క్వారంటైన్‌ నుంచి రెండోసారి పారిపోయిన దంపతులు

కరోనా నేపథ్యంలో క్వారంటైన్‌లో ఉంచిన భార్యభర్తలు రెండోసారి అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటన ఏపీలోని తాడేపల్లిలో జరిగింది.

  • Tv9 Telugu
  • Publish Date - 2:41 pm, Thu, 6 August 20
క్వారంటైన్‌ నుంచి రెండోసారి పారిపోయిన దంపతులు

Couple escaped from quarantine: కరోనా నేపథ్యంలో క్వారంటైన్‌లో ఉంచిన భార్యభర్తలు రెండోసారి అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటన ఏపీలోని తాడేపల్లిలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. పట్టణ పరిధిలోని అంజిరెడ్డి కాలనీలో నివసించే భార్యాభర్తలను రెండు రోజుల క్రితం అధికారులు గుండిమెడ క్వారంటైన్‌లో ఉంచారు. అయితే అక్కడి నుంచి వారు పరారై ఇంటికి వచ్చారు. ఆ విషయం తెలిసిన అధికారులు మళ్లీ వారిని గుంటూరు క్వారంటైన్ సెంటర్‌కి తరలించారు. ఇక అక్కడి నుంచి కూడా పరారైన వారు కాలనీలోకి వచ్చి రోడ్డు మీద తిరుగుతున్నారు. దీన్ని గమనించిన స్థానికులు మున్సిపల్ అధికారులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడకు చేరుకున్న అధికారులు ప్రస్తుతానికి ఆ ఇద్దరిని ఇంట్లోనే ఉంచి, బయటకు రాకుండా బారికేడ్లు ఏర్పాటుచేశారు. ఉన్నతాధికారులతో మాట్లాడి నిర్ణయం తీసుకొని తిరిగి మరలా క్వారంటైన్‌కు తరలిస్తామని మున్సిపల్‌ అధికారులు తెలిపారు.

Read This Story Also: ఆసుపత్రిలో చేరిన మంత్రి బాలినేని