AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP Polycet 2025 Counselling: పాలిసెట్‌ కౌన్సెలింగ్‌కు లైన్ క్లియర్.. మళ్లీ ప్రారంభమైన ప్రవేశాల ప్రక్రియ!

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పాలిటెక్నిక్‌ కళాశాలల్లో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి పలు పాలిటెక్నిక్‌ కోర్సుల్లో ప్రవేశాలకు పాలిసెట్‌ కౌన్సెలింగ్‌ సోమవారం (జూన్‌ 30) నుంచి ప్రారంభమైంది. నిజానికి పాలీసెట్‌ కౌన్సెలింగ్‌ ప్రక్రియ జూన్ 20వ తేదీ నుంచే ప్రారంభంకావల్సి ఉంది. అయితే కళాశాలలకు అనుమతుల జారీలో జాప్యం..

AP Polycet 2025 Counselling: పాలిసెట్‌ కౌన్సెలింగ్‌కు లైన్ క్లియర్.. మళ్లీ ప్రారంభమైన ప్రవేశాల ప్రక్రియ!
Polycet Counselling
Srilakshmi C
|

Updated on: Jun 30, 2025 | 6:26 PM

Share

అమరావతి, జూన్‌ 30: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పాలిటెక్నిక్‌ కళాశాలల్లో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి పలు పాలిటెక్నిక్‌ కోర్సుల్లో ప్రవేశాలకు పాలిసెట్‌ కౌన్సెలింగ్‌ సోమవారం (జూన్‌ 30) నుంచి ప్రారంభమైంది. నిజానికి పాలీసెట్‌ కౌన్సెలింగ్‌ ప్రక్రియ జూన్ 20వ తేదీ నుంచే ప్రారంభంకావల్సి ఉంది. అయితే కళాశాలలకు అనుమతుల జారీలో జాప్యం జరగడంతో ఈ ప్రక్రియను వాయిదా వేశారు. దీంతో మొదట ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం జూన్‌ 20 నుంచి కౌన్సెలింగ్‌ ప్రారంభం కావాల్సిన కౌన్సెలింగ్‌ జూన్‌ 30కి వాయిదా పడింది.

ఈ మేరకు సాంకేతి విద్యాశాఖ తెలిపింది. పాలీసెట్‌ పరీక్ష రాసిన విద్యార్ధులు ఈ రోజు నుంచి ఆన్‌లైన్‌ విధానంలో వెబ్ ఆప్షన్ల నమోదుకు విండో తెరచుకుంది. ఫీజు చెల్లింపుల అనంతరం.. వెబ్‌ ఆప్షన్ల నమోదు ఇవ్వవల్సి ఉంటుంది. అనంతరం సీట్లు కేటాయించనున్నారు. ఎంట్రెన్స్ పరీక్షలో అర్హత సాధించిన విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. జూన్‌ 30 నుంచి జులై 5 వరకు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు. జులై 6న వెబ్ ఐచ్చికాల మార్పు 9న సీట్లు కేటాయిస్తారు. సీట్లు పొందిన విద్యార్థులు జులై 10 నుంచి 14 లోపు కళాశాలల్లో చేరాల్చి ఉంటుంది. జులై 10 నుంచి తరగతులు ప్రారంభమవనున్నాయి. జూన్‌ 30 నుంచి జులై 2, 3న 50,001 నుంచి 90వేలు జులై 90,001 నుంచి చివరి ర్యాంకు వరకు వెబ్‌ఐచ్ఛి కాల నమోదుకు ఆవకాశం కల్పించనున్నారు.

కాగా ఈ ఏడాది ఏప్రిల్‌ 30న పాలిసెట్‌ పరీక్ష నిర్వహించగా.. ఫలితాలను మే 14న విడుదల చేశారు. పాలిసెట్‌ పరీక్షకు మొత్తం 1,39,840 మంది హాజరుకాగా.. ఇందులో 1,33,358 మంది అర్హత సాధించారు. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కోసం పాలిసెట్ ర్యాంక్ కార్డు, హాల్ టికెట్ నెంబర్, పదో తరగతి మెమో, స్టడీ సర్టిఫికెట్ వివరాలను నమోదు చేయవల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ పూర్తి అయిన తర్వాత కాలేజీల కోసం వెబ్ ఆప్షన్లను ఎంచుకోవల్సి ఉంటుంది. ఏపీ పాలిసెట్ కౌన్సెలింగ్ ప్రక్రియలో సందేహాలు ఉన్నవారు convenorpolycetap2025@gmail.com కు మెయిల్ చేయవచ్చు. లేదంటే 7995681678, 7995865456, 9177927677 హెల్ప్ లైన్ నెంబర్లకు ఫోన్‌ చేసి సంప్రదించవచ్చు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.