Rain Alert: ఏపీని వీడని వరుణుడు.. ఆ ప్రాంతాల్లో మరో మూడు రోజుల పాటు వానలే వానలు..

|

Mar 22, 2023 | 2:59 PM

ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు అలెర్ట్‌. అల్పపీడన ద్రోణి ప్రభావంతో ఏపీలో మరో మూడు రోజుల పాటు వర్షాలు పడనున్నాయి. దక్షిణ శ్రీలంక నుంచి ఈశాన్య మధ్యప్రదేశ్ వరకు..

Rain Alert: ఏపీని వీడని వరుణుడు.. ఆ ప్రాంతాల్లో మరో మూడు రోజుల పాటు వానలే వానలు..
Rain Alert
Follow us on

ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు అలెర్ట్‌. అల్పపీడన ద్రోణి ప్రభావంతో ఏపీలో మరో మూడు రోజుల పాటు వర్షాలు పడనున్నాయి. దక్షిణ శ్రీలంక నుంచి ఈశాన్య మధ్యప్రదేశ్ వరకు గల ద్రోణి / గాలి కోత ఇప్పుడు అంతర్గత తమిళనాడు నుండి దక్షిణ ఛత్తీస్‌గఢ్ వరకు అంతర్గత కర్ణాటక, తెలంగాణ, విదర్భ మీదుగా సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తులో ఉంది. దీని ప్రభావంతో రాబోవు మూడు రోజుల్లో ఏపీ లోని పలు ప్రాంతాల్లో తేలిక పాటి వర్షాల నుంచి ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. కాబట్టి ఆయా ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం తెలిపింది.

 

రాబోవు మూడు రోజులకు వాతావరణ సూచనలు

ఇవి కూడా చదవండి

ఉత్తర కోస్తా, ఆంధ్రప్రదేశ్, యానాం

ఈరోజు, రేపు, ఎల్లుండి తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది. అలాగే ఉరుముల తో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశంఉంది.

దక్షిణ కోస్తా, ఆంధ్రప్రదేశ్

ఈరోజు, రేపు ,ఎల్లుండి తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది. ఉరుముల తో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశంఉంది.

రాయలసీమ
ఈరోజు, రేపు, ఎల్లుండి తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల చోట్ల కురిసే అవకాశం ఉంది.

మరిన్ని ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి..