Vizag: దండిగా సొమ్ములిస్తుంది అనుకుంటే.. సొమ్మసిల్లేలా చేస్తోన్న ట్యూనా చేప.. కేజీ రూ.50కే
కరోనా వేసిన కాటు అంతా ఇంతా కాదు.. ఒకటి, రెండు రంగాలు అని కాదు.. అన్ని రంగాలను కుదిపేసింది. అంతర్జాతీయ మార్కెట్ వెళ్లలేక ట్యూనా ఫిస్ విలవిలలాడుతోంది. కోవిడ్ దెబ్బకు...
కరోనా వేసిన కాటు అంతా ఇంతా కాదు.. ఒకటి, రెండు రంగాలు అని కాదు.. అన్ని రంగాలను కుదిపేసింది. అంతర్జాతీయ మార్కెట్ వెళ్లలేక ట్యూనా ఫిస్ విలవిలలాడుతోంది. కోవిడ్ దెబ్బకు ఎగుమతులు పడిపోవటంతో ఒకప్పుడు మార్కెట్లో కేజీ 200 రూపాయలు పలికే ట్యూనా చేప ధర ఇప్పుడు ఏకంగా 50 రూపాయలకు పడిపోయింది. అసలే గిట్టుబాటు ధర లేక దిగులు చెందుతున్న విశాఖ మత్స్యకారులకు కాకినాడ మత్స్యకారులు మార్కెట్‌లో పోటీ ఇస్తుండటంతో రెండు వర్గాలు ఢీ అంటే ఢీ అంటున్నాయి. రుచికి, రుచి.. పోషకాలకు, పోషకాలు.. అంతకు మించి అంతర్జాతీయ మార్కెట్లో భలే గిరాకీ. ఇదీ ట్యూనా చేప ప్రత్యేకం. అనేక పోషకాలతో పాటు విలువైన మెడిసినల్ వాల్యూస్ ట్యూనా సొంతం. సాధారణ రోజుల్లో ఈ చేపలు జపాన్, చైనా, యూరోపియన్ కంట్రీస్‌కి ఎగుమతి అయ్యేవి. అయితే కోవిడ్ పారామీటర్స్ వల్ల అనేక ఇబ్బందులు ఏర్పడటంతో కొన్ని నెలలుగా సరుకంతా డొమెస్టిక్ మార్కెట్‌కే పరిమితమవుతోంది. కేరళ, తమిళనాడులో ట్యూనా చేప తినడానికి ఎక్కువ మంది ఆసక్తి చూపుతుంటారు. వ్యాపారులు సిండికేట్ అవుతూ చేపల ధరలను నియంత్రిస్తూ మత్స్యకారుల కష్టాన్ని దోచుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనికి తోడు కేరళ నుంచి ఎగుమతి అవుతుండటంతో అక్కడి వరకు అయ్యే ట్రాన్స్‌పోర్ట్ ఖర్చు కూడా మత్స్యకారులపైనే వేస్తున్నారoటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ట్యూనా చేపలు ఒరిస్సా, వెస్ట్ బెంగాల్ సముద్రతీరంలో 300 నుంచి 500 మీటర్ల లోతులో సముద్ర జలాల్లో లభ్యమవుతాయి. ఏపీలో కాకినాడ, ఉప్పాడ మొదలు.. విశాఖ జిల్లాకు చెందిన ఫిషర్ మెన్ అంతా ట్యూనా చేప కోసం ఒరిస్సా, వెస్ట్ బెంగాల్ సముద్రతీరం వైపు వేట కొనసాగిస్తారు. తిరుగు ప్రయాణంలో కాకినాడ, విశాఖ మత్స్యకారులు వేటాడిన చేపలను విశాఖలో అమ్మేస్తున్నారు. కరోనా తమను కోలుకోని విధంగా దెబ్బతీసిందని అంటున్నారు వ్యాపారులు.
కాకినాడ మత్స్యకారులు విశాఖలో చేపలు అమ్మడాన్ని విశాఖ జిల్లా మత్స్యకారులు అభ్యంతరం చెబుతున్నారు. ఒక్కసారిగా మార్కెట్‌లోకి సరుకు వచ్చి చేరుతుండటంతో ధర తగ్గిపోతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అందుకే కాకినాడ మత్స్యకారులు.. వారి ప్రాంతంలోనే చేపలు విక్రయించుకోనేలా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. ఈ విషయంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంటుంది. దీనికి ప్రభుత్వం పరిష్కారం చూపాలని విశాఖ మత్స్యకారులు కోరుతున్నారు.
Also Read: Viral Video: బుజ్జి.. బుజ్జి కోబ్రాలు ఎలా పడగ విప్పి ఆడుతున్నాయో చూడండి..