AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

YSRCP: చంద్రబాబును నమ్మడం అంటే కొండచిలువ నోట్లో తలపెట్టడమే- జగన్

వైసీపీకి ఓటేస్తే పథకాలు కొనసాగుతాయి.. పొరపాటున చంద్రబాబుకు ఓటేస్తే పథకాలకు ముగింపేనన్నారు సీఎం జగన్. చంద్రబాబు పార్టీలతో జతకడితే.. తాను మాత్రం ప్రజలతోనే పొత్తు పెట్టుకున్నానని కామెంట్ చేశారు. చంద్రబాబుకు ఓటేస్తే మళ్లీ మోసపోవడమే అన్నారు జగన్.

YSRCP: చంద్రబాబును నమ్మడం అంటే కొండచిలువ నోట్లో తలపెట్టడమే- జగన్
Jagan Mohan Reddy
Ram Naramaneni
|

Updated on: Apr 29, 2024 | 7:35 PM

Share

సిద్ధం.. మేమంతా సిద్ధం బస్సుయాత్రల తర్వాత మలివిడత ప్రచారం మొదలుపెట్టిన సీఎం జగన్‌.. ఇవాళ మూడు చోట్ల ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ముందుగా అనకాపల్లిజిల్లా చోడవరం నియోజకవర్గంలోని కొత్తూరు జంక్షన్‌ దగ్గర జరిగిన సభలో పాల్గొన్న జగన్‌.. చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. ప్రజలు చంద్రబాబును నమ్మడం అంటే.. కొండచిలువ నోట్లో తలపెట్టడమేనన్నారు. చంద్రబాబును నమ్మితే అంతా గోవిందా..గోవిందా అంటూ జనంలో జోష్‌ పెంచారు సీఎం జగన్‌.

రానున్న ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలు, ఎంపీలను ఎన్నుకునేవి మాత్రమే కాదని, వచ్చే ఐదేళ్ల భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలన్నారు. జగన్‌కు ఓటేస్తే పథకాలన్నీ కొనసాగించేందుకు అవకాశం ఉంటుందని.. అదే పొరపాటున చంద్రబాబుకు ఓటేస్తే మాత్రం పథకాలకు ముగింపేనన్నారు. కోనసీమ జిల్లా అంబాజీపేటలో జరిగిన బహిరంగ సభలో కూటమి కుట్రలపై ధ్వజమెత్తారు సీఎం జగన్‌. జగన్‌ ఒక్కడిని ఓడించడానికి కూటమి పేరుతో చంద్రబాబు మళ్లీ కుట్రలు చేసేందుకు వస్తున్నారని మండిపడ్డారు. ఈ ఎన్నికల్లో హీరో ఎవరో…విలన్‌ ఎవరో గుర్తించి ప్రజలు ఓటు వేయాలని కోరారు జగన్‌.

ఈ ఎన్నికల్లో మరోసారి వైసీపీ ప్రభంజనం తప్పదన్నారు సీఎం జగన్‌. 175 అసెంబ్లీ, 25 ఎంపీ స్థానాలు క్లీన్‌ స్వీప్‌ చేస్తుందని.. ఎక్కడా తగ్గేదేలే అన్నారాయన. గుంటూరు జిల్లా పొన్నూరులో జరిగిన సభలోనూ కూటమిని కౌరవసైన్యంతో పోల్చుతూ ఫైరయ్యారు జగన్‌. రెండు వారాల్లో కురుక్షేత్ర యద్ధం జరగబోతోందన్నారు. 58 నెలలు ఈ బచ్చా చేసిన పనులను 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు ఎందుకు చేయలేదని ప్రశ్నించారు జగన్‌.

కూటమి పేరుతో వస్తున్న చంద్రబాబుది అందరినీ మోసం చేసిన చరిత్ర అన్నారు జగన్‌. చంద్రబాబుకు మద్దతుగా జాతీయపార్టీ, వదినమ్మ, దత్తపుత్రుడు తోడు ఉన్నారన్నారు. కూటమిపై తానూ ఒక్కడినే యుద్ధం చేస్తున్నానని తెలిపారు. మంచి చేసేది ఎవరో..చెడు చేసేదెవరో గుర్తించి ప్రజలు ఓటు వేయాలని కోరారు. మూడు ప్రాంతాల్లోనూ జగన్ ఎన్నికల ప్రచారానికి ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
నాటుకోడి కూర వివాదం.. తండ్రి ప్రాణాలు బలి, కొడుకు కటకటాల పాలు
నాటుకోడి కూర వివాదం.. తండ్రి ప్రాణాలు బలి, కొడుకు కటకటాల పాలు
భారత మామిడి పండ్ల దిగుమతిని నిషేధించిన నేపాల్‌..ఎందుకో తెలిస్తే..
భారత మామిడి పండ్ల దిగుమతిని నిషేధించిన నేపాల్‌..ఎందుకో తెలిస్తే..
నేరేడు పండ్లు తింటే మీ శరీరంలో జరిగేది ఇదే..
నేరేడు పండ్లు తింటే మీ శరీరంలో జరిగేది ఇదే..
ఈ చిన్న ట్రిక్‌తో మీ హోమ్‌ లోన్‌పై రూ.6.85 లక్షల వరకు వడ్డీ ఆదా!
ఈ చిన్న ట్రిక్‌తో మీ హోమ్‌ లోన్‌పై రూ.6.85 లక్షల వరకు వడ్డీ ఆదా!
చుక్క నూనె లేకుండా .. ఏడాది పాటు నిల్వ ఉండే మామిడికాయ పచ్చడి
చుక్క నూనె లేకుండా .. ఏడాది పాటు నిల్వ ఉండే మామిడికాయ పచ్చడి
10 ఏళ్ల కలకు ఆ ఒక్కటే అడ్డు.. మరో చరిత్రకు సిద్ధమైన లేడీ రోహిత్..
10 ఏళ్ల కలకు ఆ ఒక్కటే అడ్డు.. మరో చరిత్రకు సిద్ధమైన లేడీ రోహిత్..
దేశంలోనే నెం.1.. విద్యుత్ వినియోగంలో తెలంగాణ సరికొత్త రికార్డ్..
దేశంలోనే నెం.1.. విద్యుత్ వినియోగంలో తెలంగాణ సరికొత్త రికార్డ్..
స్టవ్ లేకుండా ఎంతో రుచిగా చిటికెలో చేసుకునే పొలం పచ్చడి
స్టవ్ లేకుండా ఎంతో రుచిగా చిటికెలో చేసుకునే పొలం పచ్చడి
ఫిఫాలో ఈ వింత ఆచారాలు తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే..?
ఫిఫాలో ఈ వింత ఆచారాలు తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే..?
ఇంత ఓపిక ఎలా ఉందిరా నాయనా.. ఒకే కుటుంబంలో 200 మంది..
ఇంత ఓపిక ఎలా ఉందిరా నాయనా.. ఒకే కుటుంబంలో 200 మంది..