AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Horse riding: గుర్రపు స్వారీకి సై అంటున్న యువత.. బెజవాడలో పెరుగుతున్న ఆదరణ!

రాజరికపు కుటుంబంలో గుర్రపు స్వారి రాని వారంటు ఉండరు. రాజులు నడయాడిన నేల గుర్రాలకు తెలుసంటారు. రాజులు గుర్రపు స్వారీ చేసుకుంటూ ఒక మార్గంలో వెళ్తే, మరలా అదే మార్గంలో గుర్రం తనంతట తానే వస్తుందట. అంతటి జ్ఞానం గుర్రానికి ఉందని పెద్దలు అంటున్నారు. రాజరికపు కాలంలో సుదూర ప్రయాణాలకు గుర్రాలు ఒక్కటే శరణ్యంగా ఉండేది. గత కొంతకాలంగా తగ్గిపోయిన గుర్వపు స్వారీలకు విశాఖలో మళ్లీ ఆధరణ పెరుగుతోంది.

Horse riding: గుర్రపు స్వారీకి సై అంటున్న యువత.. బెజవాడలో పెరుగుతున్న ఆదరణ!
Horse Riding
M Sivakumar
| Edited By: |

Updated on: Jun 30, 2025 | 4:49 PM

Share

గుర్రపు స్వారీలు ఒక ఉల్లాసం గుర్రాలపై స్వారీ చేయడం భలే సరదాగా ఉంటుందని రైడర్స్ అంటున్నారు. ఇందుకోసం నిష్ణాతుల సమక్షంలో రైడర్స్ శిక్షణ తీసుకొంటున్నారు. పరుగు పందాల మాదిరిగానే, గుర్రాల స్వారీ పోటీలు జరుగుతున్నాయి. విజయవాడలో గుర్రపు స్వారీలకు స్కూల్ కరస్పాండెంట్ కోర్స్‌తో శిక్షణ ఇస్తున్నారు. ఉదయం 6 నుండి 10 గంటల వరకు గుర్రంపై శిక్షణ ఇస్తున్నారు. గత మూడు సంవత్సరాల నుండి ఇక్కడ గుర్రపు స్వారీలకు శిక్షణ కొనసాగుతుంది. రోజుకి అరగంట, ఇరవై రోజులు మాత్రమే శిక్షణ ఉంది. క్రీడలు మానసిక ఉల్లాసానికి, శరీరధారుడ్యానికి ఎంతగానో ఉపయోగపడుతాయి. అందులో భాగంగా గుర్రపు స్వారీ కూడా మానసిక ఉల్లాసానికి, శరీరధారుడ్యానికి ఎంతగానో ఉపయోగ పడుతుందనీ శిక్షణ నిపుణులు అంటున్నారు.

ప్రపంచంలో గొప్ప వ్యాయామం గుర్రపు స్వారీ మాత్రమే అని గుర్రపు స్వారీ శిక్షణ నిపుణులు చెపుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో మొదటి సారిగా గుర్రపు రైడ్ శిక్షణ ఇక్కడ ఇస్తున్నామని. చిన్న, పెద్ద, ఆడ, మగ అనే తేడా లేకుండా గుర్రపు స్వారీ నేర్చుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. రిజిస్ట్రేషన్ చేసుకొంటే, మనసు పెట్టి 20 రోజులలో గుర్రపు స్వారీ నేర్చుకోవచ్చంటున్నారు. గుర్రాలను ఒక చోట ఉంచే ప్రదేశాన్ని టేబుల్స్ అంటారు. గుర్రాలకు ఆలనా పాలన ఇందులోనే జరుగుతుందిని తెలిపారు.

వీడియో చూడండి…

ప్రస్తుతం అనేకమంది క్రీడాకారులు వివిధ కళల వైపు మొగ్గు చూపుతున్నారు. ఐతే గుర్రపు స్వారీ కూడా ఓకళ. అంతరించిపోతున్న ఈ కళను అందరికి ఉపయోగపడాలని ఉద్దేశంతో ఈ ప్రాంతంలో గుర్రపు స్వారీ శిక్షణ ప్రాంభించడం జరిగిందని శిక్షణ నిపుణులు అంటున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.