Vizag Beach: సముద్రుడి ఉగ్రరూపానికి కారణం ఇదే.. తేల్చిచెప్పిన GVMC ఇంజనీర్లు..

విశాఖ ఆర్కేబీచ్‌లోని చిల్డ్రన్స్ పార్క్‌లో కోతకు గురైన ప్రాంతాన్ని GVMC ఇంజనీర్లు పరిశీలించారు. ఆంధ్రా యూవివర్సిటీ మెట్రోలాజికల్, సివిల్ ఇంజనీర్లు కూడా వారి వెంట వెళ్లి.. కోతకు కారణాలపై..

Vizag Beach: సముద్రుడి ఉగ్రరూపానికి కారణం ఇదే.. తేల్చిచెప్పిన GVMC ఇంజనీర్లు..
Damages Area At The Kids' P
Follow us

|

Updated on: Dec 06, 2021 | 11:59 AM

విశాఖ ఆర్కేబీచ్‌లోని చిల్డ్రన్స్ పార్క్‌లో కోతకు గురైన ప్రాంతాన్ని GVMC ఇంజనీర్లు పరిశీలించారు. ఆంధ్రా యూవివర్సిటీ మెట్రోలాజికల్, సివిల్ ఇంజనీర్లు కూడా వారి వెంట వెళ్లి.. కోతకు కారణాలపై అధ్యయనం చేస్తున్నారు. జోవాద్‌ ఎఫెక్ట్‌తో సాగరతీరం అల్లకల్లోలంగా మారింది. విశాఖలో రాకాసి అలల ధాటికి 70 మీటర్ల పొడవున కాంక్రీట్‌ గోడ కూలిపోయింది. అక్కడి నేల కుంగిపోయింది. చిన్నపిల్లల పార్క్‌ దెబ్బతింది. బీచ్ వెంట భూమి బీభత్సమైన కోతకు గురైంది. అలర్టయిన అధికార యంత్రాంగం.. పార్క్‌కి వచ్చే దారులన్నింటిని మూసివేశారు. పర్యాటకుల రాకపోకలపై నిషేధం విధించారు.

జోవాద్‌ తుపానుకు అమావాస్య తోడవడంతో సముద్రుడు మరింత ఉగ్రుడయ్యాడు. కెరటాలు తీరాన్ని దాటుకుని వందల మీటర్ల మేర ముందుకొచ్చాయి. దీంతో ఎప్పుడేం జరుగుతుందోనన్న ఆందోళన మొదలైంది.

అటు తూర్పుగోదావరి జిల్లా కాకినాడ సమీపంలోని ఉప్పాడ తీరంలో సముద్రం అల్లకల్లోలంగా మారింది. ఉవ్వెత్తున్న విరుచుకుపడ్డ అలల తాకిడికి ఉప్పాడ-కాకినాడ బీచ్ రోడ్డు ధ్వంసమైంది.

పెద్ద బ్రిడ్జి ఒకవైపు వంగిపోవడం ప్రమాద ఘంటికలు మోగించింది. ఉప్పాడ మార్కెట్ సెంటర్, మాయాపట్నం, కోనపా పేట దగ్గర తీరం కోతకు గురైంది. ఇల్లు, కొబ్బరి చెట్లు సముద్రంలో కలిసిపోయాయి.

ఇవి కూడా చదవండి: Health Benefits: అయ్యో..! నలుపు అని ఫీల్ అవుతున్నారా.. ఇందులో ఆశ్చర్యకరమైన వాస్తవాలు దాగున్నాయి..

Omicron Tension: ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ఒమిక్రాన్‌ వేరియంట్‌.. 41 దేశాలకు పాకిన కొత్త వేరియంట్‌..!