AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vizag Steel Plant Employee Srinivasa Rao : విశాఖ స్టీల్‌ ప్లాంట్ ఉద్యోగి సూసైడ్ నోట్‌, మిస్సింగ్ వెనుక షాకింగ్‌ సంగతులు

Visakhapatnam ACP press meet live on Vizag Steel Plant Employee Suicide Note : విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగి శ్రీనివాసరావు సూసైడ్ నోట్ రాసి కనిపించకుండా..

Vizag Steel Plant Employee Srinivasa Rao : విశాఖ స్టీల్‌ ప్లాంట్ ఉద్యోగి సూసైడ్ నోట్‌, మిస్సింగ్ వెనుక షాకింగ్‌ సంగతులు
Vizag Steel Employee Sriniv
Venkata Narayana
|

Updated on: Mar 20, 2021 | 9:16 PM

Share

Visakhapatnam ACP press meet live on Vizag Steel Plant Employee Suicide Note : విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగి శ్రీనివాసరావు సూసైడ్ నోట్ రాసి కనిపించకుండా పోవడం రాష్ట్ర వ్యాప్తంగా కలకలంరేపుతోంది. తాను శనివారం సాయంత్రం 5.49 నిమిషాలకు అగ్నికి ఆహుతి కావాలని నిర్ణయించుకున్నానని ఆయన సదరు సూసైడ్‌ లేఖలో పేర్కొన్నారు. అందరం కలిసికట్టుగా ఉంటేనే ఉద్యమంలో విజయం సాధిస్తామన్నారు. ఈ పోరాటం ప్రాణత్యాగం తన నుండి మొదలు కావాలి అంటూ శ్రీనివాసరావు పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలో శ్రీనివాసరావు కోసం పోలీసులు, విశాఖ స్టీల్ ప్లాంట్‌ కార్మికులు తీవ్రంగా గాలిస్తున్నారు. కట్‌ చేస్తే, ఈ విషయమై శనివారం రాత్రి సౌత్ జోన్ ఏసీపీ పెంటారావ్ మీడియా ముందుకొచ్చారు. మైండ బ్లాంక్ అయ్యే విషయాలు బయటపెట్టారు. ఇంతకీ.. ప్రెస్‌ మీట్ లో ఏసీపీ ఏమంన్నారంటే..

“స్టీల్ ప్లాంట్ లో ఫోర్ మెన్ గా పనిచేస్తోన్న కే శ్రీనివాస్ అనే వ్యక్తి అదృశ్యామయ్యారని వాళ్ళ అబ్బాయ్ ఫిర్యాదు చేశారు. లాగ్ బుక్ లో ఆయన ఆత్మహత్య చేసుకుంటున్నట్టు రాసి అదృశ్యమవ్వడంతో మిస్సింగ్ కేసు పెట్టాం. ఆయన కాల్ డీటెయిల్స్ తీస్తే నలుగురితో చాలా సేపు మాట్లాడినట్టు గుర్తించాం. కాల్ డేటా లో ఉన్న పిలకా అప్పుల రెడ్డి, అడపా హరీష్ లను విచారించాం. వారికి స్టీల్ ప్లాంట్ లో ఉద్యోగాలు ఇప్పిస్తామని 50 లక్షలు తీసుకున్నట్టు విచారణలో తేలింది. వీటికి సంబంధించి ఆర్ఎన్ఐఎల్ కి డబ్బు కట్టినట్టు ఫేక్ డీడీ లు చూపించారు. శ్రీనివాస్ ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నట్టు గుర్తించాం. ఉద్యోగాలు ఇస్తామని చెప్పి డబ్బులు తీసుకుంటున్నట్టు ఇప్పుడిప్పుడే ఫిర్యాదులు వస్తున్నాయి. ఇంకా శ్రీనివాస్ ఆచూకీ తెలియలేదు. స్టీల్ ప్లాంట్ నుంచి బయటకు వచ్చినట్టు సీసీ ఫోటేజ్ ఉంది. విచారణ జరుగుతోంది, పూర్తి వివరాలు తెలియచేస్తాం.” అని ఏసీపీ సంచలన విషయాలు బయటపెట్టారు.

Read also : Errabelli Dayakar rao : యాదాద్రి లక్ష్మీనరసింహుని చెందిన ఎర్రబెల్లి దయాకర్ రావు.. కేసీఆర్‌ పాలనపై కీలక వ్యాఖ్యలు