AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఒక్క ఓటుతో మంత్రి ఓటమి.. సప్త సాగరాలు దాటొచ్చి తమిళ రాజకీయాలను షేక్ చేసిన ఒకే ఒక్కడు

ఒక్క ఓటు ఒక దేశం స్వరూపాన్నే మార్చేస్తుంది. ఆ ఓటు వేసేందుకు కొందరు దేశ విదేశాల నుంచి వస్తుంటారు. తాజాగా జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అదే సీన్ మరోసారి రిపీట్ అయింది. ఓ వ్యక్తి వేసిన ఒకే ఒక్క ఓటు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఎందకంటే ఆ వ్యక్తి వేసిన ఒక్క ఓటు తేడాతో తన అభిమాన పార్టీ అభ్యర్థి విజయం సాధించింది. ఇదంతా ఒకెత్తైతే ఆ ఓటు వేయడం కోసం ఒక వ్యక్తి ఏకంగా ఒమన్ నుండి 3000 వేల కీలో మీటర్లు ప్రయాణించి రావడం మరొకెత్తుగా నిలుస్తోంది.

ఒక్క ఓటుతో మంత్రి ఓటమి.. సప్త సాగరాలు దాటొచ్చి తమిళ రాజకీయాలను షేక్ చేసిన ఒకే ఒక్కడు
Tamil Nadu Election Results 2026
Anand T
| Edited By: |

Updated on: May 06, 2026 | 9:55 AM

Share

దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన తమిళనాడు ఎన్నికల ఫలితాల్లో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. తమిళనాడులోని శివగంగ జిల్లా తిరుప్పత్తూరు నియోజకవర్గ ఫలితం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇక్కడ టీవీకే పార్టీ నుంచి పోటీ చేసిన అభ్యర్థి శ్రీనివాస సేతుపతి, డీఎంకే సీనియర్ నేత, మంత్రి కేఆర్ పెరియకరుప్పన్‌పై కేవలం ఒక్క ఓటు తేడాతో విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో సేతుపతికి 83,375 ఓట్లు రాగా, డీఎంకే అభ్యర్థి కేవలం 1 ఓట్లు స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యారు.

అయితే ఈ ఫలితం వెలువడిన వెంటనే, ఒమన్‌లోని మస్కట్‌లో పనిచేస్తున్న మణికందన్ శివానందం అనే వ్యక్తి సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశాడు. ఆ పోస్ట్ క్షణాల్లో వైరల్‌గా మారింది. ఇంతకూ ఆ పోస్ట్‌ ఏముందంటే.. తన అభిమాన హీరో పార్టీ అభ్యర్థిని గెలిపించేందుకు తాను సుమారు 3,000 కిలోమీటర్ల ప్రయాణం చేసి ఓమన్ నుంచి వచ్చి ఓటు వేసి నట్టు తెలిపాడు.

మణికందన్ తన పోస్ట్‌లో ఇలా పేర్కొన్నారు.. తిరుప్పత్తూరు నియోజకవర్గంలో TVK కేవలం ఒక్క ఓటుతో గెలిచింది. నా అభిమాన నాయకుడు దళపతి విజయ్ పార్టీకి ఓటు వేయడం కోసం నేను మస్కట్ నుండి 3,000 కిలోమీటర్లు ప్రయాణించి రావడం నాకు చాలా గర్వంగా ఉందని రాసుకొచ్చాడు. సోషల్‌ మీడియాలో ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు అతనిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
నన్ను అమ్మేసి.. బుడ్డోడిని ఎన్ని కోట్లైనా ఖర్చు చేసి కొనేస్తాడంటా
నన్ను అమ్మేసి.. బుడ్డోడిని ఎన్ని కోట్లైనా ఖర్చు చేసి కొనేస్తాడంటా
'నా కాపురంలో నిప్పులు పోసింది ఈమె!' హీరో ఆరోపణపై ఖుష్బూ రియాక్షన్
'నా కాపురంలో నిప్పులు పోసింది ఈమె!' హీరో ఆరోపణపై ఖుష్బూ రియాక్షన్
ముళ్ల వంకాయలతో ఇలా కూర చేస్తే ఎవ్వరికైనా నచ్చుద్ది
ముళ్ల వంకాయలతో ఇలా కూర చేస్తే ఎవ్వరికైనా నచ్చుద్ది
ఎమర్జెన్సీ అని వడ్డీలకు డబ్బులు తీసుకుంటున్నారా? జాగ్రత్త.
ఎమర్జెన్సీ అని వడ్డీలకు డబ్బులు తీసుకుంటున్నారా? జాగ్రత్త.
అతనిని బాగా నమ్మి మోసపోయా.. బ్రేకప్ స్టోరీ చెప్పిన అనన్య నాగళ్ల
అతనిని బాగా నమ్మి మోసపోయా.. బ్రేకప్ స్టోరీ చెప్పిన అనన్య నాగళ్ల
కొబ్బరికాయ కొట్టినప్పుడు అందులో పువ్వు వస్తే మంచిదేనా.? 99% మంది
కొబ్బరికాయ కొట్టినప్పుడు అందులో పువ్వు వస్తే మంచిదేనా.? 99% మంది
చావో రేవో తేల్చుకోనున్న చెన్నై.. టాప్ 2 కోసం గిల్ సేన గురి
చావో రేవో తేల్చుకోనున్న చెన్నై.. టాప్ 2 కోసం గిల్ సేన గురి
భారత్ ఖనిజాల హబ్‌గా ఆ రాష్ట్రం? బంగారం కన్నా విలువైన నిధి లభ్యం!
భారత్ ఖనిజాల హబ్‌గా ఆ రాష్ట్రం? బంగారం కన్నా విలువైన నిధి లభ్యం!
ఈవీలు కొనండి.. క్యాష్ పొందండి.. ఉద్యోగులకు ఆ కంపెనీ బంపర్ ఆఫర్
ఈవీలు కొనండి.. క్యాష్ పొందండి.. ఉద్యోగులకు ఆ కంపెనీ బంపర్ ఆఫర్
భారత బిలియనీర్లు తమ డబ్బును ఎందులో పెట్టుబడి పెడ్తున్నారో తెలుసా?
భారత బిలియనీర్లు తమ డబ్బును ఎందులో పెట్టుబడి పెడ్తున్నారో తెలుసా?