Visakha: విశాఖకు భవిష్యత్తులో మరింత ముప్పు తప్పదా..! సిటీ ఆఫ్ డెస్టినీకి ఎందుకీ దుస్థితి.?

విశాఖ వాసులకు గులాబ్ తుఫాన్ నేర్పిన గుణపాఠం ఏంటి? చెరువులు, కాలువలు, గెడ్డల ఆక్రమణలే విశాఖ నగరవాసులకు శాపమయ్యిందా...?

Visakha: విశాఖకు భవిష్యత్తులో మరింత ముప్పు తప్పదా..! సిటీ ఆఫ్ డెస్టినీకి ఎందుకీ దుస్థితి.?
Visakhapatnam
Venkata Narayana

|

Sep 30, 2021 | 7:02 AM

Visakhapatnam: విశాఖ వాసులకు గులాబ్ తుఫాన్ నేర్పిన గుణపాఠం ఏంటి? చెరువులు, కాలువలు, గెడ్డల ఆక్రమణలే విశాఖ నగరవాసులకు శాపమయ్యిందా…? విశాఖకు భవిష్యత్తులో మరింత ముప్పు తప్పదా..? భారీ వర్షాలకు నగరం ఎంత వరకు సేఫ్. ఇవే ప్రశ్నలు ఇప్పుడు నగరవాసుల్నే కాదు, యావత్ ఏపీ ప్రజల్ని వేధిస్తున్నాయి. విశాఖ నగరం మునుపెన్నడూ చూడని విపత్తులను కొన్నిరోజులుగా చవిచూస్తోంది. హుదూద్ తుపాను సమయంలో భీకర గాలులు విధ్వంసం సృష్టించగా.. గులాబ్ తుపాను కుండపోత వర్షాలతో విశాఖ నగరాన్ని ముంచెత్తింది. అయితే, నగరవాసుల అభిప్రాయం మాత్రం ఇదంతా కేవలం అధికారుల నిర్వాకమేనని ఆరోపిస్తున్నారు. లంచాలకు కక్కుర్తి పడ్డం వల్లే ప్రజలకు ఈ కష్టాలు అని వాపోతున్నారు.

ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం వరకు 10 సెంటీమీటర్లకు పైగా కురిసిన భారీ వర్షానికి నగరంలో దాదాపు అన్ని ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. ఎక్కడికక్కడ ఇళ్లల్లోకి వర్షపునీరు చేరి ప్రజలు రాత్రంతా జాగారం చేశారు. ప్రధాన రహదారుల్లో నాలుగు అడుగుల మేర వరదనీరు నిలిచిపోయింది. వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. ఎప్పుడూ లేనిదీ నగరానికి ఇప్పుడు ఎందుకు ఈ దుస్థితి ఎదురైందనే ప్రశ్న తలెత్తుతోంది. GVMC ఓ వైపు ఈ పరిస్థితికి కారణమని నిపుణులు, విపక్షాల నేతలు అభిప్రాయ పడుతున్నారు. స్మార్ట్ సిటీ, మెట్రో పాలిటిన్ సిటీ, రాష్ట్ర ప్రభత్వ ప్రతిపాదిత పరిపాలన రాజధాని అని గొప్పలు చెప్పుకోవడం మినహా నగరంలో జరిగిన అభివృద్ధి ఎక్కడా కనిపించలేదనీ విపక్ష నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

గులాబ్ తుపాను ధాటికి విశాఖ నగరంలోని 88 లోతట్టు ప్రాంతాల్లోని వేల ఇళ్లలోకి వర్షపు నీరు చేరింది. వందలాది వాహనాలు నీట మునిగిపోయాయి. పెద్ద సంఖ్యలో ద్విచక్రవాహనాలు దెబ్బతిన్నాయి. ఎయిర్ పోర్టు, రైల్వే స్టేషన్, రైల్వే యార్డ్, హిందుస్థాన్ షిప్ యార్డ్ లలోకి వర్షపు నీరు భారీగా వర్షాల తీవ్రత తగ్గడం, మంగళవారం నాటికి నీరంతా సమీప గెడ్డల్లోకి చేరడంతో ప్రజలు కొంత తేరుకున్నారు. భారీ వర్షాలు కురిసిన ప్రతిసారి నగరంలోని చాలా ప్రాంతాలు నీట మునుగుతున్నాయి. ఏళ్ల తరబడి ఇదే సమస్య ఉన్నా పూర్తిస్థాయిలో పరిష్కారానికి నోచడం లేదు విశాఖ విమానాశ్రయానికి కూతవేటు దూరంలోని హరిజన జగ్గయ్యపాలెం పరిసర కాలనీల ప్రజలు వర్షాకాలం వచ్చిందంటే ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని బతకాల్సిందే.

