జగన్‌ ఆదేశాలు.. విధుల్లోకి సింహాచలం ఔట్‌సోర్సింగ్ సిబ్బంది

సింహాచలంలోని శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామి దేవాలయంలో ఇటీవల తాత్కాలికంగా నిలిపివేసిన ఔట్ సోర్సింగ్‌, కాంట్రాక్ట్ సిబ్బంది మళ్లీ విధుల్లో చేశారు

జగన్‌ ఆదేశాలు.. విధుల్లోకి సింహాచలం ఔట్‌సోర్సింగ్ సిబ్బంది
Follow us

| Edited By:

Updated on: Aug 30, 2020 | 9:17 AM

Simhachalam Temple News: సింహాచలంలోని శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామి దేవాలయంలో ఇటీవల తాత్కాలికంగా నిలిపివేసిన ఔట్ సోర్సింగ్‌, కాంట్రాక్ట్ సిబ్బంది మళ్లీ విధుల్లో చేశారు. వారిని విధుల్లోకి తీసుకుంటున్నట్లు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ”లాక్‌డౌన్ వలన దేవస్థానం ఆదాయం బాగా పడిపోయింది. జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా లేదు. అందుకే కొందరు ఔట్‌ సోర్సింగ్‌, కాంట్రాక్ట్ సిబ్బందిని తాత్కాలికంగా నిలిపివేశాము. వారి ఇబ్బందులను సీఎం వైఎస్ జగన్ దృష్టికి తీసుకెళ్లగా.. ఆయన మానవతా దృక్పథంతో స్పందించి, తిరిగి విధుల్లోకి తీసుకోవాలని దేవాదాయశాఖ మంత్రిని ఆదేశించారు” అని తెలిపారు. సీఎం జగన్‌తో పాటు రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి, దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, దేవస్థానం చైర్‌పర్సన్ సంచయిత గజపతిరాజు, దేవస్థానం ట్రస్ట్ బోర్టు సభ్యులకు కూడా కృతఙ్ఞతలు చెబుతున్నట్లు అవంతి పేర్కొన్నారు.

ఇక దేవస్థానం విషయంలో రాజకీయాలొద్దని ఈ సందర్భంగా మంత్రి అవంతి శ్రీనివాసరావు అన్ని రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి చేశారు. దేవస్థానం భూములను లీజులకిచ్చే నిర్ణయం కొత్తగా తాము తీసుకున్నట్టుగా ప్రచారం చేయడం తగదని.. గతంలో ఈ భూములను లీజులకు ఇచ్చింది ఎవరని ప్రశ్నించారు. దేవస్థానంతో ముడిపడి ఉన్న పంచగ్రామాల భూ సమస్య త్వరలోనే పరిష్కారం అవుతుందని మంత్రి ధీమా వ్యక్తం చేశారు. ఇక ఈ సందర్భంగా విధుల్లో చేరిన సిబ్బంది జగన్‌ ప్రభుత్వానికి కృతఙ్ఞతలు తెలిపారు.

Read More:

అంకితాపై రియా వివాదాస్పద వ్యాఖ్యలు

‘బిగ్‌బాస్‌ 4’ ఎంట్రీపై నటి క్లారిటీ