నవరాత్రి బ్రహ్మోత్సవాలపై పునరాలోచనలో టీటీడీ.. రేపు తుది నిర్ణయం

తిరుమల పుణ్యక్షేత్రంలో ఈ నెల 16 నుంచి మొదలు కాబోతున్న నవరాత్రి బ్రహ్మోత్సవాలపై టీటీడీ పునరాలోచనలో పడింది.

నవరాత్రి బ్రహ్మోత్సవాలపై పునరాలోచనలో టీటీడీ.. రేపు తుది నిర్ణయం
Follow us

| Edited By:

Updated on: Oct 11, 2020 | 12:32 PM

Tirumala Navaratri Brahmostavalu: తిరుమల పుణ్యక్షేత్రంలో ఈ నెల 16 నుంచి మొదలు కాబోతున్న నవరాత్రి బ్రహ్మోత్సవాలపై టీటీడీ పునరాలోచనలో పడింది. బ్రహ్మోత్సవాల్లో భాగంగా మాడవీధుల్లో వాహనసేవలు నిర్వహించాలని ఇటీవల టీటీడీ నిర్ణయించింది. అయితే కరోనా ప్రభావంతో అధికారులు పునరాలోచనలో పడ్డారు. బ్రహ్మోత్సవాల నిర్వహణపై అధికారులతో నూతన ఈవో జవహార్ రెడ్డి చర్చించారు. వార్షిక బ్రహ్మోత్సవాల తరహాలోనే ఏకాంతంగా నిర్వహించేందుకే అధికారుల మొగ్గు చూపారు. అయితే భక్తులు లేకుండా మాడవీధుల్లో నిర్వహించవచ్చు అంటూ మరో ప్రతిపాదన జవహర్ రెడ్డి ముందుకు వచ్చింది. ఈ క్రమంలో మాడవీధుల్లో భౌతిక దూరం, గ్యాలరీల్లో సరిపడే భక్తుల సంఖ్య, భక్తుల రాకపోకలు వంటి విషయాలపై ఉన్నతాధికారులతో ఈవో ఆరా తీశారు. ఇక బ్రహ్మోత్సవాల నిర్వహణపై సోమవారం టీటీడీ తుది నిర్ణయం తీసుకోనుంది.

Read More:

ఏపీకి భారీ వర్ష సూచన.. వాతావరణ శాఖ హెచ్చరిక

‘లవ్‌ స్టోరీ’ రీషూట్‌.. డేట్లు ఇచ్చేసిన సాయి పల్లవి