Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vizag: కొడుకా యాడున్నావ్.. గంటలు.. రోజులు గడిచిపోతున్నాయ్‌..! మిస్టరీగా మారిన యువకుడి గల్లంతు..

విశాఖపట్నంలో ఓ యువకుడి మృతి మిస్టరీగా మారింది. గాజువాక పెదగంట్యాడ దయాల్‌నగర్‌కు చెందిన సంతోష్‌కుమారికి పదహారేళ్ల కొడుకు కళ్యాణ్‌కుమార్, కూతురు ఉన్నారు. భర్త లేకపోవడంతో కష్టపడి ఇద్దరు పిల్లలను పోషించుకుంటోంది. ఈ క్రమంలో.. వినాయక ఉత్సవాల పేరుతో కొడుకు కళ్యాణ్.. ఐదుగురు స్నేహితులతో కలిసి యారాడ బీచ్‌ వెళ్లారు.

Vizag: కొడుకా యాడున్నావ్.. గంటలు.. రోజులు గడిచిపోతున్నాయ్‌..! మిస్టరీగా మారిన యువకుడి గల్లంతు..
Crime News
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Oct 02, 2023 | 9:01 AM

విశాఖపట్నంలో ఓ యువకుడి మృతి మిస్టరీగా మారింది. గాజువాక పెదగంట్యాడ దయాల్‌నగర్‌కు చెందిన సంతోష్‌కుమారికి పదహారేళ్ల కొడుకు కళ్యాణ్‌కుమార్, కూతురు ఉన్నారు. భర్త లేకపోవడంతో కష్టపడి ఇద్దరు పిల్లలను పోషించుకుంటోంది. ఈ క్రమంలో.. వినాయక ఉత్సవాల పేరుతో కొడుకు కళ్యాణ్.. ఐదుగురు స్నేహితులతో కలిసి యారాడ బీచ్‌ వెళ్లారు. అయితే.. సరదాగా ఎంజాయ్‌ చేసే వేళ శ్రీను, కళ్యాణ్‌కుమార్ అనే యువకులను పెద్ద కెరటం వచ్చి ఇద్దరిని లోపలికి లాక్కెళ్ళింది. అక్కడే ఉన్న గజ ఈతగాళ్ళు శ్రీనును కాపాడగా.. కళ్యాణ్‌లో మాత్రం కొట్టుకుపోవడం కన్నీళ్లను మిగుల్చుతోంది.

కళ్యాణ్‌కుమార్‌ కొట్టుకుపోవడంపై తల్లితోపాటు పోలీసులకు సమాచారం అందించారు మిగతా స్నేహితులు. పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. గంటలు గడిచాయి.. రోజులు గడిచిపోతున్నాయ్‌. కానీ.. కళ్యాణ్ ఆచూకీ మాత్రం లభించలేదు. ఏడ్చి ఏడ్చి.. కొడుకు ఆచూకీ కోసం చూసీ చూసీ ఆ తల్లి కళ్ళల్లో కన్నీరు కూడా ఇంకిపోయింది. ఈ క్రమంలో.. గత నెల 28న యారాడ తీరానికి కుళ్లిన స్థితిలో ఉన్న మృతదేహం కొట్టుకొచ్చింది. సమాచారం అందుకున్న పోలీసులు.. కళ్యాణ్‌కుమార్ తల్లిని పిలిపించి గుర్తుపట్టాలని సూచించడంతో తీరని విషాదంలో ఆమె ఇంకా తల్లడిల్లిపోయింది.

అప్పటికే కొడుకు కోసం ఆతృతగా ఎదురు చూస్తున్న ఆ తల్లి.. గుర్తుపట్టలేనంతగా ఉన్న మృతదేహాన్ని చూసి మరింత ఆవేదనకు గురైంది. తమ కొడుకును గుర్తు పట్టాలంటూ కన్నీరుమున్నీరు విలపిస్తూ పోలీసులే తేల్చాలని కోరింది. అదేసమయంలో.. తన కొడుకు నిజంగా గల్లంతయ్యాడా?.. లేదా అన్నదానిపైనా ఆమె అనుమానాలు వ్యక్తం చేస్తోంది.

10రోజులైనా లభించని ఆచూకీ.. డీఎన్ఏ పరీక్షలకు సిద్ధమైన పోలీసులు

యారాడ బీచ్‌లో గల్లంతయిన కళ్యాణ్ ఆచూకీ.. పది రోజులు గడిచినా లభించకపోవడం.. ఒడ్డుకు కొట్టుకొచ్చిన డెడ్‌బాడీ గుర్తుపట్టలేనంతగా ఉండడంతో డీఎన్ఏ పరీక్షలకు సిద్ధమయ్యారు పోలీసులు. మృతదేహం నమూనాలతోపాటు.. కుటుంబ సభ్యుల శాంపిల్స్ సేకరించి డీఎన్ఏ టెస్టింగ్‌కు పంపి తేలుస్తామంటున్నారు పోలీసులు.

మొత్తంగా.. కొడుకు మృతిపై సందేహాన్ని.. ఆవేదనతో అమాయకంగా చెప్తుండటం అందర్నీ కలచివేస్తోంది. అయితే.. డీఎన్ఏ టెస్టు ఫలితాన్నిస్తే ఓకే.. లేకుంటే మాత్రం ఆ తల్లి కన్నీటి కష్టం మళ్లీ మొదటి వచ్చినట్లే. ఈ నేపథ్యంలో.. కళ్యాణ్‌కుమార్ మృతిపై డీఎన్ఏ టెస్ట్‌తో క్లారిటీ వచ్చేస్తుందా?.. లేక.. మిస్టరీగానే మిగిలిపోతుందా?.. అన్నది చూడాలి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..