AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Today Gold Silver Rate Live: పసిడి ప్రియులకు పండగే..! మరింత తగ్గిన ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే..

భారతదేశంలో ఈరోజు 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు రూ1,49,170లకు పడిపోయింది. అదే 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు రూ.1,36,740లకు చేరింది. వెండి ధర గ్రాముకు రూ. 264.90లు ఉండగా, భారత మార్కెట్‌లో కిలో వెండి ధర రూ. 2,64,900ల వద్ద కొనసాగుతోంది. దేశంలోని ఢిల్లీ, ముంభై, హైదరాబాద్‌ వంటి ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.

Today Gold Silver Rate Live: పసిడి ప్రియులకు పండగే..! మరింత తగ్గిన ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే..
Gold Price Today Image Credit source: tv9 malayalam
Jyothi Gadda
|

Updated on: May 06, 2026 | 7:16 AM

Share

గత కొద్ది రోజులుగా రూ.1.5 లక్షల గరిష్ట స్థాయిల వద్ద ఊగిసలాడిన 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర, నేడు (మే 6, 2026) మరింత దిగివచ్చి కొనుగోలుదారులకు ఊరటనిస్తోంది. భారతదేశంలో ఈరోజు 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు రూ1,49,170లకు పడిపోయింది. అదే 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు రూ.1,36,740లకు చేరింది. వెండి ధర గ్రాముకు రూ. 264.90లు ఉండగా, భారత మార్కెట్‌లో కిలో వెండి ధర రూ. 2,64,900ల వద్ద కొనసాగుతోంది. దేశంలోని ఢిల్లీ, ముంభై, హైదరాబాద్‌ వంటి ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.

హైదరాబాద్‌లో బంగారం 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,49,170, 22 క్యారెట్ల గోల్డ్ 10గ్రాముల ధర రూ.1,36,740 ఉంది. వెండి కిలో ధర రూ.2,64,900 ఉంది.

విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.1,49,170, 22 క్యారెట్ల గోల్డ్ 10గ్రాముల ధర రూ.1,36,740 ఉంది. వెండి కిలో ధర రూ.2,64,900 ఉంది.

ఇవి కూడా చదవండి

ఢిల్లీలో 24 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాముల ధర రూ.1,49,220, 22 క్యారెట్ల ధర రూ.1,36,890 గా ఉంది. వెండి కిలో ధర రూ.2,54,900 ఉంది.

ముంబైలో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,49,170, 22 క్యారెట్ల గోల్డ్ 10గ్రాముల ధర రూ.1,36,740 ఉంది. వెండి కిలో ధర రూ.2,54,900 లుగా ఉంది.

చెన్నైలో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,50,760, 22 క్యారెట్ల ధర రూ.1,38,190 ఉంది. వెండి కిలో ధర రూ.2,64,900 లుగా ఉంది.

బెంగళూరులో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,49,170, 22 క్యారెట్ల గోల్డ్ 10గ్రాముల ధర రూ.1,36,740 ఉంది. వెండి కిలో ధర రూ.2,54,900 లుగా ఉంది.

ధరలు తగ్గడానికి ప్రధాన కారణాలు:

భౌగోళిక రాజకీయ పరిస్థితులు: అంతర్జాతీయంగా ఉద్రిక్తతలు కొంత సడలడం వల్ల ఇన్వెస్టర్లు సురక్షిత పెట్టుబడిగా భావించే బంగారం నుండి నిధులను మళ్లించి ఇతర ఆస్తులపై ఆసక్తి చూపుతున్నారు.

డాలర్ ఇండెక్స్ & వడ్డీ రేట్లు: అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లపై తీసుకునే నిర్ణయాలు, డాలర్ విలువ పెరగడం వంటి అంశాలు పసిడి ధరపై ఒత్తిడి పెంచుతున్నాయి.

ప్రాఫిట్ బుకింగ్: బంగారం ధరలు గరిష్ట స్థాయిలకు చేరుకోవడంతో, చాలా మంది ఇన్వెస్టర్లు లాభాలను స్వీకరించడానికి (Profit Booking) అమ్మకాలకు మొగ్గు చూపడం వల్ల ధరల్లో తగ్గుదల కనిపిస్తోంది.

