రవి ప్రకాష్ మరో చేతివాటం.. సంజీవని ఆసుపత్రిలో నిధుల దుర్వినియోగం
కృష్ణా జిల్లా కూచిపూడిలో నిర్మించిన సిలికానాంధ్ర సంజీవని ఆసుపత్రిలో రూ. 50కోట్ల నిధుల దుర్వినియోగం జరిగినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. సామాజిక సేవ పేరుతో దాతల నుంచి విరాళాలు సేకరించడం.. వాటిని దుర్వినియోగం చేయడంలో టీవీ9 బహిష్కృత సీఈవో రవి ప్రకాష్‌ది అందవేసిన చేయి అంటున్నారు. సిలికానాంధ్ర ఆసుపత్రికి రవి ప్రకాష్ పేరు ఎందుకు పెట్టారని ప్రశ్నిస్తున్నారు. కూచిపూడికి ఉన్న అంతర్జాతీయ పేరు వాడుకొని స్థానికంగా అగ్రహారం పెద్దన్న సైతం బురిడీ కొట్టించి రవి ప్రకాష్ కోట్ల రూపాయలు […]

కృష్ణా జిల్లా కూచిపూడిలో నిర్మించిన సిలికానాంధ్ర సంజీవని ఆసుపత్రిలో రూ. 50కోట్ల నిధుల దుర్వినియోగం జరిగినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. సామాజిక సేవ పేరుతో దాతల నుంచి విరాళాలు సేకరించడం.. వాటిని దుర్వినియోగం చేయడంలో టీవీ9 బహిష్కృత సీఈవో రవి ప్రకాష్‌ది అందవేసిన చేయి అంటున్నారు. సిలికానాంధ్ర ఆసుపత్రికి రవి ప్రకాష్ పేరు ఎందుకు పెట్టారని ప్రశ్నిస్తున్నారు.
కూచిపూడికి ఉన్న అంతర్జాతీయ పేరు వాడుకొని స్థానికంగా అగ్రహారం పెద్దన్న సైతం బురిడీ కొట్టించి రవి ప్రకాష్ కోట్ల రూపాయలు వెనకేసుకున్నారని స్థానికులు చెబుతున్నారు. ఎన్ఆర్ఐ నుంచి భారీగా విరాళాలు వసూలు చేసి దాదాపు రూ.50కోట్ల రూపాయలకు పైగానే వసూలు చేసినట్లు ఆరోపిస్తున్నారు. రూపాయి కూడా ఆసుపత్రికి ఇవ్వకుండా నాలుగు కోట్ల రూపాయలు ఇచ్చినట్లు తన పేరు మీద ఆసుపత్రి నిర్మాణం చేయించడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ప్రజల నిధులతో నిర్మితమైన ఆసుపత్రిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. దీనిపై ఉన్నత స్థాయి విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు.