Watch Video: లారీలో కూర్చుని మంచిగా పత్తాలు ఆడుతున్నారు.. ఇంతలోనే..
ఆరు బయట ముందు కొడుతున్నారా? ఊరు బయట పేకాట ఆడుతున్నారా? అయితే జాగ్రత్త మీ తాట తీయటానికి పోలీసులు సిద్ధంగా ఉన్నారు.. చెట్లు చాటు ఉన్నా, పొదల మధ్య దాగున్న క్షణాల్లో మీ వద్ద వాలిపోతారు. సరికొత్త టెక్నాలజీతో క్షణాల్లో పట్టేస్తున్నారు. పబ్లిక్ ప్లేసులో న్యూసెన్స్ చేస్తే తస్మాత్ జాగ్రత్త, మీ బెండు తీస్తామని హెచ్చరిస్తున్నారు పోలీసులు..

ఆరు బయట ముందు కొడుతున్నారా? ఊరు బయట పేకాట ఆడుతున్నారా? అయితే జాగ్రత్త మీ తాట తీయటానికి పోలీసులు సిద్ధంగా ఉన్నారు.. చెట్లు చాటు ఉన్నా, పొదల మధ్య దాగున్న క్షణాల్లో మీ వద్ద వాలిపోతారు. సరికొత్త టెక్నాలజీతో క్షణాల్లో పట్టేస్తున్నారు. పబ్లిక్ ప్లేసులో న్యూసెన్స్ చేస్తే తస్మాత్ జాగ్రత్త, మీ బెండు తీస్తామని హెచ్చరిస్తున్నారు పోలీసులు. బహిరంగ ప్రదేశాల్లో మద్యపానం, గ్రామ శివారు తోటల్లో పేకాట స్థావరాలు, జనసంచారం లేని చోట గంజాయి సేవించడం వంటి కార్యక్రమాలు సర్వసాధారణంగా మారింది. ఇప్పటివరకు అలాంటి వారిని పట్టుకోవడం కూడా కష్టతరంగా ఉండేది. అలాంటి న్యూసెన్స్ వల్ల పబ్లిక్ కు ఇబ్బందిగా ఉండేది. ఇప్పుడు అలాంటి ఘటనల పై టెక్నాలజీ సహాయంతో ప్రత్యేక దృష్టి సారించారు విజయనగరం పోలీసులు… చుట్టుప్రక్కల ఎవరూ లేరు, ఇక్కడకి ఎవరు రాలేరు, ఇక్కడకి రావడానికి దారి కూడా ఎవరికి తెలియదు అనుకొని అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న వారి పై టెక్నాలజీని వినియోగించి కలుగులో ఎలుకను పట్టుకున్నట్లు పట్టుకుంటున్నారు.
అందులో భాగంగా జిల్లా కేంద్రంలోని హుకుంపేట శివారులో రెండు లారీలు అడ్డు పెట్టుకొని మధ్య లారీలో కూర్చొని పేకాట ఆడుతున్నారు పేకాటరాయుళ్ళు. అయితే నేరాల నిఘాలో భాగంగా సాధారణ పర్యవేక్షణ కోసం డ్రోన్ ను వినియోగించారు పోలీసులు. అలా డ్రోన్ పర్యటిస్తున్న క్రమంలో లారీలో పేకాట ఆడుతున్న పేకాట రాయుళ్లు డ్రోన్ ద్వారా గమనించారు పోలీసులు. వెంటనే కొద్ది నిమిషాల్లోనే పోలీసులు రంగప్రవేశం చేసి పేకాట రాయుళ్లను అదుపులోకి తీసుకున్నారు.
వీడియో చూడండి..
అంతేకాకుండా పట్టణాలతో పాటు గ్రామీణ ప్రాంతాలలో సైతం డ్రోన్ సహాయంతో నిఘా పెంచారు. నిరంతరం డ్రోన్ వినియోగిస్తూ పహరా కాస్తున్నారు. గత రెండు రోజుల క్రితం పూసపాటిరేగ మండలం వెంపడాం శివారులో కోడి పందాలు నిర్వహిస్తున్నారు పందెంరాయుళ్ళు. డ్రోన్ చేసిన సాధారణ నిఘాలో ఒక చోట కోడి పందాలు, మరోచోట పేకాట ఆడుతున్న పేకాట రాయుళ్లు కనిపించారు. అది గమనించిన పోలీసులు వెంటనే దాడులు చేసి నిర్వహకుల్ని అదుపులోకి తీసుకున్నారు.
అలా చాలా చోట్ల నేరాల అదుపునకు డ్రోన్ సత్ఫలితాలను ఇస్తుంది. అయితే నేరాల నివారణకు టెక్నాలజీ ని వినియోగించడం శుభపరిణామం అని అంటున్నారు జిల్లావాసులు. మరింతగా టెక్నాలజీ ఉపయోగించి నేరాలను అదుపు చేయాలని కోరుతున్నారు. అయితే డ్రోన్స్ వినియోగిస్తున్న క్రమంలో పలువురు పోలీసులు దుర్వినియోగం చేసే అవకాశం ఉందని, అలాంటి పరిస్థితులు తలెత్తకుండా గట్టి చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. న్యూసెన్స్ చేస్తూ పబ్లిక్ ను ఇబ్బంది పెట్టే వారికి డ్రోన్ టెక్నాలజీ ఆట కట్టిస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..