కొనుగోలుదారులకు సూచన: పెళ్లిళ్ల సీజన్ సమీపిస్తున్న తరుణంలో ఈ ధరల తగ్గుదల సామాన్యులకు మంచి అవకాశంగా కనిపిస్తోంది. అయితే, అంతర్జాతీయ మార్కెట్ హెచ్చుతగ్గుల వల్ల ధరలు ఎప్పుడైనా మారవచ్చు. కాబట్టి, కొనుగోలు చేసే ముందు ఒకసారి స్థానిక జ్యువెలరీ షాపుల్లో మేకింగ్ ఛార్జీలు, జీఎస్టీ (GST)తో కలిపి తుది ధరను సరిచూసుకోవడం ఉత్తమం. ఏది ఏమైనప్పటికీ బంగారం ధరలు ఇప్పుడు రూ.1.5 లక్షల లోపుకు రావడం దీర్ఘకాలిక పెట్టుబడిదారులకు కూడా సానుకూల అంశమే అంటున్నారు మార్కెట్ విశ్లేషకులు.

కాగా.. బంగారం, వెండి ధరలు అన్ని నగరాల్లో ఒకే విధంగా ఉండవు. స్థానిక డిమాండ్, సరఫరా, అలాగే రాష్ట్ర పన్నులు, తదితర అంశాల ప్రకారం ఎప్పటికప్పుడు మారుతుంటాయి.. అందుకే అన్ని ప్రధాన నగరాల్లో కూడా ధరల్లో వ్యత్యాసాలు ఉంటాయి. ఒకవేళ మీకు బంగారం, వెండి ధరల లేటెస్ట్ అప్‌డేట్ గురించి తెలుసుకోవాలంటే ఈ మొబైల్ నెంబర్‌కు 8955664433కు మిస్డ్ కాల్ ఇవ్వవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
అభిషేక్‎ను వెనక్కి నెట్టి ఆరెంజ్ క్యాప్ కొట్టేసిన కేఎల్ రాహుల్
అభిషేక్‎ను వెనక్కి నెట్టి ఆరెంజ్ క్యాప్ కొట్టేసిన కేఎల్ రాహుల్
ఛీ కొట్టిన వాళ్లే హారతి పట్టి మరీ టీమిండియాలోకి రమ్మంటున్నారుగా..
ఛీ కొట్టిన వాళ్లే హారతి పట్టి మరీ టీమిండియాలోకి రమ్మంటున్నారుగా..
పసిడి ప్రియులకు పండగే..! మరింత తగ్గిన ధరలు.. హైదరాబాద్‌లో తులం
పసిడి ప్రియులకు పండగే..! మరింత తగ్గిన ధరలు.. హైదరాబాద్‌లో తులం
సప్త సాగరాలు దొటొచ్చి తమిళ రాజకీయాను షేక్ చేసిన ఒకే ఒక్కడు
సప్త సాగరాలు దొటొచ్చి తమిళ రాజకీయాను షేక్ చేసిన ఒకే ఒక్కడు
పీఎం కిసాన్ లబ్దిదారులకు కేంద్రం బిగ్ అప్డేట్.. ఈ పని చేస్తేనే..
పీఎం కిసాన్ లబ్దిదారులకు కేంద్రం బిగ్ అప్డేట్.. ఈ పని చేస్తేనే..
ట్రెండింగ్ లో త్రిష పేరు.. ఇప్పుడు పూజా హెగ్డే
ట్రెండింగ్ లో త్రిష పేరు.. ఇప్పుడు పూజా హెగ్డే
2040లో లవ్, బ్రేకప్స్ ఇలా ఉంటాయా? OTTలోకి వచ్చేసిన కొత్త సినిమా
2040లో లవ్, బ్రేకప్స్ ఇలా ఉంటాయా? OTTలోకి వచ్చేసిన కొత్త సినిమా
బుధవారం ఇలా చేస్తే శుభం.. విజయం మీది! కానీ అప్పు మాత్రం వద్దు..
బుధవారం ఇలా చేస్తే శుభం.. విజయం మీది! కానీ అప్పు మాత్రం వద్దు..
నయా లుక్‌తో మైండ్ బ్లాక్ చేస్తున్న వెండితెర చందమామ
నయా లుక్‌తో మైండ్ బ్లాక్ చేస్తున్న వెండితెర చందమామ
కాకరకాయ ఇష్టపడని వారు కూడా లొట్టలేస్తూ తినే రెసిపీ
కాకరకాయ ఇష్టపడని వారు కూడా లొట్టలేస్తూ తినే రెసిపీ