భారీ వర్షాల సమయంలో పరిసర ప్రాంతాల్లో నీరంతా ఇక్కడికే చేరి మూడు, నాలుగడుగుల ఎత్తున నిలిచిపోతోంది.చిన్న వర్షం పడిన నగరంలోని కాన్వెంట్ జంక్షన్ వద్ద ఉన్న రైల్వే అండర్ బ్రిడ్జి మార్గంలో ప్రయాణం బంద్ చేయాల్సిందే. మేఘాద్రి గడ్డ కాస్త పొంగితే చాలు విశాఖ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి వరద నీరు పోటెత్తుతుంది. నగరంలో కురిసిన భారీ వర్షంకి తోడు మేఘద్రి గెడ్డ పోతెత్తటంతో సోమవారం ఎయిర్ పోర్ట్ లోకి వరద నీరు భారీగా చేరుకోనీ విమానయాన సర్వీసులకు అంతరాయం ఏర్పడిందoటీనే పరిస్తితి అర్ధం చేసుకోవచ్చు. ఇప్పటికీ వర్షం వస్తే చాలు మోఘద్రి గెడ్డ గండంపై ఎయిర్ పోర్ట్ అధికారుల ఆందోళన చెందుతూ ఉంటారు.

గులాబ్ తుఫాన్ కి గెడ్డలే విశాఖ నగరాన్ని ముంచెత్తాయి. నగరంలోని ప్రతి ప్రతి గెడ్డ ఆక్రమణకు గురయ్యాయి. మారెకవలస నుంచి గాజువాక వరకు జాతీయ రహదారి దాటుతున్న ప్రతి గెడ్డపై అక్రమ నిర్మాణాలు దర్శనమిస్తుంటాయి. మారకవలస ప్రాంతంలో కొండలపై నుంచి వచ్చే వర్షపునీరు సముద్రంలోకి చేరడానికి పెద్ద గెడ్డ ఉంది. ప్రారంభంలో 10 అడుగుల మేర ఉండే ఆ గెడ్డ జాతీయ రహదారి దాటగానే మొదట 6అడుగులు , తరువాత మూడు అడుగులకు కుచించుకు పోయింది.ప్రస్తుతం గడ్డ చుట్టుపక్కల ప్రాంతాలలో పెద్ద భవనాలు వెలిశాయి.హనుమంతు వాక వద్ద ప్రారంభమయ్యే ప్రధాన గెడ్డ వెంకోజిపాలెం, ఎంవీపీ కాలనీ అప్పుఘర్ మీదుగా సముద్రంలోకి చేరుతుంది. ప్రారంభంలో ఏడు అడుగులు ఉండే ఈ గడ్డ ఒక్కో ప్రాంతంలో నాలుగు నుంచి మూడు అడుగుల వరకు తగ్గిపోయింది.

నగరంలో 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైతే గెడ్డల్లో నీరు రహదారులపైకి, ఇళ్లలోకి చేరుతుందని గతంలో పలుమార్లు రుజువైంది. అయినా జీవీఎంసీ అధికారుల్లో చలనం రాకపోవడంతో నగర ప్రజలు విపత్తును చూడాల్సి వచ్చింది. గెడ్డలు, కాలువలు ఆక్రమణలకు గురవుతున్నాయని, వాటిని తొలగించకపోతే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవని నిపుణులు హెచ్చరించినా స్పందన కరవైంది. భవిష్యత్తులో 30 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదైతే పరిస్థితిని ఊహించలేమని, ఇప్పటికైనా గెడ్డల ఆక్రమణలపై జీవీఎంసీ కఠినంగా వ్యవహరించాలని నిపుణులు సూచిస్తున్నారు.

Read also: India Border Tension: ఉగ్రవాదం, చైనా సైన్యం భారత్‌ను చుట్టుముడుతోందా ? ఎందుకు అమెరికా రీసెర్చ్‌ సంస్థ హెచ్చరికలు?

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu