AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movie: 2040లో లవ్, బ్రేకప్స్ ఇలా ఉంటాయా? అప్పుడే ఓటీటీలోకి వచ్చేసిన ప్రదీప్ రంగనాథన్ కొత్త సినిమా

ఏప్రిల్ 10న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా డీసెంట్ హిట్ గా నిలిచింది. మరీ బ్లాక్ బస్టర్ రేంజ్ లో కాకపోయినా బాక్సాఫీస్ వద్ద ఓ మోస్తరు వసూళ్లను రాబట్టింది. ఇప్పుడీ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. బుధవారం (మే 06) అర్ధరాత్రి నుంచే స్ట్రీమింగ్ కు వచ్చింది.

OTT Movie: 2040లో లవ్, బ్రేకప్స్ ఇలా ఉంటాయా? అప్పుడే ఓటీటీలోకి వచ్చేసిన ప్రదీప్ రంగనాథన్ కొత్త సినిమా
Love Insurance Kompany Movie
Basha Shek
|

Updated on: May 06, 2026 | 6:43 AM

Share

లవ్ టుడే, డ్యూడ్‌, డ్రాగన్ వంటి హ్యాట్రిక్ హిట్స్ తర్వాత కోలీవుడ్ క్రేజీ హీరో ప్రదీప్ రంగనాథన్ నటించిన సినిమా లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ(ఎల్‌ఐకే). నయనతార భర్త విఘ్నేశ్ శివన్ తెరకెక్కించిన ఈ లవ్ రొమాంటిక్ డ్రామాలో ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి హీరోయిన్ గా నటించింది. ఎస్ జే సూర్య మరో కీలక పాత్రలో ఆకట్టుకున్నారు. ఏప్రిల్ 10న థియేటర్లలో రిలీజైన ఈ చిత్రానికి డీసెంట్ హిట్ గా నిలిచింది. తమిళంతో పాటు తెలుగులోనూ మంచి వసూళ్లనే రాబట్టింది. అయితే ప్రదీప్ గత సినిమాలతో పోల్చుకుంటే ఈ ఎల్‌ఐకే సినిమా యావరేజ్ రిజల్ట్ తోనే సరిపెట్టుకుంది. 2040 కాలంలో ఒక యాప్ ఆధారంగా లవ్, బ్రేకప్స్ ఎలా ఉంటాయనేది ఇందులో వినోదాత్మకంగా చూపించారు దర్శకుడు విఘ్నేష్ శివన్. అయితే సినిమా కాన్సెప్ట్ బాగున్నా, దాన్ని ఎంగేజింగ్‌గా తెరకెక్కించడంలో దర్శకుడు విఫలమయ్యాడని రివ్యూలు వచ్చాయి. స్క్రీన్ ప్లే విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుని ఉంటే బాగుండేదన్న కామెంట్స్ వినిపించాయి.

థియేటర్లలో ఓ మోస్తరుగా ఆడిన లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో బుధవారం ( మే 06) అర్ధ రాత్రి నుంచే ఈ ఫ్యూచరిస్టిక్ లవ్ స్టోరీ డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చేసింది. తమిళంతో పాటు తెలుగులోనూ ఈ మూవీ అందుబాటులో ఉంది. నయనతార, ఎస్.ఎస్. లలిత్ కుమార్ సంయుక్తంగా నిర్మించిన ఈ ఎల్ఐకే సినిమాలో యోగి బాబు, సీమాన్, గౌరీ కిషన్, షా రా, మాళవిక తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. అనిరుధ్ రవిచందర్ స్వరాలు సమకూర్చారు. మరి థియేటర్లలో ఈ సినిమాను మిస్ అయ్యారా? అయితే ఎంచెక్కా ఇంట్లోనే చూసి ఎంజాయ్ చేయండి.

ఇవి కూడా చదవండి

జీ5లో ప్రదీప్ రంగనాథన్ కొత్త సినిమా..

మొత్తం 5 భాషల్లో స్ట్రీమింగ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర