Andhra Pradesh: ఈ గుడి నాగుల‌ చ‌వితికి ఫేమ‌స్.. ఇక్కడి పుట్టలో పాలుపోస్తే సంతానం లేని వారికి పిల్లలు క‌లుగుతార‌ట!

| Edited By: Srilakshmi C

Nov 16, 2023 | 7:10 PM

దీపావ‌ళి పండుగ త‌ర్వాత నాలుగురోజుల‌కు వ‌చ్చే నాగుల చ‌వితి పండ‌గ‌ను అత్యంత భ‌క్తి శ్రద్ధల‌తో భ‌క్తులు జ‌రుపుకుంటూ ఉంటారు. ఉద‌యాన్నే నిద్రలేచి త‌ల‌స్నానం చేసి స‌మీపంలో ఉన్న నాగదేవ‌త పుట్టలో పాలుపోసి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజిస్తారు. ఆంధ్రప్రదేశ్‌లో నాగుల చ‌వితి పండ‌గ అత్యంత వైభ‌వంగా జ‌రుగుతుంది. ఈ పండుగ రోజు కృష్ణా జిల్లాలో ఉన్న ఆ ఆల‌యానికి భ‌క్తులు పెద్ద ఎత్తున త‌ర‌లివ‌స్తారు. ఒక్క ఆంధ్రప్రదేశ్ మాత్రమే కాకుండా తెలంగాణ నుంచి కూడా భారీగా భ‌క్తులు ఇక్కడికి వ‌స్తుంటారు. నాగుల‌చ‌వితి రోజు మాత్రమే కాకుండా ఇత‌ర రోజుల్లోనూ..

Andhra Pradesh: ఈ గుడి నాగుల‌ చ‌వితికి ఫేమ‌స్.. ఇక్కడి పుట్టలో పాలుపోస్తే సంతానం లేని వారికి పిల్లలు క‌లుగుతార‌ట!
Subrahmanyeshwar Swamy Temple
Follow us on

మోపిదేవి, నవంబర్‌ 16: దీపావ‌ళి పండుగ త‌ర్వాత నాలుగురోజుల‌కు వ‌చ్చే నాగుల చ‌వితి పండ‌గ‌ను అత్యంత భ‌క్తి శ్రద్ధల‌తో భ‌క్తులు జ‌రుపుకుంటూ ఉంటారు. ఉద‌యాన్నే నిద్రలేచి త‌ల‌స్నానం చేసి స‌మీపంలో ఉన్న నాగదేవ‌త పుట్టలో పాలుపోసి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజిస్తారు. ఆంధ్రప్రదేశ్‌లో నాగుల చ‌వితి పండ‌గ అత్యంత వైభ‌వంగా జ‌రుగుతుంది. ఈ పండుగ రోజు కృష్ణా జిల్లాలో ఉన్న ఆ ఆల‌యానికి భ‌క్తులు పెద్ద ఎత్తున త‌ర‌లివ‌స్తారు. ఒక్క ఆంధ్రప్రదేశ్ మాత్రమే కాకుండా తెలంగాణ నుంచి కూడా భారీగా భ‌క్తులు ఇక్కడికి వ‌స్తుంటారు. నాగుల‌చ‌వితి రోజు మాత్రమే కాకుండా ఇత‌ర రోజుల్లోనూ ఈ ఆల‌యానికి భ‌క్తుల తాకిడి ఎక్కువ‌గా ఉంటుంది. అయితే నాగుల‌చ‌వితికి మాత్రం ఈ ఆల‌యం అత్యంత ప్రసిద్ది.

కృష్ణాజిల్లా మోపిదేవి మండలం మోపిదేవిలోని స్వయంభుగా శివలింగాకృతిలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి భక్తుల కోర్కెలు తీర్చే దేవతామూర్తులుగా భక్తులకు దర్శనమిస్తున్నారు. ముఖ్యంగా సంతానం లేని వారు కోరిన కోరికలు తీర్చే దేవతామూర్తిగా విరాజిల్లుతున్న శ్రీ వల్లీ దేవసేనా సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామిగా మోపిదేవిలో కొలువైఉన్నారు. ఈ ఆలయ ప్రాంగణంలో ఉన్న నాగదేవతా పుట్ట, నాగమల్లి వృక్షం విశిష్ట మహిమ గల వానిగా భక్తులు భావిస్తారు. సంతానం లేని వారు నాగమల్లి వృక్షానికి ముడుపులు కడతారు. నాగదేవత పుట్టలో పాలు పోయడం ఇక్కడ విశిష్టత. పుట్టలో పాలు పోయడం ద్వారా నాగదేవత అనుగ్రహం సిద్ధిస్తుందని భక్తుల ప్రగాఢ నమ్మకం.

అంతే కాదు వివాహం కాని యువతీ యువకులు ఈ ఆలయాన్ని దర్శించి నాగదేవత పుట్టలో పాలు పోసి నాగమల్లి వృక్షానికి ముడుపు కట్టడం వల్ల మరుసటి సంవత్సరమే వారి కోరిక ఫలిస్తుందని ప్రతీక. సంతానం లేని దంపతులు నాగమల్లి వృక్షానికి ఊయల కట్టడం ఇక్కడ విశిష్టమైనదిగా చెబుతారు. శివలింగా కృతిలో స్వామి పడగ నీడన ఉండడంతో ప్రతిరోజు అర్చకులు మహన్యాస పూర్వక రుద్రాభిషేకాలు చేస్తారు. అనంతరం భక్తులకు దర్శనం కల్పిస్తారు.

ఇవి కూడా చదవండి

 

ఇటీవల కాలంలో ఆలయంలో నిత్యకళ్యాణ మహోత్సవాన్ని జరపడం ద్వారా పలువురు దంపతులు పాల్గొంటున్నారు. విశిష్టమైన ఈ ఆలయానికి ఆంధ్రప్రదేశ్ నుంచే కాక ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు తండోపతండాలుగా వచ్చి తమ కోర్కెలు విన్నవించుకుంటారు. కోర్కెలు తీరిన భక్తులు స్వామికి మొక్కుబడులు చెల్లించుకుంటారు. సంతానం లేని దంపతులు నాగదేవతకు ప్రీతిపాత్రమైన ఆవు పాలు సమర్పించడం అనాదిగా వస్తున్న ఆచారం. వాటితోపాటు చలిమిడి, కోడుగుడ్డు, వడపప్పు సైతం నైవేద్యంగా సమర్పిస్తారు. తమకు సంతానం కలగాలని ప్రార్ధించి నాగమల్లి వృక్షానికి ఊయల కడతారు.

అనారోగ్య సమస్యలు చెవిపోటుతో పాటు ఇతర సమస్యలు ఎదురైనప్పుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శించి నాగదేవత పుట్టలో పాలు పోసి స్వామి వారిని దర్శించుకోవడం వలన తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. మరణించిన వ్యక్తుల కుటుంబాలకు చెందిన వారు పెద్దకర్మ జరిపిన రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి సన్నిధిన నిద్ర చేయడం ఒక విశిష్టమైన ఆచారంగా భక్తులు భావిస్తారు. ఆ తదుపరి వారు ఏ ప్రాంతానికైనా వెళ్లవచ్చునని ప్రగాఢ విశ్వాసం.

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.