YSRCP vs TDP: టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థిపై దాడి..!
గుంటూరు జిల్లాలో లోకల్‌ఫైట్ రియల్‌ఫైట్‌కు దారి తీసింది. మాచవరం మండల పరిషత్ నామినేషన్ కార్యక్రమంలో వైసీపీ-టీడీపీ కార్యకర్తలు పరస్పరం దాడులకు దిగారు.
గుంటూరు జిల్లాలో లోకల్‌ఫైట్ రియల్‌ఫైట్‌కు దారి తీసింది. మాచవరం మండల పరిషత్ నామినేషన్ కార్యక్రమంలో వైసీపీ-టీడీపీ కార్యకర్తలు పరస్పరం దాడులకు దిగారు. మాచవరం మండలం పిన్నెల్లిలో టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థిపై దాడి జరిగింది. అతడు నామినేషన్ వేసేందుకు వెళుతుండగా వైసీపీ శ్రేణులు అడ్డుకున్నారు. దీంతో ఎంపీడీవో కార్యాలయం దగ్గర ఉద్రిక్తత నెలకొంది. ఇరువర్గాలకు పోలీసులు సర్ది చెబుతున్న సమయంలో ఒక్కసారిగా టీడీపీ, వైసీపీ నేతలు ఒకరి మీద ఒకరు దాడులు చేసుకున్నారు. కుర్చీలతో కొట్టుకున్నారు. వెంటనే అలర్ట్ అయిన పోలీసులు ఇరువర్గాలను అక్కడ నుంచి పంపించారు.
మరోవైపు చిత్తూరు జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ దాఖలు సమయంలో కొన్ని చోట్ల ఉద్రిక్తతలు చోటు చేసుకుంటున్నాయి. సదుం ఎంపీడీవో కార్యాలయంలో బీజేపీ నేత హరిబాబు నామినేషన్ దాఖలు చేసేందుకు వెళ్లగా.. ఆ సమయంలో కొందరు తనను నామినేషన్ వేయకుండా అడ్డగించారని ఆయన ఆరోపించారు. వైసీపీ నేతలే కావాలని తనను అడ్డగిస్తూ దూషిస్తున్నారని అన్నారు. ఒకానొక సమయంలో రాళ్లతో దాడి చేయబోయారంటూ వైసీపీపై బీజేపీ స్థానిక నేతలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ప్రస్తుతం అక్కడ ఉద్రిక్తవాతావరణం కొనసాగుతోంది.