పార్టీ మారను: కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క
అభివృద్ధి పనుల కోసమే ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ను కలిశానని కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క స్పష్టతనిచ్చారు. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో మాట్లాడిన సీతక్క.. ప్రభుత్వం తన పోరాటాన్ని కొనసాగిస్తామన్నారు. సీఎంకు ఇచ్చే విఙ్ఞప్తులు, వినతులు కూడా పోరాటంలో భాగమేనని ఆమె అన్నారు. తాను చెప్పిన పలు సమస్యలపై ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారని చెప్పారు. తాను ప్రభుత్వం పట్ల మెతక వైఖరి అవలంభిస్తున్నానని వస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని, పార్టీ మారే ఆలోచన కూడా తనకు […]
అభివృద్ధి పనుల కోసమే ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ను కలిశానని కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క స్పష్టతనిచ్చారు. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో మాట్లాడిన సీతక్క.. ప్రభుత్వం తన పోరాటాన్ని కొనసాగిస్తామన్నారు. సీఎంకు ఇచ్చే విఙ్ఞప్తులు, వినతులు కూడా పోరాటంలో భాగమేనని ఆమె అన్నారు. తాను చెప్పిన పలు సమస్యలపై ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారని చెప్పారు. తాను ప్రభుత్వం పట్ల మెతక వైఖరి అవలంభిస్తున్నానని వస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని, పార్టీ మారే ఆలోచన కూడా తనకు లేదని సీతక్క పేర్కొన్నారు. కాగా ఇటీవల కేసీఆర్ను కవిత కలవడంపై పలు రకాల వార్తలు వచ్చాయి. త్వరలో ఆమె టీఆర్ఎస్లో చేరబోతున్నట్లు పుకార్లు గుప్పుమన్నాయి.