జ్యోతిని హత్య చేసింది అతడే: పోలీసులు

గుంటూరు: మంగళగిరిలో దారుణ హత్యాచారానికి గురైన జ్యోతి కేసును పోలీసులు ఎట్టకేలకు చేధించినట్లు తెలుస్తోంది. జ్యోతి మృతదేహానికి రీ పోస్టు మార్టం నిర్వహించిన పోలీసులు..  ఆ వివరాలను  మాత్ర ఇంకా వెల్లడించలేదు. అయితే ప్రియుడు శ్రీనివాస్‌ ఆమెను హత్య చేశాడని  నిర్ధారణకు వచ్చారు. పెళ్లి చేసుకోమని నిలదీసినందుకే శ్రీనివాస్, జ్యోతిని హత్య చేయించినట్లు వారు భావిస్తున్నారు. అయితే సర్టిఫికేట్స్ తీసుకువస్తానని చెప్పి ఈ నెల 11న ఇంటి నుంచి వెళ్లిన జ్యోతి దారుణ హత్యకు గురైంది. ఆ […]

  • Tv9 Telugu
  • Publish Date - 5:35 pm, Fri, 15 February 19
జ్యోతిని హత్య చేసింది అతడే: పోలీసులు

గుంటూరు: మంగళగిరిలో దారుణ హత్యాచారానికి గురైన జ్యోతి కేసును పోలీసులు ఎట్టకేలకు చేధించినట్లు తెలుస్తోంది. జ్యోతి మృతదేహానికి రీ పోస్టు మార్టం నిర్వహించిన పోలీసులు..  ఆ వివరాలను  మాత్ర ఇంకా వెల్లడించలేదు. అయితే ప్రియుడు శ్రీనివాస్‌ ఆమెను హత్య చేశాడని  నిర్ధారణకు వచ్చారు. పెళ్లి చేసుకోమని నిలదీసినందుకే శ్రీనివాస్, జ్యోతిని హత్య చేయించినట్లు వారు భావిస్తున్నారు.

అయితే సర్టిఫికేట్స్ తీసుకువస్తానని చెప్పి ఈ నెల 11న ఇంటి నుంచి వెళ్లిన జ్యోతి దారుణ హత్యకు గురైంది. ఆ సమయంలో శ్రీనివాస్ జ్యోతి పక్కనే ఉండగా.. గుంపుగా వచ్చిన కొందరు యువకులు ఆమెపై అత్యాచారం చేసి, హత్య చేశారు. శ్రీనివాస్‌ను తీవ్రంగా గాయపరిచారు. అయితే ఇదంతా శ్రీనివాస్ పథకం ప్రకారమే చేయించాడని జ్యోతి కుటుంబసభ్యులు ఆరోపిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్న పోలీసులు శ్రీనివాస్‌ హత్య చేసినట్లు నిర్ధారణకు వచ్చారు. మరోవైపు ఈ కేసులో ఇప్పటికే రూరల్‌ సీఐ బాలాజీని సస్పెండ్‌ చేసిన ఉన్నతాధికారులు ఎస్‌ఐ బాబూరావును వీఆర్‌కు పంపడంతోపాటు ఇద్దరు కానిస్టేబుళ్లపై సస్పెన్షన్‌ వేటు వేశారు.