పులివెందుల ఎస్సైని ఢీకొట్టే ప్రయత్నం చేసిన వ్యక్తి అరెస్ట్‌

కడప జిల్లా పులివెందులలో అక్రమంగా మద్యాన్ని తరలించడమే కాకుండా.. అడ్డుకునేందుకు ప్రయత్నించిన ఎస్సై గోపినాథ్‌ రెడ్డిని ఆ వాహనంలోని

  • Tv9 Telugu
  • Publish Date - 9:43 am, Sun, 30 August 20
పులివెందుల ఎస్సైని ఢీకొట్టే ప్రయత్నం చేసిన వ్యక్తి అరెస్ట్‌

Pulivendula SI Gopinath Reddy: కడప జిల్లా పులివెందులలో అక్రమంగా మద్యాన్ని తరలించడమే కాకుండా.. అడ్డుకునేందుకు ప్రయత్నించిన ఎస్సై గోపినాథ్‌ రెడ్డిని నిందితులు ఢీ కొట్టే ప్రయత్నం చేసిన విషయం తెలిసిందే. ఆ సమయంలో ఎస్సై కారు ముందు భాగాన్ని పట్టుకోగా.. రెండు కిలోమీటర్ల మేర కారును పోనించారు. ఇక ఈ కేసులో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు సింహాద్రిపురానికి చెందిన నాగేశ్వర్ రెడ్డిగా గుర్తించారు. అతడిపై గతంలో పలు చోరీ కేసుల్లో అభియోగాలు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.

కాగా మరోవైపు ఎస్సై గోపినాథ్‌‌ రెడ్డిపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఆయన ధైర్య సాహసాలను డీజీపీ గౌతమ్ సవాంగ్ మెచ్చుకున్నారు. అంతేకాదు డీజీపీ చేతుల మీదుగా ఇచ్చే అత్యున్నత పురస్కారం ఇవ్వడానికి ప్రతిపాదనలు పంపాలని డీజీపీ గౌతమ్ సవాంగ్‌ ఉన్నతాధికారులకు ఆదేశించిన విషయం తెలిసిందే.

Read More:

జగన్‌ ఆదేశాలు.. విధుల్లోకి సింహాచలం ఔట్‌సోర్సింగ్ సిబ్బంది

అంకితాపై రియా వివాదాస్పద వ్యాఖ్యలు