ఏపీకి భారీ వర్ష సూచన.. వాతావరణ శాఖ హెచ్చరిక

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండం కొనసాగుతోంది. 24 గంటల్లో ఇది తీవ్ర వాయుగుండంగా బలపడనుంది.

  • Manju Sandulo
  • Publish Date - 12:09 pm, Sun, 11 October 20

Andhra Pradesh Rains: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండం కొనసాగుతోంది. 24 గంటల్లో ఇది తీవ్ర వాయుగుండంగా బలపడనుంది. ఈ క్రమంలో పశ్చిమ వాయువ్యం దిశగా పయనించి సోమవారం రాత్రి నర్సాపురం-విశాఖపట్నం మధ్య తీరం దాటే అవకాశం ఉంది. దీని ప్రభావంతో ఆదివారం కోస్తాంధ్ర, రాయలసీమలో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురవనున్నాయి. మిగిలినచోట్ల మోస్తారు నుంచి తేలిక వర్షాలు పడే అవకాశం ఉంది.

అలాగే సోమవారం కోస్తాంధ్రలో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు, మిగిలినచోట్ల  మోస్తారు నుంచి తేలిక వర్షాలు పడే అవకాశం ఉంది. ఇక మంగళవారం ఉత్తరాంధ్రలో అక్కడక్కడ భారీ నుంచి తీవ్ర భారీవర్షాలు, కోస్తాంధ్రలో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు, మిగిలినచోట్ల మోస్తారు నుంచి తేలిక వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం తీరం వెంబడి గంటకు 55-75 కి.మీ వేగంతో గాలులు వీస్తున్నాయని, సముద్రం అలజడిగా ఉంటుందని, మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. దీనిపై మాట్లాడిన విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్ కె.కన్నబాబు.. ఎప్పటికప్పుడు వాయుగుండం స్థితిని పర్యవేక్షిస్తూ జిల్లా యంత్రంగాలను అప్రమత్తం చేస్తున్నట్లు తెలిపారు. తీరప్రాంత ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండి, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు.

Read More:

‘లవ్‌ స్టోరీ’ రీషూట్‌.. డేట్లు ఇచ్చేసిన సాయి పల్లవి

‘కేజీఎఫ్‌ 2’కు కొత్త రిలీజ్ డేట్‌..!