లో అలర్ట్..

మయన్మార్ తీరానికి అనుకుని తూర్పు మధ్య బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. ఉపర్తల ఆవర్తనం ప్రభావంతో ఆ పరిసర ప్రాంతాలపై అల్పపీడనం పడుతుందని వాతావరణ శాఖ ప్రకటించింది. రుతుపవన ద్రోని కూడా కొనసాగుతోంది. వీటి ప్రభావంతో.. ఈనెల 15 వరకు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మోస్తారు వర్షాలు కురుస్తాయని ప్రకటించింది భారత వాతావరణ శాఖ. పూర్తి వెదర్ రిపోర్ట్ తెలుసుకుందాం పదండి..

AP Rains: అల్పపీడనంగా ఉపరితల ఆవర్తనం..! ఆ జిల్లాలకు ఆరెంజ్ ఎల్లో అలర్ట్..
Andhra Weather Report
Follow us

| Edited By: Ram Naramaneni

Updated on: Sep 11, 2023 | 4:39 PM

ఉభయ తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన నిస్తూ భారత వాతావరణ శాఖ తాజా ప్రకటన జారీ చేసింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉంది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడేందుకు అనుకూల అవకాశాలున్నాయి. మరో 72 గంటల్లో వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. మయన్మార్ తీరానికి అనుకుని తూర్పు మధ్య బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. ఉపర్తల ఆవర్తనం ప్రభావంతో ఆ పరిసర ప్రాంతాలపై అల్పపీడనం పడుతుందని వాతావరణ శాఖ ప్రకటించింది. రుతుపవన ద్రోని కూడా కొనసాగుతోంది. వీటి ప్రభావంతో.. ఈనెల 15 వరకు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మోస్తారు వర్షాలు కురుస్తాయని ప్రకటించింది భారత వాతావరణ శాఖ. కోస్తాలో తెలైకపాటి నుంచి మోస్తారు వర్షాలు.. ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తాజా వెదర్ బులిటన్లో ఐఎండి పేర్కొంది.

ఆ జిల్లాలకు ఆరంజ్ అలర్ట్..

– బంగాళాఖాతంలో ఏర్పడిన వాతావరణ పరిస్థితులను బట్టి.. తాజా వెదర్ కండిషన్ను అంచనా వేసింది విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం. ఈరోజు గుంటూరు బాపట్ల కృష్ణాజిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.

ఎల్లో అలెర్ట్స్ జిల్లాలివే..!

– పార్వతీపురం మన్యం, అల్లూరి , ఏలూరు, వెస్ట్ గోదావరి,, కోనసీమ, ఎన్టీఆర్, పల్నాడు, ప్రకాశం జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం.

మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని సూచన…

– బంగాళాఖాతంలో వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో సముద్రం అల్లకల్లోలంగా మారింది. సముద్ర తీరం వెంబడి గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తున్నాయి. సముద్రంలో మత్స్యకారులు ఎవరూ వేటకు వెళ్లొద్దని సూచిస్తుంది భారత వాతావరణ శాఖ. ఈనెల 15 వరకు ఈ సూచనలు పాటించాలని ప్రకటించింది.

తెలంగాణకు కూడా వర్ష సూచన

అటు  తెలంగాణ రాష్ట్రంలో కూడా మరో 2 రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇటు హైదరాబాద్‌లో అయితే ప్రతి రోజూ ఏదో ఒక సమయంలో వర్షం దంచికొడుతూనే ఉంది. ఆదివారం అయితే రికార్డ్ రేంజ్‌లో వర్షపాతం నమోదయ్యింది. లోతట్టు ప్రాంతాలకు వరద నీటిలో మునిగిపోయారు. జీహెచ్‌ఎంసీ అధికారులు వెంటనే రంగంలోకి దిగి.. పరిస్థితులను చక్కదిద్దారు. ముఖ్యంగా వర్షం పడితే ట్రాఫిక్ సమస్య ఏర్పడుతుంది. దీంతో ఆ దిశగా చర్యలు తీసుకోవాలని ప్రయాణీకులు కోరుతున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.