దరఖాస్తుదారుడు భారత పౌరుడై అయి ఉండాలి. ఒక చిన్న భాగస్వామ్య సంస్థను స్వంతగా కలిగి ఉండాలి లేదా సంస్థను నిర్వహిస్తూ ఉండాలి.
అర్హత ప్రమాణాలు
దరఖాస్తుదారుడికి కనీసం 18 సంవత్సరాల వయస్సు ఉండాలి. వయోపరిమితి 65 సంవత్సరాల కంటే తక్కువగా ఉండాలి.
వయోపరిమితి
ప్రాధాన్యత గల వ్యాపార రంగాలలో వర్తకం, తయారీ, సేవలు ఉన్నాయి. ఇక రుణాలను వ్యవసాయేతర సంబంధిత వ్యాపార కార్యకలాపాల కోసం మాత్రమే ఉపయోగించాలి.
వ్యవసాయేతర సంబంధిత వ్యాపారం
PMMY పథకం కింద అనుమతించబడిన గరిష్ట రుణ మొత్తం రూ. 10 లక్షలు కాబట్టి. మీ అవసరం తప్పనిసరిగా రూ. 10 లక్షల కంటే తక్కువ ఉండాలి.
రుణ మొత్తం
MSMEలు, స్టార్టప్‌లు, చిన్న వ్యాపారాల విస్తరణను ప్రోత్సహించేందుకు ఈ పథకాన్ని తీసుకొచ్చారు. అత్యధిక రుణ మొత్తం రూ. 10 లక్షలు. ఇది ఒక చిన్న యూనిట్ అవసరాలను తీర్చడానికి సరిపోతుంది
రుణం ప్రయోజనాలు
బ్యాంకులు, ఎన్‌బిఎఫ్‌సిలు, మైక్రోఫైనాన్స్ సంస్థల వంటి రుణ సంస్థలకు ఇచ్చిన సూచనల ప్రకారం, రుణ పంపిణీ సరళంగా, అవాంతరాలు లేకుండా ఉండాలి. చాలా చిన్న యూనిట్లలో బ్యాంకును సంతృప్తి పరచడానికి అవసరమైన పత్రాలు ఉండవు.
సులభమైన లోన్ ప్రాసెస్
కంపెనీలో ఉపయోగించే పనిముట్లు, యంత్రాల కొనుగోలుకు డబ్బును వినియోగించుకోవచ్చు. బ్రాండ్ ప్రచారం లేదా సంస్థ ప్రాంతీయ అభివృద్ధి వంటి కార్యకలాపాల కోసం కూడా రుణాన్ని ఉపయోగించుకోవచ్చు.
నిధులను ఇలా..
ఓటరు గుర్తింపు కార్డు, ఆధార్ కార్డు, పాస్‌పోర్ట్, పాస్‌పోర్ట్ సైజు ఫోటోలు రెండు కాపీలు అందించాలి.
అవసరమైన పత్రాలు
ఓటరు గుర్తింపు కార్డు, ఆధార్ కార్డు, పాస్‌పోర్ట్, పాస్‌పోర్ట్ సైజు ఫోటోలు రెండు కాపీలు అందించాలి.