మంచు ఎఫెక్ట్: ఆదిలాబాద్ జిల్లా స్కూళ్ల వేళల్లో మార్పులు!
తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. అందులోనూ తెలంగాణ రాష్ట్రం ఆదిలాబాద్ జిల్లాలో ఉష్ణోగ్రతలు మరింత దారుణంగా ఉన్నాయి. ఆదిలాబాద్‌లో తీవ్రమైన చలితీవ్రత దృష్ట్యా స్కూళ్ల సమయాల్లో మార్పులు చేశారు విద్యాశాఖ అధికారులు. ఉదయం 10 గంటలకు స్కూళ్లు తెరవాలని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్.. అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఉత్తరాది నుంచి చలిగాలులు వీస్తుండటంతో చలి మరింత పెరిగింది. కాగా.. ఇక తెలంగాణ రాజధానిలో కూడా చలి తీవ్రత ఎక్కువగా ఉంది. అర్థరాత్రి నుంచి ఉదయం […]
తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. అందులోనూ తెలంగాణ రాష్ట్రం ఆదిలాబాద్ జిల్లాలో ఉష్ణోగ్రతలు మరింత దారుణంగా ఉన్నాయి. ఆదిలాబాద్‌లో తీవ్రమైన చలితీవ్రత దృష్ట్యా స్కూళ్ల సమయాల్లో మార్పులు చేశారు విద్యాశాఖ అధికారులు. ఉదయం 10 గంటలకు స్కూళ్లు తెరవాలని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్.. అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఉత్తరాది నుంచి చలిగాలులు వీస్తుండటంతో చలి మరింత పెరిగింది. కాగా.. ఇక తెలంగాణ రాజధానిలో కూడా చలి తీవ్రత ఎక్కువగా ఉంది. అర్థరాత్రి నుంచి ఉదయం 9 గంటల వరకూ మంచు కురుస్తోంది.
అలాగే.. ఏపీ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తీవ్రమైన చలి ఉంది. ముఖ్యంగా విశాఖ ఏజెన్సీలో చలికి ప్రజలు గజగజా వణికిపోతున్నారు. ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోయాయి. ఉదయం 10 గంటల వరకూ సూర్యుని జాడే కనిపించడం లేదు. అరకు ప్రాంతం మొత్తం పొగమంచు ఆవహించింది. కాగా.. మినుమలూరులో 8 డిగ్రీలు, పాడేరు, అరకులో అత్యల్పంగా 6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయ్యింది. దీంతో.. వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. పలు ప్రదేశాల్లో రోడ్డు ప్రమాదాలు కూడా చోటుచేసుకుంటున్నాయి.